ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రత్యేకం: ఎకో-ఫ్రెండ్లీ క్యాబిన్లను కలిగిన 5 ఎలక్ట్రిక్ కార్లు
హ్యుందాయ్ ఐయోనిక్ 5 కోసం rohit ద్వారా జూన్ 06, 2023 03:01 pm ప్రచురించబడింది
- 51 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జాబితాలో పేర్కొన్న దాదాపు అన్ని కార్లలో లెదర్-ఫ్రీ మెటీరియల్‌తో కూడిన సీట్లు కలిగి ఉన్నాయి, మరికొన్ని కార్‌లు క్యాబిన్ లోపల బయో-పెయింట్ కోటింగ్‌ను కూడా ఉపయోగించాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్ల తయారీదారులు తాము సేవలు అందిస్తున్న మార్కెట్‌లకు అనుగుణంగా విభిన్న వ్యూహాలను అవలంబిస్తున్నపటికి, వీరు అందరికి ఉమ్మడిగా ఉన్న ఏకైక లక్ష్యం: సాధ్యమైనంత వరకు తమ కార్లలో సుస్థిరమైన మరియు మన్నికైన మెటీరియల్లను ఉపయోగించడం. ఈ రోజు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, క్యాబిన్‌లో ఎకో-ఫ్రెండ్లీ మెటీరియల్లను కలిగి ఉన్న 5 ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం:
హ్యుందాయ్ అయోనిక్ 5
అయోనిక్ 5, భారతదేశంలో హ్యుందాయ్ ఫ్లాగ్‌షిప్ EV, ఇది బయో పెయింట్ మరియు ఎకో-ఫ్రెండ్లీ లెదర్ & ఫ్యాబ్రిక్‌తో సహా అనేక సుస్థిరమైన మెటీరియల్లను కలిగి ఉంది. అయోనిక్ 5 డాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్, స్విచ్‌లు, డోర్ ప్యాడ్‌లు వంటి వాటిపై బయో పెయింట్ కోటింగ్‌ను కార్ తయారీదారు ఉపయోగించారు. ఈ బయో పెయింట్లో మొక్కలు మరియు మొక్కజొన్న నుండి తీసిన ఆయిల్ కలిగి ఉంటుంది. దీని ఎకో-ఫ్రెండ్లీ లెథర్ మరియు ఫ్యాబ్రిక్ మెటీరియల్లను చెరకు, మొక్కజొన్న మరియు 32 వరకు ప్లాస్టిక్ సీసాల వంటి వాటి నుండి తయారు చేయబడింది, వీటిని సీట్లు, కార్పెట్ మరియు డోర్ ఆర్మ్‌రెస్ట్‌ల కోసం ఉపయోగించారు.
కియా EV 6
అయోనిక్ 5 తోటి EVగా, కియా EV6 కూడా రీసైకిల్ చేయబడిన మరియు సుస్థిరమైన మెటీరియల్లతో వస్తుంది. ఈ కార్ తయారీదారు అనేక ఎకో-ఫ్రెండ్లీ మెటీరియల్లను ఉపయోగించారు, ఇందులో పుట్టగొడుగుల నుండి తీసిన భాగాలు, బయో-పెయింట్, వేగన్ లెదర్ మరియు అప్‌హోల్స్టరీ కోసం రీసైకిల్ చేయబడిన బాటిల్స్, డోర్ ప్యాడ్‌లు మరియు డ్యాష్‌బోర్డ్‌లపై ఫ్యాబ్రిక్ ఎలిమెంట్‌లు మరియు ఫ్లోర్‌మ్యాట్‌లు ఉన్నాయి. రాబోయే తమ కార్ల శ్రేణిలో సముద్రం నుండి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించాలనే ప్రణాళికలు కూడా కలిగి ఉన్నారు.
ఇది కూడా చదవండి: A.I. ప్రకారం భారతదేశంలో రూ.20 లక్షల లోపు ఉన్న టాప్ 3 ఫ్యామిలీ SUVలు
వోల్వో XC40 రీఛార్జ్
XC40 రీఛార్జ్, ఇది భారతదేశంలో వోల్వో ప్రవేశపెటిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు, దీని లోపలి భాగంలో అనేక రీసైకిల్ భాగాలను కలిగి ఉంది. ఇందులో లెదర్-ఫ్రీ ఇంటీరియర్ మరియు పాక్షికంగా రీసైకిల్ చేసిన కార్పెట్‌లు ఉన్నాయి. దీని క్యాబిన్‌ను ముదురు బూడిద రంగులో అందిస్తున్నారు, అయితే కార్పెట్‌లు "ఫ్జోర్డ్ బ్లూ" ఫినిష్ను కలిగి ఉంది.
స్కోడా ఎనియాక్ iV
స్కోడా తన ఫ్లాగ్‌షిప్ EV, ఎనియాక్ iVను త్వరలో భారతదేశంలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు, ఈ కారు తయారీదారు అందిస్తున్న వాహనాలలో అత్యధికంగా రీసైకిల్ చేయబడిన వస్తువులను ఈ ఎలక్ట్రిక్ SUVలోనే వినియోగించారు. క్యాబిన్ లోపల వివిధ ప్రయోజనాల కోసం సుస్థిరమైన మెటీరియల్స్ వినియోగించారు, ఇందులో సౌండ్ ఇన్సులేషన్ కోసం రీసైకిల్ చేసిన ఫాబ్రిక్స్, ఫ్లోర్ మరియు బూట్ మ్యాట్‌ల కోసం రీసైకిల్ మరియు రీమోల్డ్ పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (PET) బాటిల్ ఫైబర్‌లు ఉన్నాయి. దీని సీట్లు PET సీసాలు మరియు ఉన్నితో తయారు చేయబడ్డాయి, కార్‌లోని లెథర్ ఆలివ్ ఆకుల సారాన్నీ ఉపయోగించి ట్యాన్ చేయబడింది.
మెర్సిడెస్-బెంజ్ EQS
మెర్సిడెస్-బెంజ్ EQS, భారత మార్కెట్లో విక్రయించబడుతున్న ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ సెడాన్‌లలో ఒకటి. జర్మన్ తయారీదారు అందిస్తున్న టాప్-ఆఫ్-ది-లైన్ EV అయినందున, ఇది అనేక సుస్థిరమైన మెటీరియల్స్ మరియు భాగాలను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ఆహార వ్యర్థాలు, మిశ్రమ ప్లాస్టిక్‌లు, కార్డ్‌బోర్డ్ మరియు పిల్లల డైపర్ వంటి వాటితో కూడిన మిశ్రమ గృహ వ్యర్థాల నుండి తయారు చేసిన మెటీరియల్తో రూపొందించిన కేబుల్ డక్ట్‌లను కలిగి ఉంది. ఇది ఫ్లోర్ కవరింగ్ కోసం రీసైకిల్ కార్పెట్‌లు మరియు ఫిషింగ్ నెట్‌ల నుండి తయారు చేసిన నైలాన్ నూలును కూడా ఉపయోగించింది.
ఇది కూడా చదవండి: ఎంత భారీగా ఉంటే, అంతా ఉత్తమమైనదా? ఈ 10 కార్లు ప్రపంచంలోనే అతిపెద్ద డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి
సుస్థిరమైన మెటీరియల్లను కలిగి ఉన్న కార్ల జాబితాలో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే, అయితే పైన పేర్కొన్న కారు తయారీదారుతో పాటు ఇతర కార్ల తయారీదారులు కూడా సుస్థిరమైన ఉత్పత్తి పద్ధతులను అనుసరిస్తున్నారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉత్పాదక సౌకర్యాల వద్ద సహజ ఇంధన వనరుల ఏర్పాటు కొరకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్ల తయారీదారుల సంయుక్త ప్రయత్నాలు కార్బన్ కాలుష్య భారాన్ని తగ్గించడంలో ఖచ్చితంగా సహాయపడతాయి.
మరింత చదవండి: హ్యుందాయ్ అయోనిక్ 5 ఆటోమేటిక్