కొన్ని డీలర్‌షిప్‌ల వద్ద ప్రారంభమైన Citroen C3 Aircross Automatic బుకింగ్‌లు
సిట్రోయెన్ aircross కోసం shreyash ద్వారా జనవరి 16, 2024 02:13 pm ప్రచురించబడింది
- 278 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్ జనవరి చివరి నాటికి విడుదల అయ్యే అవకాశం ఉంది.
-
సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ SUVని 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ తో అందించే అవకాశం ఉంది.
-
సిట్రోయెన్ నుండి వచ్చిన కాంపాక్ట్ SUV 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ (110 PS / 190 Nm) తో మాత్రమే అందించబడుతుంది.
-
ప్రస్తుతం టర్బో-పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో మాత్రమే లభిస్తుంది.
-
C3 ఎయిర్క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్ల ధర ప్రస్తుత మాన్యువల్ వేరియంట్ల కంటే రూ.1.3 లక్షలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్ సెప్టెంబర్ 2023 లో భారతదేశంలో విడుదల అయింది. ఇప్పటివరకు, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో మాత్రమే అందించబడింది, కానీ ఇప్పుడు కంపెనీ త్వరలో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంపికను అందించనున్నారు. మీరు ఈ మూడు వరుసల కాంపాక్ట్ SUV యొక్క ఆటోమేటిక్ వేరియంట్ ను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు సిట్రోయెన్ యొక్క కొన్ని డీలర్‌షిప్‌లను సందర్శించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
ఆటోమేటిక్ ఎంపిక
C3 ఎయిర్ క్రాస్ కారుతో ఏ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఎంపికను అందించనున్నారో కంపెనీ ఇంకా వెల్లడించలేదు, ఇది వివిధ ప్రపంచ మార్కెట్లలో విభిన్న ఎంపికలలో లభిస్తుంది. ఇది 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ (110 PS / 190 Nm) తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్తో జతచేయబడి ఉంటుంది. ప్రస్తుతం టర్బో-పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో మాత్రమే లభిస్తుంది.
ఇది కూడా చూడండి: చిత్రాల ద్వారా ఫేస్ లిఫ్ట్ కియా సోనెట్ HTK వేరియంట్ ను అన్వేషించండి
ఫీచర్లు & భద్రత
సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్ ఫీచర్ల జాబితాలో ఎటువంటి మార్పులు లేవు. ప్రస్తుతం C3 ఎయిర్ క్రాస్ లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో కూడిన 10.2 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఈ SUVలో 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, డెడికేటెడ్ AC వెంట్ లతో మూడవ వరుసకు మాన్యువల్ AC ఉన్నాయి. ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: విడుదలకు ముందే వెల్లడైన టాటా పంచ్ EV బ్యాటరీ మరియు పనితీరు వివరాలు
ఆశించిన ధర & ప్రత్యర్థులు
సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్ ధర ఆటోమేటిక్ వేరియంట్ మాన్యువల్ వేరియంట్ల కంటే రూ.1.3 లక్షలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం C3 ఎయిర్క్రాస్ ధర రూ.9.99 లక్షల నుంచి రూ.12.75 లక్షల (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా) మధ్యలో ఉంది. ఇది హోండా ఎలివేట్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.
మరింత చదవండి: సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్ ఆన్ రోడ్ ధర