• English
  • Login / Register

వోల్వో ఎస్60 టి6 నుండి ఆశించే అంశాలు

వోల్వో ఎస్60 2015-2020 కోసం raunak ద్వారా జూలై 01, 2015 05:13 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొన్ని రోజుల తరువాత, 2015 లో వోల్వో, కొన్ని వాహనాలను ప్రవేశపెట్టింది. దానిలో ఎస్60 టి6 అనేది 2015 లో నాల్గవ ప్రారంభం అని చెప్పవచ్చు. మొదటి మూడు వరుసగా, వి40 క్రాస్ కంట్రీ టి4, కొత్త ఎక్స్ సి90 మరియు వి40 హాచ్.   

జైపూర్: వోల్వో ఇండియా, ప్రారంభ స్థాయి లగ్జరీ సెడాన్ అయిన ఎస్60 లో ఒక పెట్రోల్ వేరియంట్ ను 3 జూలై 2015 న తిరిగి ప్రారంబించనున్నట్లు తెలిపారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఎస్60 ను పెట్రోల్ మోడ్ లో 6 సిలండర్లతో మరియు ఏడబ్ల్యూడి సెటప్ తో ప్రవేశపెట్టారు. అయితే, ఫేస్లిఫ్ట్ పెట్రోల్ మోటార్ విడిచిపెట్టి, ప్రస్తుతం డ్5 మరియు డ్4 డీజిల్ ఇంజిన్లు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు, వోల్వో ఒక ప్రత్యక్ష ఇంజెక్షన్ టర్బోచార్జెడ్ నాలుగు సిలిండర్ మోటార్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.    

వోల్వో ఎస్60 టి6 లో ఏమిటి కొత్త?

  • ఇది ఒక ప్రత్యక్ష ఇంజెక్షన్ నాలుగు సిలిండర్ల 3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ను అందిస్తుంది. ఈ మోటార్ గతిష్టంగా 306 hp మరియు అత్యధికంగా 400 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 
  • ముందు ఫేస్లిఫ్ట్ కారు యొక్క ఏడబ్ల్యూ సెటప్ తో కాకుండా, ఈ కొత్త ఎస్60 టి6 యొక్క మోటారు, వోల్వో యొక్క 8-స్పీడ్ గేర్ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా వీటి టార్క్ ను వాహనం యొక్క ముందు చక్రాలకు అందజేస్తుంది. 
  • కొత్తగా రాబోయే ఈ ఎస్60 టి6  వాహనం, 0 kmph నుండి 100 kmph వేగాన్ని చేరడానికి 5.9 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ వాహనం 230 kmph వేగాన్ని చేరుకోగలుగుతుంది.

ఇంతేకాకుండా, ప్రస్తుతం భారతదేశ అమ్మకాలలో ఉన్న ఎస్60 డీజిల్ వాహనం మాదిరిగా రాబోతుంది. ఇప్పుడు రాబోయే పెట్రోల్ వెర్షన్, ఎస్60 ఫేస్లిఫ్ట్ వాహనంలో ఉన్న అదే ప్రొజెక్టార్ హెడ్ల్యాంప్స్ తో పాటు ఎల్ఇడి డీఅర్ఎల్ఎస్ మరియు ఎల్ఇ డి టైల్ ల్యాంప్స్ తో రాబోతుంది. లోపలి విషయానికి వస్తే,  7-అంగుళాల సమాచార వ్యవస్థ తో పాటు అన్ని డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ లతో రాబోతుంది. ఇంతేకాక, ఈ వాహనం, దేశంలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ సి 200 పెట్రోల్ మరియు బిఎండబ్ల్యూ 328ఐ లతో గట్టి పోటీ ను ఇవ్వడానికి రాబోతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Volvo ఎస్60 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience