టొయోటా ప్రపంచంలో అతిపెద్ద వాహన తయారీదారిగా నిలచింది
డిసెంబర్ 30, 2015 12:11 pm akshit ద్వారా ప్రచురించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
న్యూ డిల్లీ: టొయోటా మోటార్ కార్పొరేషన్ గత నెల ప్రపంచవ్యాప్త కార్ల అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంది మరియు వరుసగా ఐదో నెలలో వోక్స్వాగన్ AG ల అమ్మకాలను అధిగమించింది. జపనీస్ కార్ ఉత్పత్తిదారుడు దాదాపు 2,00,000 యూనిట్లు ముందు ఉండి డీజిల్ గేట్ ద్వారా ప్రభావితం అయిన జర్మన్ ప్రత్యర్థిని తలదన్నింది మరియు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన కారు ఉత్పత్తిదారిగా ఉండేందుకు సరైన దారిలో పయనిస్తుంది.
టొయోటా జనవరి-నవంబర్ కాలంలో 9.21 మిలియన్ మొత్తం వాహనాలు విక్రయించింది, అదే కాలంలో వోక్స్వాగన్ అమ్మకాలు చేసే 9.10 మిలియన్ కార్ల కంటే ఎక్కువ అమ్మకాలు చేసింది . అయితే US ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న జనరల్ మోటార్స్ ఈ ఏడాది 3 సంఖ్యతో ముగించవచ్చు.
జర్మన్ తయారీ సంస్థ యొక్క అమ్మకాలు నవంబర్ లో 2.2 శాతం పడిపోయాయి. దీనికి కారణం డిఫెక్ట్ డీజిల్ ఇంజిన్ తో అమర్చబడియున్న తమ 11 మిలియన్ డీజిల్ కార్లు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేయబడడమే.
వోక్స్వ్యాగన్ గ్రూప్ ఇండియా, 1.2 లీటర్, 1.5 లీటర్, 1.6 లీటర్, 2.0 లీటర్ EA 189 డీజిల్ ఇంజిన్లతో అమర్చబడియున్న దాదాపు 3,23,700 కార్లను రీకాల్ చేసింది. ఇవి 2008 మరియు 2015 మధ్య తయారుచేయబడి అమ్మబడ్డాయి. వోక్స్వ్యాగన్ బ్రాండ్ కార్లు 1,98,500 యూనిట్లు ప్రభావితం అవ్వగా, స్కోడా మరియు ఆడి EA 189డీజిల్ ఇంజిన్ తో అమర్చబడి వరుసగా 88,700 మరియు 36,500 యూనిట్లు ప్రభావితం అయ్యాయి. EA 189 అనుమతింపబడిన లిమిట్ కంటే 40 టైంస్ ఎక్కువ నైట్రోజన్ ఆక్సైడ్ ని విడుదల చేస్తున్నట్టుగా కనుగొనబడింది.
ఇంకా చదవండి