• English
  • Login / Register

మారుతి జిమ్నీ Vs మహీంద్రా థార్ పెట్రోల్ – ఇంధన సామర్ధ్య గణాంకాల పోలిక

మారుతి జిమ్ని కోసం tarun ద్వారా మే 25, 2023 09:52 am ప్రచురించబడింది

  • 23 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జిమ్నీ సహజ సిద్దమైన పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. మరోవైపు థార్ పెద్ద, శక్తివంతమైన టర్బో-పెట్రోల్ యూనిట్‌ను పొందుతుంది

Maruti Jimny Vs Mahindra Thar

మారుతి జిమ్నీ అతి త్వరలో విడుదల కానుంది. ఇది ఎంతో కాలంగా వేచి చూస్తున్న, 5-డోర్‌ల సబ్-కాంపాక్ట్ జీవనశైలి SUV. ఆటో ఎక్స్ؚపో 2023లో ఆవిష్కరించినప్పటి నుంచి దీని బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి, ఇప్పటి వరకు 30,000 కంటే ఎక్కువ ప్రీ-ఆర్డర్ؚలను అందుకుంది. కేవలం పెట్రోల్  వెర్షన్‌తో వస్తున్న ఈ ఆఫ్-రోడర్, పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ؚల ఎంపికలను, మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚలను అందించే మహీంద్రా థార్‌తో నేరుగా పోటీ పడుతుంది. 

ఇప్పటికే ఈ వాహనాల ఫీచర్‌లను మరియు స్పెసిఫికేషన్‌లను పోల్చిచూడగా, పెట్రోల్ 4 X 4 వర్షన్ؚల ఇంధన సామర్ధ్య గణాంకాల తక్షణ పోలిక ఇక్కడ అందించబడింది. 

స్పెక్స్ 

జిమ్నీ

థార్

ఇంజన్ 

1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్

2-లీటర్ టర్బో పెట్రోల్ 

పవర్ 

105PS

152PS

టార్క్ 

134Nm

Up to 320Nm

ట్రాన్స్ؚమిషన్

5-స్పీడ్ MT / 4-స్పీడ్ AT

6-స్పీడ్ MT/6-స్పీడ్ AT

ఇంధన సామర్ధ్యం

16.94kmpl/16.39kmpl (క్లెయిమ్ చేసినది)

12.4kmpl (క్లెయిమ్ చేసినది) / 10.67kmpl* (పరీక్షించినది)

*గమనిక: థార్ పెట్రోల్ ఆటోమ్యాటిక్ ARAI క్లెయిమ్ చేసిన ఇంధన సామర్ధ్యం అందుబాటులో లేదు, కాబట్టి రోడ్ టెస్ట్ؚలలో పొందిన గణాంకాలను ఉపయోగించాము.

Maruti Jimny

ముఖ్యాంశాలు:

  • థార్ మరింత శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉంది, జిమ్నీతో పోలిస్తే ఇది 47PS పవర్ మరియు 186Nm ఎక్కువ టార్క్‌ను అందిస్తుంది. ఇది 50 శాతం కంటే ఎక్కువ పవర్ మరియు 100 శాతం కంటే ఎక్కువ టార్క్. దీన్ని మారుతి జిమ్నీతో పోలిస్తే ఇది అంత పొదుపైనది కాకపోవచ్చు.

  • జిమ్నీ పెట్రోల్-MT 17kmplను క్లెయిమ్ చేస్తుంది, ఇది థార్ పెట్రోల్-MT క్లెయిమ్ చేసిన సామర్ధ్యం కంటే 3.5kmpl ఎక్కువ. దీని పాత 4-స్పీడ్ ఆటోమ్యాటిక్ కేవలం కొంత తక్కువ సామర్ధ్యం కలిగి ఉన్నపటికి, 16kmpl కంటే ఎక్కువ మైలేజ్‌ను అందిస్తుంది.

Maruti Jimny Vs Mahindra Thar

  • రోడ్ టెస్ట్ؚలలో, థార్ పెట్రోల్ ఆటోమ్యాటిక్ 10.67kmpl సగటు సామర్ధ్యాన్ని అందించింది. ARAI గణాంకాల ప్రకారం, జిమ్నీ ఆటోమ్యాటిక్ ఎంపిక గణనీయంగా మెరుగైనది. అయితే, వాస్తవానికి, మారుతి ఇంకా పొదుపైనది కాబట్టి ఈ తేడా మరింత తక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాము.

ఇది కూడా చదవండి: 5-డోర్‌ల మారుతి జిమ్నీ మరియు మహీంద్రా థార్ؚల మధ్య ఉన్న 7 ప్రధాన తేడాలు

4WD ప్రామాణికంగా వస్తున్న మారుతి జిమ్నీ ధర సుమారు రూ.10 లక్షల నుండి ఉంటుందని అంచనా. థార్ విషయానికి వస్తే, దీని ధర రూ.9.99 లక్షల నుండి, 4WD వేరియెంట్ؚల ధర రూ.13.87 లక్షల నుండి ప్రారంభం అవుతుంది (ఎక్స్-షోరూమ్ ధరలు). థార్ 2WD వేరియెంట్ؚల ధరలు జిమ్నీ ధరలతో సమానంగా ఉండవచ్చు.

ఇక్కడ మరింత చదవండి: మహీంద్రా థార్ డీజిల్

was this article helpful ?

Write your Comment on Maruti జిమ్ని

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience