2023లో కొత్త మోడళ్ళ ప్రారంభాలు లేనట్లు వెల్లడించిన మహీంద్రా. 2024లో భారీ ప్రారంభాలు!
మహీంద్రా థార్ రోక్స్ కోసం tarun ద్వారా జూన్ 01, 2023 07:24 pm ప్రచురించబడింది
- 57 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
XUV300 వంటి కొన్ని తేలికపాటి నవీకరణలు మరియు ఫేస్‌లిఫ్ట్‌లను మాత్రమే మనం ఈ సంవత్సరం చూడవచ్చు.
2023 ఆర్థిక సంవత్సర ఫలితాల సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో, మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆటో & వ్యవసాయ రంగాలు) రాజేష్ జెజురికర్ ప్రస్తుత సంవత్సరం 2023 కోసం కొత్త మోడల్ ప్రారంభాలు ఏవీ ప్లాన్ చేయలేదని వెల్లడించారు. మేము ఎదురు చూస్తున్న భారీ ప్రారంభాలు 2024కి ప్లాన్ చేయబడ్డాయి.
కొన్ని మోడళ్ల కోసం కస్టమర్లు విస్తృతంగా వెయిటింగ్ పీరియడ్‌లను ఎదుర్కోవడం అనేది ప్రధాన కారణాలలో ఒకటి. స్కార్పియో ఎన్ ఇప్పటికీ ఆరు నెలలకు పైగా వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉంది, లక్షకు పైగా ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి, థార్ రియర్-వీల్ డ్రైవ్ కోసం కొనుగోలుదారులు కొన్ని నగరాల్లో ఏడాది వరకు వెయిట్ చేసే పనిలో పడ్డారు. కాబట్టి సమస్య తీవ్రతరం కాకుండా ఉండటానికి, మహీంద్రా 2023లో మిగతా సంవత్సరంలో కొత్త మోడళ్లను ప్రారంభం చేయకూడదని నిర్ణయం తీసుకుంది.
మహీంద్రా 5-డోర్ల థార్ ప్రారంభంతో 2024ను ప్రారంభించాలని భావిస్తుంది. ఐదుగురు కూర్చునే సామర్థ్యం ఉన్న 3 డోర్ల వెహికల్ కంటే ఇది మరింత ప్రాక్టికల్‌గా ఉంటుంది. హుడ్ కింద ఒకే టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు ఉంటాయి, బహుశా అధిక ట్యూనింగ్‌లో ఉండవచ్చు. రియర్-వీల్, ఫోర్-వీల్ డ్రైవ్‌ట్రైన్లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
ఇది కూడా చదవండి: మారుతి జిమ్నీ వర్సెస్ మహీంద్రా థార్ పెట్రోల్ - ఫ్యూయల్ ఎఫిషియన్సీ గణాంకాలను పోల్చారు
మహీంద్రా వచ్చే కొన్నేళ్లలో అనేక ముఖ్యమైన ప్రారంభాలను షెడ్యూల్ చేసింది. 5-డోర్ల థార్ తరువాత, కార్ల తయారీదారు సంస్థ ఎక్స్యూవి 300 మరియు బొలెరో యొక్క కొత్త జనరేషన్లను ప్రారంభించాలని యోచిస్తోంది. SUV తయారీ సంస్థ క్రెటా రైవల్‌ని దృష్టిలో ఉంచుకొని కూడా పనిచేస్తోంది, ఇది XUV 500 మోనికర్‌ను తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టగలదు. చివరగా, ఫ్లాగ్‌షిప్ మహీంద్రా అయిన గ్లోస్టర్ రైవల్ కూడా సిద్ధం చేయబడుతోంది.
2026 వరకు వివిధ రకాల బ్యాటరీ పవర్డ్ వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ ప్లాన్ చేసింది. XUV 700,W620 (ఫ్లాగ్‌షిప్ మహీంద్రా), W201 (న్యూ-జెన్ XUV500) వంటి కొత్త మోనోకోక్ మోడల్‌లు కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లను పొందుతున్నాయి. వీటితో పాటు 'బోర్న్ EV' పేరుతో పలు EV ఎక్స్‌క్లూజివ్ మోడళ్లను కూడా 2026 నాటికి మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ రాబోయే అనేక EVలు ఇప్పటికే BE05 (క్రెటా-సైజ్ SUV), BE 07 (హారియర్ EV-రైవల్) మరియు ఫుల్-సైజ్ BE09 రూపంలో ప్రివ్యూ చేయబడ్డాయి.