• English
  • Login / Register

భారతదేశ లగ్జరీ కార్ల విభాగంలో 10% వాటాను సాధించడమే లక్ష్యంగా వోల్వో

ఆగష్టు 01, 2015 12:54 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: స్వీడిష్ వాహన తయారీ సంస్థ వోల్వో, భారతదేశంలో 4 కొత్త మోడళ్లను ప్రారభించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఈ రోజు వోల్వో కంపెనీ యొక్క ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ ప్రణాళిక వలన భారతదేశంలో 2020 నాటికి లగ్జరీ కార్ల సెగ్మెంట్లో తమ వాటా 10% పెరుగుతుందని భావిస్తున్నారు. వోల్వో ఆటో- ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ టామ్ వాన్ బోన్స్డార్ఫ్ మాట్లాడుతూ " మ సంస్థ గత సంవత్సరం కొంచెం అభివృద్ధిని పుంజుకుంది, మేము ఆ అభివృద్ధిని అలాగే కొనసాగించాలనుకుంటున్నాము. మేము 1,200 యూనిట్లు విక్రయించడం వలన మా వృద్ధి రేటు 30 శాతం పెరిగింది.” మా సంస్థ ఇప్పటి వరకు కేవలం ఒక డీలర్షిప్ ను మాత్రమే కోలకతా లో ప్రారంభించింది అని అన్నారు.

 "మేము లగ్జరీ కార్ల విభాగంలో 10 శాతం వాటాను సాధంచడమే మా ధ్యేయం. ప్రస్తుతం మేము ఆ విభాగంలో 4.5 శాతం వాటాను కలిగి ఉన్నాము మరియు మేము ప్రారంభించబోయే 4 కొత్త కార్లతో కొత్త డీలర్షిప్ లను విస్తరించుకుని మా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాము. భారతదేశంలో వోల్వో కి మంచి డిమాండ్ ఉంది ."అని ఆయన జోడించారు.

వోల్వో 2008 లో భారతదేశంలో తమ వ్యాపారం ప్రారంభించినప్పటి నుండి ఇతర లగ్జరీ బ్రాండ్లు అయినటువంటి బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ మరియు ఆడి వంటి వాటితో పోటీ పడుతూ వస్తుంది. 

వాన్ బోన్స్డార్ఫ్ మాట్లాడుతూ " మేము కొత్త ఉత్పత్తులను మరియు వేరియంట్స్ ను కలిగి యున్నాము. రాబోయే రెండు సంవత్సరాలలో మేము కొన్ని వేరియంట్స్ కాకుండా, 3 నుండి 5 కొత్త కార్లను ప్రారంభిస్తాము." అని ఆయన చెప్పారు. 

"మేము ధర మరియు బ్రాండ్ విలువ విషయంలో జర్మన్ పోటీదారులతో సమానంగా ఉండాలనుకుంటున్నాము. ఇవే కాకుండా మా ఉత్పత్తులు హ్యూమన్ సెంట్రిక్ మరియు సేఫ్టీ పద్దతుల ద్వారా అభివృద్ధి చేస్తాము." అని అన్నారు.

మేము ఈ అభివృద్ధిని సాధించడానికి, రాబోయే 4 కొత్త మోడళ్ల ద్వారా మా డీలర్షిప్ లను 20 వరకు పెంచుతాము అని ఆయన అన్నారు. వోల్వో గత నెలలో భారతదేశంలో దాని ఎస్60 యొక్క టి6 వేరియంట్ ను ప్రారంభించింది. వోల్వో యొక్క జాబితాలో లగ్జరీ మోడళ్లు వి40 హాచ్బాక్, వి40 క్రాస్ కంట్రీ, ఎక్స్ సి 60( లగ్జరీ ఎస్యూవి) మరియు ఎక్స్ సి 90( 7-సీట్ల లగ్జరీ ఎస్యూవి) మరియు రూ. 25 లక్షల వి40 కారు, ఇవి వోల్వో లగ్జరీ విభాగానికి చెందినవి. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience