• English
  • Login / Register

టొయోటా బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, నేపాల్ (బిబిఐఎన్) ఫ్రెండ్షిప్ మోటార్ ర్యాలీ 2015 లో పాల్గొనేందుకు తమ మద్దతు ప్రకటించింది

నవంబర్ 17, 2015 01:55 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకెఎం) బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, నేపాల్ (బిబిఐఎన్) ఫ్రెండ్షిప్ మోటార్ ర్యాలీ 2015 లో పాల్గొనేందుకు తమ మద్దతు ప్రకటించింది. ఈ ర్యాలీ నవంబర్ 14 భువనేశ్వర్ నుండి ప్రారంభం చేయబడింది. ఆ కార్యక్రమానికి  రోడ్డు రవాణా, హైవేల శాఖ కార్యదర్శి మిస్టర్ విజయ్ చిబ్బర్, టయోటా కిర్లోస్కర్ మోటార్ యొక్క  వైస్ చైర్మన్ మరియు హోల్ - టైమ్ డైరెక్టర్ అయిన మిస్టర్ శేఖర్ విశ్వనాథన్ మరియు 4 పాల్గొనే దేశాల యొక్క అంబాసిడర్లు/ హై కమీషనర్లు హాజరయ్యారు. ఈ ర్యాలీ డిసెంబర్ 2, 2015 న కోలకతా వద్ద ముగుస్తుంది.

జపనీస్ వాహనతయారీ సంస్థ బిబిఐఎన్ ఫ్రెండ్షిప్ ర్యాలీ కొరకు ఫార్చూనర్ మరియు ఇన్నోవాలను అందిస్తుంది. ఈ ర్యాలీ యొక్క మొదటి ఉద్దేశ్యం పాల్గొన్న 4 దేశాలు మధ్య అనుసంధానం, మెరుగైన అవకాశాలు మరియు ప్రజల మధ్య పరస్పర చర్చలు అభివృద్ధి చేయడం. అంతేకాక, టొయోటా నవంబర్ 25, 2015 న గౌహతి లో రహదారి భద్రత యొక్క ప్రాముఖ్యతను మరియు  సురక్షితమైన డ్రైవింగ్ కొరకు ఒక సెమినార్ నిర్వహించడం ద్వారా  ప్రజలకు శిక్షణనివ్వాలని లక్ష్యంతో కూడా ఉంది.          

ఈ ఈవెంట్ గురించి వ్యాఖ్యానిస్తూ, టొయోటా కిర్లోస్కర్ మోటార్ యొక్క వైస్ చైర్మన్ మరియు హోల్ - టైమ్ డైరెక్టర్ మిస్టర్ శేఖర్ విశ్వనాథన్, మాట్లాడుతూ "టయోటా వద్ద మేము ఈ చారిత్రక సంఘటనలో భాగంగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉన్నాము. మేము ప్రభుత్వానికి మరియు  సమాజంలోని ఒక సంపూర్ణ అభివృద్ధి సాధించాలనే ప్రయత్నాలలో ఉన్న  వివిధ రాష్ట్ర అధికారులకు మా మద్దతు ని అందిస్తాము. ఈ విధమైన అనుసంధానం మరియు సంబందాల ద్వారా పొరుగు దేశాలలో అందరి కొరకు కొత్త మరియు ఎక్కువ అవకాశాలు కలగవచ్చు. ఈ సంబందాలు మరియు అనుసంధీకరణలతో పాటూ రోడ్డు జాగ్రత్త మరియు భద్రతా ప్రమాణాల పట్ల దృష్టి ఉండడం ఎంతైనా ముఖ్యం." అని వివరించారు.     

రోడ్డు రవాణా, హైవేల శాఖ కార్యదర్శి, మిస్టర్. విజయ్ చిబ్బర్ కూడా వ్యాఖ్యానిస్తూ " బిబిఐఎన్ ఫ్రెండ్‌షిప్ ర్యాలీ పాల్గొనే దేశాల మధ్య మరింత  స్నేహం, పరస్పర విశ్వాసం మరియు సహకారాన్ని బలోపేతనం చేస్తుంది. దీని ద్వారా ప్రజల మధ్య కూడా సత్సంబంధాలు పెరిగే అవకాశం ఉంది. మేము భవిష్యత్తులో మరింత ఇటువంటి సాంస్కృతిక నిర్వహణలు నిర్మించాలని ఆశిస్తున్నాము. టీకేఎం పాల్గొనడం మరియు రోడ్ సేఫ్టీ ప్రాముఖ్యత ప్రచారంలో వారి మద్దతుని మేము స్వీకరించినందుకు చాలా  సంతోషంగా ఉన్నాము." అని తెలిపారు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience