Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

టాటా మోటార్స్ కి కొత్త మార్క్ గా నిలిచిన జైకా

డిసెంబర్ 09, 2015 06:50 pm raunak ద్వారా ప్రచురించబడింది

జైపూర్:

జైకా మరియు జెస్ట్ కార్లు టాటా కంపెనీ యొక్క ప్రయాణంలో మొదటి ముందడుగుగా చెప్పవచ్చు. ఈ శైలిలో జైకా మొదటి ఉత్పత్తి. చాలా కాలం నుండి కార్ల క్వాలిటీ, విశ్వసనీయత మరియు జీవిత కాలం విషయములో ఆరోపణలు ఎదుర్కొని, టాటా ఇప్పుడు అద్భుతంగా రూపాంతరం చెందింది. ఈ భూమిపై అత్యంత ఆదరణ కలిగిన క్రీడ ఫూట్ బాల్. లియోనల్ మెస్సి లాంటి ఆటగాడిని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా తేవడం కచ్చితంగా టాటా కి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రాబోయే జైకా మరియు ఇతర విశ్వ వ్యాప్త ఉత్పత్తులు అన్నింటికీ ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. నష్టాలతో బాధపడుతున్న ఒక బ్రిటిష్ కంపెనీ జెఎల్ఆర్ (జ్యాగ్వార్ లాండ్ రోవర్) ని ప్రపంచవ్యాప్తంగా లాభదాయకమైన కంపెనీగా నిలిపినటాటా కంపెనీ ఖచ్చితంగా తమ హోమ్ మార్కెట్ లో ఏదో ఒకటి చేస్తుంది. టాటా తమ కొత్త జైకా మరియు మునుముందు రోజుల్లో రాబోతున్న అన్ని మోడల్స్ ల లోను పూర్తి ఏకాగ్రత మరియు శ్రద్ధను కేంద్రీకరించి తయారుచేస్తుంది.

మొట్టమొదటిసారి మేము జైకా ని,ముందు భాగంలో ఉన్న టాటా బ్యాడ్జ్ ని చూసినపుడు ఆశ్చర్యానికి గురయ్యాము. దానిని మీరుఏ ఇతర టాటా హ్యాచ్ లతో పోల్చలేరు. టాటా కంపెనీ చెప్పిన ప్రకారం జైకాను ఇతర పోటీదారులకు దీటుగా యూరోపియన్ లుక్ కోసం యు.కె,ఇటలీ,ఇండియా లలో డిజైన్ చేశారు.టాటా యొక్క తరువాతి యెస్.యు.వి. నెక్సన్ కూడా నెక్సన్ కాన్సెప్ట్ పై ఆధారపడి ఉండబొతోంది. కొద్ది రోజుల క్రితం టాటా నెక్సన్ కాంపాక్ట్ యెస్.యు.వి మొదటి సారి బహిర్గతమైనది.

అంతేకాకుండా టాటా తమ కార్లలో అనేక ఫీచర్స్ టచ్‌స్క్రీన్, న్యావిగేషన్, డ్రైవింగ్ మోడ్స్, హార్మన్ పవర్డ్ ఆడియో యూనిట్స్ వంటి వాటిని అందిస్తోంది. ఈ ఆటొమేకర్ ఇంతకుముందు కూడా వీటిని అందిస్తూ వచ్చింది. టాటా సియారా, టాటా ఎస్టేట్ వంటి మోడల్స్ భారతదేశం లో పవర్ స్టీరింగ్, విద్యుత్ విండోస్ వంటి వాటిని కలిగిన మొట్టమొదటి కార్లు.

యాంత్రికంగా కూడా, టాటా పవర్ ట్రైన్ల కోసం ఫియట్ పై ఆధారపడటం ఆపేసింది. కొత్త జైకా డీజిల్ ఇంజిన్ల వాహనాల యొక్క కొత్త రివొటర్క్ కుటుంబాన్ని పరిచయం చేసింది. అందులో మొదటగా జైకాలో 1.05-లీటర్ రివొటర్క్ డీజిల్ ఇంజన్ ని చూడవచ్చు. నివేదికల ప్రకారం టాటా నెక్సన్ లో ఫియట్ యొక్క 1.3-లీటర్ మల్టీ-జెట్ కి బదులుగా స్వంతంగా తయారుచేసిన 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ని వాడనుంది. అంతేకాకుండా మధ్యంతర జెస్ట్ యొక్క ఇతర మోడల్స్ లో కూడా పవర్ ట్రేన్స్ వచ్చే అవకాశం కలదు.అంతేకాక, టాటా టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటార్ల విభాగంలో కూడా ఉంది. సంస్థలో ఇది చాలా పెద్ద భాగంగా ఉంది మరియు ప్రతీ విషయంలో గణనీయమైన అభివృద్ధిని పొందుతోంది. టాటా కోసం ఎలాంటి భవిష్యత్ ఉందో వేచి చూద్దాం..!

టాటా జైకా గురించి, మేము ఇప్పటివరకు చేసిన వాటిని చూడండి!

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.30.40 - 37.90 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.2.84 - 3.12 సి ఆర్*
కొత్త వేరియంట్
ఫేస్లిఫ్ట్
Rs.1.03 సి ఆర్*
కొత్త వేరియంట్
Rs.11.11 - 20.50 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర