• English
  • Login / Register

5-డోర్‌ల మహీంద్రా థార్ ప్రపంచవ్యాప్త ఆవిష్కరణ ఎప్పుడు?

మహీంద్రా థార్ రోక్స్ కోసం tarun ద్వారా జూన్ 27, 2023 03:27 pm ప్రచురించబడింది

  • 117 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

5-డోర్‌ల మహీంద్రా థార్, 3-డోర్‌ల వెర్షన్ؚకు సారూప్యంగా ఉంటుంది కానీ మరిన్ని ఫీచర్‌లతో, మరింత ఆచరణాత్మకంగా వస్తుంది

Mahindra Thar 5-Door

ఇప్పటి నుండి 2023 చివరి వరకు మార్కెట్‌లోకి మహీంద్రా నుండి కొత్త కారు మోడల్‌లు విడుదల కాకపోవచ్చని సమాచారం, కానీ ఎంతగానో ఎదురుచూస్తున్న 5-డోర్‌ల మహీంద్రా థార్ ఆవిష్కరణ ఈ సంవత్సరంలో ఆశించవచ్చు. ఈ మోడల్‌ను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనున్నారు అని అనేక నివేదికలు సూచిస్తున్నప్పటికీ, మహీంద్రా నుండి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది నిజం కాకపోవచ్చు.

5-డోర్‌ల థార్ ఈ సంవత్సరం వస్తుందా?

2020 Mahindra Thar First Look Review

మహీంద్రా సాధారణంగా రిపబ్లిక్ డే (XUV400 బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి), స్వాతంత్ర దినోత్సవం, మరియు గాంధీ జయంతి (3-డోర్‌ల థార్ విడుదల) వంటి జాతీయ సెలవు దినాలలో ఆవిష్కరణలు మరియు విడుదలలు చేస్తుంది అనేది స్పష్టంగా తెలిసిన విషయమే. ఈ ఆగస్ట్ 15 తేదీన కూడా, మహీంద్రా ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుంది, కానీ మాకు అందిన సమాచారం ప్రకారం అది 5-డోర్‌ల థార్ విడుదల కాకపోవచ్చు.

బదులుగా, ఈ కార్యక్రమంలో కొత్త ఎలక్ట్రిక్ వాహన లైన్ؚఅప్ పైనే ఎక్కువగా దృష్టి సారించవచ్చు, 2025లో వీటి విక్రయాలు ప్రారంభంకావచ్చు. విస్తారమైన EV లైన్అప్ కార్యక్రమంలో, 5-డోర్‌ల థార్ ఆవిష్కరణను ఆశించలేము మరియు ఈ మోడల్‌కు ఉన్న ప్రజాదరణకు ప్రత్యేకమైన ఆవిష్కరణ కార్యక్రమం జరగవచ్చు. ఈ పొడవాటి ఆఫ్-రోడర్ ఆవిష్కరణ మరియు విడుదల కూడా ఒకే రోజు, 2024లో ఉంటాయని భావిస్తున్నాము.

ఇది కూడా చదవండి:2023లో కొత్త మోడల్‌ల విడుదల ఉండవని ధృవీకరించిన మహీంద్రా; 2024లో ముఖ్యమైన విడుదలను చూడవచ్చు!

ఆగస్ట్ 15న మనం ఏం చూడబోతున్నాం? 

Mahindra EV concepts

మహీంద్రా తన EV లైన్అప్ గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తుందని అంచనా. ఈ జాబితాలో, ఇదివరకు వెల్లడించిన XUV e8 ఇది XUV700 పూర్తి ఎలక్ట్రిక్ మోడల్, ఒక భారీ EV (XUV700 కంటే పెద్దది), ఒక కాంపాక్ట్ SUV EV మరియు ‘బార్న్ EVలు’ పేరుతో మూడు ప్రత్యేకమైన EV-ఓన్లీ మోడల్‌లు ఉన్నాయి. XUV700 EV విక్రయాలు మొదట ప్రారంభం కానున్నాయి. దాదాపుగా ప్రొడక్షన్‌కు సిద్దమైన వెర్షన్ؚను మనం చూడవచ్చు.

5-డోర్‌ల థార్ సరికొత్త వివరాలు

Mahindra Thar 5-door

థార్ 5-డోర్‌ల వెర్షన్ అనేక సార్లు రహస్యంగా టెస్ట్ చేస్తుండగా కనిపించింది, ఇది ప్రొడక్షన్‌కు సిద్దమైన మోడల్ కావొచ్చు. పొడిగించిన బాడీ మరియు రెండు ఎక్కువ డోర్‌లను మినహాహిస్తే, 3-డోర్ మోడల్‌ల బాక్సీ లుక్‌తోనే 5-డోర్‌ల మోడల్ కొనసాగుతుందని రహస్య చిత్రాలు సూచిస్తున్నాయి. ఇది ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్ మరియు పూర్తి మెటల్ హార్డ్ టాప్, C-పిల్లర్ؚకు అమర్చిన డోర్ హ్యాండిల్స్ మరియు రేర్ వైపర్ؚؚలతో వస్తుంది. 

అదనపు సౌకర్యం మరియు అనుకూలత కోసం జోడించిన కొన్ని అదనపు ఫీచర్‌లు తప్ప, ఇంటీరియర్‌లో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. మరింత ఆచరణాత్మకమైన ఈ SUV వెర్షన్ؚలో కూడా అవే 2-లీటర్‌ టర్బో పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌లు శక్తిని అందిస్తాయి, కానీ అధిక సామర్థ్యంతో రావచ్చు. ఇప్పటికీ ఈ రెండు ఇంజన్‌లతో మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ 6-స్పీడ్‌ల ట్రాన్స్ؚమిషన్ؚలలో అందించబడుతున్నాయి.

ఇది కూడా చదవండి: మారుతి జిమ్నీ Vs మహీంద్రా థార్ పెట్రోల్ – ఇంధన సామర్ధ్య గణాంకాల పోలిక 

5-డోర్‌ల థార్ ధర సుమారు రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చు, ఇది మారుతి జిమ్నీకి మరింత ఖరీదైన మరియు పెద్దదైన ప్రత్యామ్నాయం.

ఇక్కడ మరింత చదవండి: మహీంద్రా థార్ డీజిల్

was this article helpful ?

Write your Comment on Mahindra థార్ ROXX

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience