Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

కొన్ని డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉన్న కొత్త హోండా అమేజ్

హోండా ఆమేజ్ కోసం dipan ద్వారా డిసెంబర్ 06, 2024 11:53 am ప్రచురించబడింది

కొత్త హోండా అమేజ్ యొక్క టెస్ట్ డ్రైవ్ ప్రారంభమైంది. ఈ సబ్-4m సెడాన్ కారు డెలివరీ జనవరి 2025 నుండి అందుబాటులో ఉంటుంది

  • కొత్త అమేజ్‌లో డ్యూయల్-పాడ్ LED హెడ్‌లైట్లు, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు LED టెయిల్ లైట్లు ఉన్నాయి.

  • క్యాబిన్‌లో బ్లాక్ మరియు బీజ్ థీమ్‌తో పాటు సీట్‌లపై బీజ్ లెథెరెట్ అప్హోల్స్టరీ ఉంది.

  • ఇది 8-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు ఆటో AC వంటి ఫీచర్లు కలిగి ఉంది.

  • భద్రత కోసం, 6 ఎయిర్‌బ్యాగ్‌లు (ప్రామాణికం), ADAS మరియు లేన్‌వాచ్ కెమెరా అందించబడ్డాయి.

  • ఇది 90 PS మరియు 110 Nm పవర్ అవుట్‌పుట్‌తో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లో లభిస్తుంది.

  • దీని ధర రూ. 8 లక్షల నుండి రూ. 10.90 లక్షల (ఎక్స్-షోరూమ్, పాన్-ఇండియా) మధ్య ఉంటుంది.

మూడవ తరం హోండా అమేజ్ ఇటీవలే భారతదేశంలో రూ. 8 లక్షల ప్రారంభ ధరతో (పరిచయ ఎక్స్-షోరూమ్, పాన్-ఇండియా) పరిచయం చేయబడింది. ఈ సబ్-4 మీటర్ల సెడాన్ కారు టెస్ట్ డ్రైవ్ ప్రారంభమైంది. కొత్త అమేజ్ కూడా కొన్ని డీలర్‌షిప్‌లకు చేరుకుంది. ప్రదర్శనలో ఉంచబడిన కొత్త హోండా అమేజ్‌లో కనిపించినవి ఇక్కడ ఉన్నాయి:

పదర్శించిన మోడల్ వివరాలు

ప్రదర్శన కోసం ఉంచిన హోండా అమేజ్ LED హెడ్‌లైట్లు, LED DRL మరియు LED ఫాగ్ ల్యాంప్‌లను కలిగి ఉంది. ముందు విండ్‌షీల్డ్‌పై కెమెరా యూనిట్ కూడా కనిపిస్తుంది, ఇది అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)తో అందించబడిందని సూచిస్తుంది.

సైడ్ ప్రొఫైల్‌లో 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు క్రోమ్-ఫినిష్డ్ డోర్ హ్యాండిల్స్ కనిపిస్తాయి. వెనుక వైపున, కొత్త అమేజ్ సిటీ సెడాన్ వంటి LED టెయిల్ లైట్లను కలిగి ఉంది. ఈ వివరాలన్నీ చూసిన తర్వాత న్యూ అమేజ్ టాప్ మోడల్ ZX ఇదే అని చెప్పొచ్చు.

అమేజ్ ZX యొక్క క్యాబిన్‌లో లెథెరెట్ సీట్ అప్హోల్స్టరీ మరియు ప్రయాణీకులందరి కోసం సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్‌లు ఉన్నాయి. దీని డ్యాష్‌బోర్డ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో 8-అంగుళాల ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ మరియు సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఇతర ఫీచర్లలో వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, రియర్ వెంట్లతో కూడిన ఆటో AC, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ మరియు పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ మొదలైనవి ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం, 6 ఎయిర్‌బ్యాగ్‌లు (ప్రామాణికం), రియర్‌వ్యూ మరియు లేన్‌వాచ్ కెమెరాలు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి ఫీచర్‌లతో కూడిన అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు (ADAS) సూట్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: కొత్త హోండా అమేజ్ పాత మోడల్ కంటే ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది

2024 హోండా అమేజ్: పవర్‌ట్రెయిన్ ఎంపికలు

కొత్త హోండా అమేజ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది, దీని స్పెసిఫికేషన్‌లు క్రింది విధంగా ఉన్నాయి:

ఇంజిన్

1.2-లీటర్ న్యాచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్

పవర్

90 PS

టార్క్

110 Nm

ట్రాన్స్‌మిషన్

5-స్పీడ్ MT / 7-స్టెప్ CVT*

ధృవీకరించబడిన మైలేజీ

18.65 kmpl (MT) / 19.46 kmpl (CVT)

*CVT = కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్

2024 హోండా అమేజ్: ధర మరియు ప్రత్యర్థులు

కొత్త హోండా అమేజ్ ధర రూ. 8 లక్షల నుండి రూ. 10.90 లక్షల (పరిచయ ఎక్స్-షోరూమ్, పాన్-ఇండియా) మధ్య ఉంది. ఇది కొత్త మారుతి డిజైర్, హ్యుందాయ్ ఆరా మరియు టాటా టిగోర్‌లతో పోటీ పడుతుంది.

ఆటోమొబైల్ ప్రపంచం నుండి తక్షణ అప్‌డేట్‌లను పొందడానికి కార్‌దేఖో వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.

మరింత చదవండి: హోండా అమేజ్ ఆన్ రోడ్ ధర

Share via
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
కొత్త వేరియంట్
Rs.11.82 - 16.55 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.6 - 9.50 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.11.07 - 17.55 లక్షలు*
ఫేస్లిఫ్ట్
Rs.48 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర