• English
  • Login / Register

A.I. ప్రకారం భారతదేశంలో రూ.20 లక్షల లోపు ఉన్న టాప్ 3 ఫ్యామిలీ SUVలు

హ్యుందాయ్ క్రెటా 2020-2024 కోసం rohit ద్వారా జూన్ 05, 2023 12:46 pm ప్రచురించబడింది

  • 51 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కారు కొనుగోలులో సలహాలు అందించే నిపుణులుగా, కార్‌లకు సంబందించి అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రశ్నకు సమాధానం పొందటానికి టాప్ మూడు A.I సాధనాలను ప్రయత్నించాము. వాటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి

Best family SUVs under Rs 20 lakh as per A.I.

రూ.20 లక్షల కంటే తక్కువ ధరకు ఫ్యామిలీ SUVని కొనుగోలు చేయాలనుకుంటే, సబ్‌కాంపాక్ట్ నుండి కాంపాక్ట్ వరకు మరియు మిడ్ సైజ్ SUVలు వంటి ఎన్నో మోడల్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇటీవల అందుబాటులోకి వచ్చిన అధిక సామర్ధ్యం గల చాట్‌జిపిటి, గూగుల్ బార్డ్ మరియు మైక్రోసాఫ్ట్ బింగ్ వంటి వివిధ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (A.I.) సాధనాలను కారు కొనుగోలు నిర్ణయాన్ని తీసుకోవడంలో సహాయపడేందుకు ఉపయోగించాము.

స్థిరమైన ఫలితాల కోసం, మూడు A.I ప్లాట్ؚఫారంలలో ఒకే విధమైన ప్రాంప్ట్ؚను ఎంటర్ చేశాము, ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి:

ప్రాంప్ట్: హాయ్ చాట్‌జిపిటి/బార్డ్/బింగ్, భారతదేశంలో రూ.20 లక్షల కంటే తక్కువ ధరతో టాప్ 3 ఉత్తమ ఫ్యామిలీ SUVల గురించి తెలుపు.

చాట్‌జిపిటి: తప్పకుండా! భారతదేశంలో రూ.20 లక్షల కంటే తక్కువ ధరకు లభిస్తున్న మొదటి 3 ఉత్తమ ఫ్యామిలీ SUVలు ఇవి:

Kia Seltos

  • కియా సెల్టోస్: స్టైలిష్ డిజైన్, అధిక ఫీచర్‌లు కలిగిన ఇంటీరియర్ మరియు పోటీతత్వ ధర కారణంగా కియా సెల్టోస్ భారతదేశ మార్కెట్‌లో ప్రజాదరణ పొందింది. ఇది మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో పెట్రో మరియు డీజిల్ ఇంజన్ ఎంపికను అందిస్తుంది. సెల్టోస్ؚలో సౌకర్యవంతమైన మరియు విశాలమైన క్యాబిన్, ఆధునిక భద్రత ఫీచర్‌లు మరియు అంతరాయం లేని రైడ్ నాణ్యత ఉంటుంది అని సెల్టోస్ గర్వంగా తెలుపుతుంది.

  • హ్యుందాయ్ క్రెటా: ఫ్యామిలీ SUV విభాగంలో హ్యుందాయ్ క్రెటా ప్రధాన పోటీదారు. ఇందులో ఆధునిక డిజైన్, మెరుగైన ఇంటీరియర్ మరియు పెట్రోల్, డీజిల్, టర్బో చార్జెడ్ పెట్రోల్ వేరియెంట్ వంటి ఇంజన్ ఎంపికలలో కూడా లభిస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ సాంకేతికత మరియు ఆధునిక భద్రత ఫీచర్‌ల వంటి అనేక ఫీచర్‌లతొ సౌకర్యవంతమైన రైడ్, ప్రయాణీకులకు విశాలమైన క్యాబిన్ؚను అందిస్తుంది.

Tata Harrier

  • టాటా హ్యారియర్: దృఢమైన మరియు అద్భుతమైన డిజైన్ؚతో టాటా హ్యారియర్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది ప్రీమియం ఫీచర్‌లు కలిగిన విశాలమైన మరియు దృఢమైన క్యాబిన్ؚను అందిస్తుంది. శక్తివంతమైన డీజిల్ ఇంజన్ కారణంగా హ్యారియర్ వివిధ ప్రాంతాలలో సౌకర్యవంతమైన రైడ్‌ను అందిస్తుంది. బహుళ ఎయిర్ బ్యాగ్ؚలు, ABS, EBD మరియు స్టెబిలిటీ కంట్రోల్ వంటి భద్రత ఫీచర్‌లను కూడా కలిగి ఉంది. 

ఈ SUVలు స్టైల్, ఫీచర్‌లు, పనితీరు మరియు వెచ్చించిన డబ్బుకు సరైన విలువను అందిస్తాయి. అయితే సీటింగ్, ఇంధన సామర్ధ్యం వంటి మీ నిర్దిష్ట అవసరాలు మరియు అదనపు ఫీచర్‌లను కూడా చివరి నిర్ణయం తీసుకునే ముందు పరిగణించాలి. 

గమనిక: ChatGPT డేటా 2021 సంవత్సరానికి మాత్రమే పరిమితం, దురదృష్టవశాత్తూ ఆ తరువాత విడుదల అయిన కార్‌లను పరిగణలోకి తీసుకోలేదు, ఇది ఫలితాల సమర్ధతను కూడా పరిమితం చేసింది. 

ఇది కూడా చదవండి: గత కొన్ని సంవత్సరాలలో CNG సాంకేతికత మరియు కార్‌ల అభివృద్ధి 

బార్డ్: తప్పకుండా, భారతదేశంలో రూ.20 లక్షల కంటే తక్కువ ధరకు లభిస్తున్న మొదటి 3 ఉత్తమ ఫ్యామిలీ SUVలు ఇవి:

Mahindra XUV700

  • మహీంద్ర XUV700: మహీంద్రా XUV700 ఈ విభాగంలో ఉత్తమమైన ఆల్-రౌండర్. ఇది విశాలమైన మరియు సౌకర్యవంతమైన క్యాబిన్, శక్తివంతమైన ఇంజన్ؚతో అనేక ఫీచర్‌ల జాబితాతో వస్తుంది. పెట్రోల్ మరియు డీజిల్ వేరియెంట్ؚలు రెండిటిలో అందుబాటులో ఉంది, ధర రూ. 14.01 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. 

  • కియా సెల్టోస్: స్టైలిష్‌గా ఉండాలని మరియు అనేక ఫీచర్‌లను కలిగిన SUVని కొనుగోలు చేయాలనుకునే వారికి కియా సెల్టోస్ అద్బుతమైన ఎంపిక. ఇది సౌకర్యవంతమైన క్యాబిన్, శక్తివంతమైన ఇంజన్ మరియు అనేక ఫీచర్‌ల జాబితాను కలిగి ఉంటుంది. ధర రూ. 10.49 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. 

  • హ్యుందాయి క్రెటా: కుటుంబంతో ప్రయాణించాలనుకుంటే హ్యుందాయ్ క్రెటా ప్రజాదరణ పొందిన సరైన ఎంపిక. ఇది అనేక ఫీచర్‌లను, మెరుగైన ఇంధన-సామర్ధ్యన్నీ మరియు స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది, ధర రూ. 10.87 లక్షల వద్ద ప్రారంభం అవుతుంది. 

  • రూ. 20 లక్షల కంటే తక్కువ ధరకు భారతదేశంలో అందుబాటులో ఉన్న ఫ్యామిలీ SUVలలో కొన్ని ఇవి. SUVని ఎంచుకుంటున్నప్పుడు, మీ అవసరాలు మరియు బడ్జెట్ؚను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఎంతమంది ప్రయాణం చేస్తారు, వస్తువుల కోసం ఎంత బూట్ స్పేస్ అవసరం మరియు మీకు ఎటువంటి ఫీచర్‌లు అవసరం అనే విషయాలను పరిగణించాలి.

బింగ్: CarDekho.com ప్రకారం, భారతదేశంలో రూ. 20 లక్షల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న టాప్ SUV కార్‌లు ఇవి:

Mahindra Thar

  • మహీంద్ర థార్ (రూ. 10.54 – 16.78 లక్షలు)

  • మహీంద్రా XUV700 (రూ. 14.01 – 26.18 లక్షలు)

Hyundai Creta

  • హ్యుందాయ్ క్రెటా (రూ. 10.87 – 19.20 లక్షలు)

అవగాహనాపూర్వక నిర్ణయాన్ని తీసుకోవడంలో ఇది మీకు సహాయపడుతాయని మేము ఆశిస్తున్నాము.

పైన అందించిన ఫలితాలను బట్టి, వాహన మోడల్‌లను ఎంచుకోవడంలో బలమైన కారణాలను ChatGPT వివరించింది, Bing కేవలం వాహన మోడల్‌లు మరియు వాటి ధరలను జాబితా చేసింది. 3 A.I సాధనాల ఫలితాలలో క్రెటా మొదటి మూడు స్థానాలలో నిలిచింది, ఎందుకంటే ఇది సంవత్సరాలుగా తన పేరును నిలబెట్టుకుంది. Bing తన ఫలితాలను మా వెబ్ؚసైట్ నుండి సేకరించినట్లు తెలిపినప్పటికి, ఎంచుకున్న పారామితులను మేము అంగీకరించడం లేదు మరియు మా నిపుణుల సమీక్షలు ఉత్తమ ఎంపికల కోసం మీకు మార్గదర్శనం చేస్తాయి.

CD మటాలలో: మూడు AI ప్లాట్ ఫారంలు సూచించిన విధంగా హ్యుందాయ్ క్రెటా, టాటా హ్యారియర్, లేదా మహీంద్రా XUV700 సిఫార్సులను మేము అంగీకరిస్తున్నాము, అయితే Bing అందించిన ఫ్యామిలీ SUV సూచనలలో (థార్‌ను) మాత్రం మాత్రం మేము అంగీకరించడం లేదు. థార్ ఒక జీవనశైలి ఆఫ్-రోడర్ మరియు పరిమిత బూట్ స్పేస్ؚతో నాలు-సీట్‌లను కలిగి ఉంటుంది. ఇది సాహసాలు చేసే వారికి సరైన వాహనం అని చెప్పవచ్చు, ఇలాంటి సహస ప్రయాణాలు పూర్తి కుటుంబంతో చేయడం అరుదుగా జరుగుతుంది. 

మూడు సాధనాలు క్రెటాను ఈ విభాగంలో ఎంచుకున్నాయి, సౌకర్యం, ప్రీమియం ఫీచర్‌లు మరియు వివిధ పవర్ؚట్రెయిన్ؚలతో అందుబాటులో ఉన్నందున ఈ ఎంపికకు కారణాలు అని చెప్పవచ్చు మరియు ఇది అత్యధికంగా అమ్ముడయ్యే కాంపాక్ట్ SUVలలో ఒకటిగా ఉంది. అంతేకాకుండా, మహీంద్రా XUV700 మరియు కియా సెల్టోస్ కూడా ఇవే కారణాల వలన, ఈ AI పరికరాలు ఎంచుకున్న ఇతర మోడల్‌లు. ChatGPT మాత్రమే XUV700కి బదులుగా టాటా హ్యారియర్ؚను తన మిడ్-సైజ్ SUV ఎంపికగా సూచించింది. దీనికి కారణం అందుబాటులో ఉన్న పరిమిత టైమ్ ఫ్రేమ్ డేటా కావచ్చు.

ఇది కూడా చదవండి: త్వరలో మీ అండ్రాయిడ్ ఫోన్ డ్యాష్ؚకామ్ؚగా కూడా పని చేయవచ్చు

ప్రస్తుతానికి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఉత్తమ A.I సాధనాలు ఇవి, అయితే ఇవి ప్రస్తుతం శైశవ దశలోనే ఉన్నాయని, భవిష్యత్తులో మెరుగైన ఫలితాలను అందించడానికి సమగ్ర అప్ؚడేట్ؚలను తప్పకుండా పొందుతాయని గమనించాలి. రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువ ధరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమ ఫ్యామిలీ SUVలకి, పైన పేర్కొన్న మోడల్‌లు సరిపోతున్నపటికి, మీ కుటుంబానికి తగిన కారు, మీ అవసరాలు, బడ్జెట్ మరియు కార్‌ల పవర్ؚట్రెయిన్ؚలపై ఆధారపడి మారుతుంది. మీ కోసం, మీకు కావలసిన సరైన కారును గుర్తించడంలో సహాయం చేయడానికి ప్రత్యేక నైపుణ్యలతొ మేము అందుబాటులో ఉన్నాము.

ఇక్కడ మరింత చదవండి : హ్యుందాయ్ క్రెటా ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Hyundai క్రెటా 2020-2024

1 వ్యాఖ్య
1
S
sumeet v shah
Jun 2, 2023, 9:09:16 PM

You have cover nicely.

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    explore similar కార్లు

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience