ఎస్90 ను వెల్లడించిన వోల్వో | క్యూ4 2016 లో భారతదేశంలో ప్రారంభం

ప్రచురించబడుట పైన Dec 04, 2015 01:27 PM ద్వారా Arun

  • 2 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

వోల్వో, ఎస్90 వాహనాన్ని ప్రీమియం మిడ్ సైజ్ లగ్జరీ సెలూన్ లో బహిర్గతం చేసింది. ప్రస్తుతం ఈ ఎస్90 వాహనం, ఆడి ఏ6, బిఎండబ్ల్యూ 5 -సిరీస్, మెర్సిడెస్ ఈ- క్లాస్ అలాగే జాగ్వార్ ఎక్స్ ఎఫ్ వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది. ఈ ఎస్ 90 వాహనం, టి8 ట్విన్ ఇంజన్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పవర్ ట్రైన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 394 హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే భారతదేశంలో అయితే, ఎక్స్ సి90 వాహనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ వాహనం అదే 2.0 లీటర్ డీజిల్ మోటార్ ద్వారా రావచ్చునని భావిస్తున్నారు.

"ఎక్స్ సి90 వాహన ఆవిష్కరణలో మేము ఒక ఉద్దేశ్యంతో ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేశాము. మేము ఇప్పుడు, ఈ ఆవిష్కరణలో స్పష్టంగా మరియు గట్టిగా ఉన్నాము. గత ఐదు సంవత్సరాలుగా మేము ఈ వోల్వో కార్ల పై $ 11 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాము - వోల్వో కార్స్ బ్రాండ్ ద్వారా, మేము ఇప్పుడు పునర్జీవన మరియు సంబంధిత వాహనాలను సరఫరా చేస్తాము, ఇదే మా వాగ్దానం అని" వోల్వో కార్ గ్రూప్ అధ్యక్షుడు మరియు సీఈఓ అయిన హకన్ సామ్యూల్సన్ అన్నారు.

ఎస్90 వోల్వో యొక్క పైలట్ ఫీచర్ అసిస్ట్ ను కలిగి ఉంది. వోల్వో యొక్క మాటలలో, 'ఈ వ్యవస్థ సున్నితమైన స్టీరింగ్ ఇన్పుట్ తో సరిగా దాదాపు 130 కె ఎం పి హెచ్ మోటార్వే వేగంతో వెళ్ళగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఇకపై మరొక కారు ను అనుసరించవలసిన అవసరం లేదు'. అంతేకాకుండా ఈ వాహనంలో, పెద్ద జంతువులను రాత్రి లేదా పగలు గుర్తించగల టెక్నాలజీ ను అమర్చారు. ఈ టెక్నాలజీ డ్రైవర్ కు హెచ్చరించడం మాత్రమే కాకుండా అవసరమైతే బ్రేకింగ్ లో కూడా సహాయపడుతుంది.

వోల్వో ఆటో ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయిన టాం వాన్ బోన్స్డోర్ఫ్ మాట్లాడుతూ, "మేము ఎస్90 యొక్క ప్రపంచ ఆవిష్కరణకు చాలా సంతోషిస్తున్నాము అన్నారు. ఎక్స్ సి 90 విజయం తరువాత, అన్ని కొత్త ఎస్90 వాహనాలు భారతదేశం లో ఉండే లగ్జరీ సెడాన్ కస్టమర్ యొక్క ఊహను పట్టుకుని ఉంటాయి అని చెప్పారు. ఈ ఎస్90 ఫ్లాగ్షిప్ లగ్జరీ సెడాన్, థోర్ యొక్క హామర్ ఎల్ ఈ డి లైట్ సిగ్నేచర్ తో పాటు బ్రాండ్ యొక్క కొత్త డిజైన్ ను కలిగి ఉంది. భారతదేశం లో, ఈ వాహనం యొక్క ధరను 2016 సంవత్సరం 4 వ త్రైమాసికం లో ఆవిష్కరించనున్నారు మరియు డెలివరీ ప్రణాళిక కొంతకాలం తరువాత ఉంటుంది అని వ్యాఖ్యానించారు".

వోల్వో V40 క్రాస్ కంట్రీ రోడ్డు ధర

"మా ఆలోచన తో సమంగా ఈ వాహనం సాంప్రదాయిక సెగ్మెంట్ లో పూర్తిగా కొత్త బాహ్య అంశాలతో మరియు విశ్వాసంతో ఒక దృశ్య వ్యక్తీకరణ ను కలిగి ఉంది. ఈ వాహనం యొక్క లోపల భాగం విషయానికి వస్తే, తదుపరి తరం ఎస్90 ను తీసుకున్నాము. అంతేకాకుండా, అధిక స్థాయిలో నియంత్రణను మరియు ఒక విలాసవంతమైన అనుభవాన్ని పంపిణీ చేస్తుంది" అని వోల్వో కార్ గ్రూప్ వద్ద సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డిజైన్ అయిన థామస్ ఇంజన్లత్ చెప్పారు.

"ఈ ఎస్90 వాహనం, డ్రైవింగ్, డైనమిక్స్, పనితీరు మరియు రైడ్ పరంగా ముందంజలో ఉంది. నియంత్రణ, సౌకర్యం, ఖచ్చితత్వం వంటి వాటితో వోల్వో డ్రైవింగ్ అనుభవాన్ని పునః రూపకల్పన చేశారు" అని వోల్వో కార్ గ్రూప్ వద్ద రీసెర్చ్ & డెవలప్మెంట్, సీనియర్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్. పీటర్ మెర్టెన్స్ చెప్పారు.

ఎస్90 యొక్క అన్ని వాహనాలు, 2016 వ సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత తీరంలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ వోల్వో వాహనాలు, ఒక విశేషాలపై స్కిమ్మింగ్ లేకుండా పోటీ క్రింద ధరకే వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

ద్వారా ప్రచురించబడినది

Write your వ్యాఖ్య

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?
New
Cardekho Desktop App
Cardekho Desktop App

Get 2x faster experience with less data consumption. Access CarDekho directly through your desktop