Toyota Innova Crysta: రూ. 37,000 వరకు పెరిగిన టయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు
టయోటా ఇనోవా క్రైస్టా కోసం shreyash ద్వారా ఆగష్టు 03, 2023 04:37 pm ప్రచురించబడింది
- 202 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టయోటా ఇన్నోవా క్రిస్టా కేవలం రెండు నెలల్లోనే రెండవసారి ధర పెరుగుదలను చవిచూసింది
-
ఇన్నోవా క్రిస్టా యొక్క టాప్-స్పెక్ GX వేరియంట్ ధర రూ. 37,000 వరకు పెరిగింది.
-
మిడ్-స్పెక్ VX వేరియంట్ యొక్క ధరకు రూ. 35,000 జోడించడం తో ఇది కూడా ఎంతో ఖరీదైనదిగా మారింది.
-
ఇన్నోవా క్రిస్టా 2.4-లీటర్ 150PS డీజిల్ ఇంజన్‌తో మాత్రమే అందించబడుతుంది.
-
దీని ఫీచర్లు 8-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ AC మరియు 8-వే ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు.
-
దీని కొత్త ధరలు రూ.19.99 లక్షల నుండి రూ.26.05 లక్షల వరకు ఉన్నాయి.
టయోటా ఇన్నోవా క్రిస్టాను కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే రెండు నెలల్లోనే ప్రస్తుతం ఉన్న MVPకి వరుసగా రెండో సారి ధరలు పెంచారు. టాప్-స్పెక్ వేరియంట్ కి అత్యధికంగా ధరలు పెంచడం కూడా జరిగింది. కానీ బేస్-స్పెక్ వేరియంట్ ధరలు అలాగే ఉన్నాయి.
క్రింద పట్టికలో ఇన్నోవా క్రిస్టా యొక్క వేరియంట్ వారీ ధరలను చూద్దాం.
వేరియంట్ |
పాత ధరలు |
కొత్త ధరలు |
తేడా |
GX (7S) |
Rs 19.99 లక్షలు |
Rs 19.99 లక్షలు |
తేడా లేదు |
GX (8S) |
Rs 19.99 లక్షలు |
Rs 19.99 లక్షలు |
తేడా లేదు |
VX (7S) |
Rs 24.04 లక్షలు |
Rs 24.39లక్షలు |
+ Rs 35,000 |
VX (8S) |
Rs 24.09లక్షలు |
Rs 24.44 లక్షలు |
+ Rs 35,000 |
ZX (7S) |
Rs 25.68లక్షలు |
Rs 26.05 లక్షలు |
+ Rs 37,000 |
ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ
అగ్ర శ్రేణి వేరియంట్ రూ. 37,000ల ధర పెంపును పొందింది. బేస్-స్పెక్ GX వేరియంట్‌లు ఈ ధర పెంపు వల్ల ప్రభావితం కావు. అవి ఇప్పటికీ బేస్-స్పెక్ ఇన్నోవా హైక్రాస్ కంటే రూ. 32,000 ఖరీదైనవి.
ఇంకా తనిఖీ చేయండి: టయోటా ఇన్నోవా క్రిస్టా ఇప్పుడు అంబులెన్స్‌గా అనుకూలీకరించబడుతుంది
ఇన్నోవా క్రిస్టా ఏమి ఆఫర్ చేస్తుంది?
ఇన్నోవా క్రిస్టా పరికరాల జాబితాలో, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఎసి, 8-వే ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, లెథెరెట్ సీట్లు, వన్-టచ్ టంబుల్ సెకండ్-వరుస సీట్లు వంటి అంశాలు అందించబడ్డాయి.
ప్రయాణీకుల భద్రత పరంగా దీనిలో- ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ అలాగే హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి అంశాలు భద్రతను మరింత పెంచుతాయి.
ఇప్పటికీ ఇది డీజిల్ MPV
టయోటా ఇన్నోవా క్రిస్టా MVP యొక్క ముఖ్య ఆకర్షణలలో ఒకటి ఏమిటంటే ఇది ఇప్పటికీ 2.4-లీటర్ డీజిల్ ఇంజన్‌తోనే వస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి 150PS పవర్ ను మరియు 343Nm టార్క్‌ను అందిస్తుంది. మరోవైపు ఇన్నోవా హైక్రాస్, పెట్రోల్ మరియు బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లతో అందించబడుతుంది. దీనికి మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉండదు.
ప్రత్యర్థులు
టయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు రూ. 19.99 లక్షల నుండి రూ. 26.05 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉన్నాయి. ఈ MPV మహీంద్రా మరాజ్జో మరియు కియా క్యారెన్స్ లకు ప్రీమియం ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది.
మరింత చదవండి: టయోటా ఇన్నోవా క్రిస్టా డీజిల్