• English
  • Login / Register

వోల్వో S90 కొరకు టీజర్ చిత్రాలు విడుదల చేసింది

నవంబర్ 24, 2015 09:26 am sumit ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

వోల్వో దాని కొత్త దృఢమైన సెడాన్ వోల్వో S90 ని ప్రారంభించబోతున్నది మరియు ఈ వాహనం ఆడి ఆ8, బిఎండబ్లు 7 సిరీస్, మెర్సిడెస్ ఎస్-క్లాస్ వంటి వాహనాలకు పోటీగా ఉండవచ్చు. స్వీడిష్ కారు ఉత్పత్తిదారుడు S80 స్థానంలో ఉంచేందుకుగానూ రెండు టీజర్ చిత్రాలను జారీ చేసారు.  S90 లో ఒకే ఒక తేడా ఇది మార్కెట్లో అధిక స్థానాన్ని కలిగి ఉంటుంది.    

కాన్సెప్ట్ కూపే డిజైన్ నుండి సూర్తి పొంది, S90 వాహనం యొక్క ఉత్పత్తి దాదాపుగా పూర్తయ్యింది. దీని ముందరి భాగం 'థోర్' హేమర్ ఎల్ఇడి తో సన్నని హెడ్ల్యాంప్స్ ని కలిగి ఉండి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది మాత్రమే కాకుండా, క్రోం పూతతో నిలువు పలకల మద్దతుతో దీర్ఘచతురస్రాకార గ్రిల్ మరియు  పదునైన బంపర్ ముందరి భాగాన్ని  ప్రత్యేకమైనదిగా మరియు సొగసైనదిగా చేస్తుంది. ప్రక్క భాగల గురించి మాట్లాడితే, గట్టిగా అమర్చబడియున్న పారాబొలిక్ రూఫ్ తో  మృదువైన షీట్ మెటల్ ఉపరితలాలు కారుకి ఒక క్లిష్టమైన రూపాన్ని ఇస్తాయి. ప్రక్క ప్రొఫైల్ లో డే లైట్ ఓపెనింగ్ మరియు వెనుక భాగంలో భారీ సి- ఆకారంలో  LED టెయిల్‌లైట్స్ మరింత అందాన్ని చేకూరుస్తాయి.

అనధికారికంగా బయటపడిన మోడల్ కూడా కారు యొక్క అంతర్భాగాల అవగాహనను అందిస్తుంది. S90 కొత్త XC90 తో అనేక పోలికలు కలిగియున్నది. స్టీరింగ్ వీల్,  TFT ఇన్స్ట్రుమెంట్ పానెల్ లేదా సెంటర్ కన్సోల్ ప్రదర్శన అన్నీ కూడా దాని ఎస్యువి సిబిలింగ్ ని పోలి ఉంది. ఈ వాహనం అదే SPA (స్కేలబుల్ వేదిక ఆర్కిటెక్చర్) పై ఆధారపడి కొత్త XC90 కి మద్దతు ఇస్తుంది మరియు 2.0 లీటర్ నాలుగు సిలిండర్ల ఇంజన్ 8-స్పీడ్ గేర్ బాక్స్ తో అమర్చబడి ఉంటుంది. ఈ కారు యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లు కూడా AWD మరియు హైబ్రిడ్ సహాయ ఎంపికలతో వస్తాయి.

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience