ఫిబ్రవరి 2023లో, ఈ ఆకర్షణీయమైన 8 కార్‌లు మీ ముందుకు రాబోతున్నాయి

published on ఫిబ్రవరి 01, 2023 03:37 pm by rohit for citroen ec3

 • 58 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

సంవత్సరంలో తక్కువ రోజులు ఉండే ఈ ఫిబ్రవరి నెలలో ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ ఆవిష్కరణను, ప్రాముఖ్యత పొందిన ఒక MPV డీజిల్ వెర్షన్‌తో తిరిగి రావడాన్ని చూడవచ్చు. 

Upcoming cars in February 2023

ఆటో ఎక్స్ؚపో కార్యక్రమంతో పాటు కొత్త కార్‌ల ఆవిష్కరణ మరియు ప్రవేశాలతో భారత ఆటోమోటివ్ విభాగం 2023వ సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. కారు తయారీదారులలో ఇదే ఉత్సాహం ఫిబ్రవరి నెలలో కనిపించకపోవచ్చు, కానీ రాబోయే 28 రోజులలో కొన్ని కొత్త కార్‌లు షోరూమ్ؚలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ జాబితాలో సరికొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్, ప్రజాదరణ పొందిన టయోటా MPV మళ్ళీ తిరిగి రావడాన్ని చూడవచ్చు: 

సిట్రోయెన్ eC3 

Citroen eC3

భారతదేశ మార్కెట్‌లో ఈ కారు తయారీదారు నుండి కేవలం మూడవ వాహనం అయిన, eC3తో సిట్రోయెన్ చవకైనా EV విభాగంలోకి ధైర్యంగా ప్రవేశిస్తుంది. 10-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ؚతో సహా సాధారణ C3 హ్యాచ్ؚబ్యాక్ؚలో కలిగి ఉన్న ఫీచర్‌లపై ఆధారపడి, దాదాపుగా అదే లుక్‌తో కనిపిస్తుంది. ఈ కార్‌ల బుకింగ్ؚలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, ఈ EV 29.2kWh బ్యాటరీ ప్యాక్‌తో, 57PS/143Nm ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి 320కిమీ పరిధి అందిస్తుంది అని  అంచనా. 

టాటా ఆల్ట్రోజ్ రేసర్

Tata Altroz Racer

టాటా, ఆటో ఎక్స్ؚపో 2023లో ఆల్ట్రోజ్ రేసర్ؚను ప్రదర్శించింది, ఇది వారి ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్‌ల కంటే ఆకర్షణీయమైన వర్షన్. ఇది లుక్ మరియు ఫీచర్‌ల నవీకరణలతో పాటు, నెక్శాన్ 120PS, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కూడా కలిగి ఉంది. ఈ కొత్త ఆల్ట్రోజ్ వర్షన్ؚను త్వరలోనే లాంచ్ చేయబోతునట్లు కారు తయారీదారు ఇటీవల నిర్దారించారు, ఈ కారు టాటా ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ؚలలో ఎన్నో విషయాలలో మొదటగా నిలుస్తుంది. 

ఇది కూడా చదవండి: ప్రస్తుత టర్బో యూనిట్‌ల కంటే టాటా సరికొత్త TGDi ఇంజన్‌లను ఉత్తమమైనవిగా నిలిపేవి ఏమిటో? ఇక్కడ తెలుసుకుందాం 

టయోటా ఇన్నోవా క్రిస్టా

New Toyota Innova Crysta

టయోటా ఇన్నోవా క్రిస్టా త్వరలోనే తిరిగి వస్తుంది, ఈ వాహనం బుకింగ్ؚలు కూడా ప్రారంభమయ్యాయి. ఇది నవీకరించబడిన ముందు భాగంతో వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో కేవలం డీజిల్ వెర్షన్‌లో కొనసాగుతుంది, ఇందులో వెనుక-వీల్ డ్రైవ్ؚట్రెయిన్ (RWD), ధృడమైన ఫ్రేమ్ నిర్మాణంతో సహా OG ఇన్నోవాలో ఉన్న అంశాలన్నీ దీనిలో ఉన్నాయి. ఇంతకు ముందులానే టయోటా దీన్ని అవే వేరియెంట్‌లుగా అందిస్తుంది.

టాటా ఆల్ట్రోజ్ CNG

Tata Altroz CNG

ఫిబ్రవరి 2023లో, టాటా ఆల్ట్రోజ్ వెర్షన్‌తో CNG కిట్ ఎంపికగల మరొక ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్‌ను ఆశించవచ్చు. ఈ కారు తయారీదారు, ఆల్ట్రోజ్ؚతో తన ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతను ఆటో ఎక్స్ؚపో 2023లో ప్రదర్శించారు, ఇందులో సాధారణ సింగిల్ CNG సిలిండర్ సెట్అప్ కంటే ఎక్కువ బూట్ؚస్పేస్ؚను అందించే కొత్త ట్విన్ CNG సిలిండర్‌లతో వస్తుంది. ఇది మునపటి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో కొనసాగుతుంది కానీ CNGతో నడిచినప్పుడు 77PS/95Nmను ఇస్తుంది, ఐదు-స్పీడ్‌ల MTతో జోడించబడింది.

ఇది కూడా చదవండి: ఆటో ఎక్స్ؚపో 2023 ప్రదర్శించిన అన్నీ కార్‌లలో ఈ సంవత్సరం లాంచ్ కానున్న కార్‌లు, మనం చూడాలనుకుంటున్న మరి కొన్ని కార్‌లు క్రింది ఇవ్వబడ్డాయి. 

ఆడి Q3 స్పోర్ట్ؚబ్యాక్

2023 Audi Q3 Sportback

ప్రామాణిక Q3 మనకు సరిపోదు అనుకుంటే, కూపే-వంటి ఏటవాలు రూఫ్ؚలైన్ؚను కలిగి ఉన్న Q3 స్పోర్ట్‌బ్యాక్ؚను కూడా ఆడి అందిస్తుంది. ఇది హనీకోంబ్ వంటి గ్రిల్, ORVMలు, విండో బెల్ట్ؚలైన్ గల Q3 స్పోర్టియర్ వర్షన్ అని చెప్పవచ్చు. సాధారణ Q3, Q3 స్పోర్ట్ؚబ్యాక్ؚలు 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆడి MMI ఇన్ఫోؚటైన్మెంట్ సిస్టమ్ؚతో సహా దాదాపుగా ఒకే క్యాబిన్ؚను కలిగి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలు రెండిటితో అందిస్తుండగా, ఇండియా-స్పెక్ Q3 స్పోర్ట్ؚబ్యాక్ మాత్రం కేవలం పెట్రోల్ పవర్ ట్రెయిన్ؚతో వస్తుంది, ప్రామాణిక Q3 నుండి బహుశా 190PS 2-లీటర్‌ల టర్బో-పెట్రోల్ యూనిట్ؚను కలిగి ఉండవచ్చు.

టాటా పంచ్ CNG

Tata Punch CNG

ఆల్ట్రోజ్ CNGతో పాటు, ఆటో ఎక్స్ؚపో 2023లో టాటా పంచ్ CNGని కూడా ప్రదర్శించింది. ఆల్ట్రోజ్ CNGలో ఉన్నట్లుగా, ఈ మోడల్ అదే డ్యూయల్ CNG సిలిండర్ కలిగి ఉన్నాయిؚ, ఐదు-స్పీడ్‌ల MTతో అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (CNG లో 77PS/95Nm పవర్, టార్క్ లను అందిస్తుంది)తో వస్తుంది. లాంచ్ తరువాత, దీనికి ఎటువంటి ప్రత్యక్ష పోటీదారులు ఉండకపోవచ్చు, మారుతి స్విఫ్ట్ CNGకి ఇది ప్రత్యామ్నాయం కావచ్చు.

ఐదవ-తరం లెక్సస్ RX

2023 Lexus RX

ఈ ఫిబ్రవరిలో, లెక్సస్ తన ఐదవ-తరం RXను భారతదేశంలో ఆవిష్కరిస్తుందని ఆశిస్తుంది. ఈ కారు తయారీదారు నుండి భారతదేశంలో ఉన్న SUV జాబితాలోని ప్రాధమిక స్థాయి SUV NX, మరియు ప్రధానమైన SUV, LXల మధ్య స్థానాన్ని ఈ కార్ భర్తీ చేస్తుంది. తన ఐదవ-తరం లుక్‌లో, RX అభివృద్ధి చెందిన డిజైన్ؚతో మునుపటి మోడల్ కంటే ధృడంగా, స్పోర్టియర్ؚగా కనిపిస్తుంది. ఇందులో ట్రై-జోన్ క్త్లెమేట్ కంట్రోల్, 14-అంగుళాల టచ్ؚస్క్రీన్, ఆధునిక డ్రైవర్-అసిస్టెంట్ సిస్టమ్ؚలు (ADAS) వంటి ఎన్నో పరికరాలు ఉన్నాయి. లెక్సస్ దీన్ని రెండు వేరియెంట్‌లలో విక్రయిస్తుంది, పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో రెండిటిలో ఫ్రంట్-వీల్ డ్రైవ్ (FWD), ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఎంపికలు కూడా ఉన్నాయి. 

మారుతి బ్రెజ్జా CNG 

Maruti Brezza CNG

భారతదేశంలో CNGతో SUVని అందించే వారిలో మారుతి మొదటగా నిలుస్తుంది. భారతదేశ మార్కెట్ కోసం ఇంధన ప్రత్యామ్నాయంతో మొదటి 4m కంటే తక్కువ ఎత్తు SUV బ్రెజ్జా CNGని సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది, ఇదే జరిగితే త్వరలో రెండు CNG SUVలను తన లైన్అప్ؚలో కలిగి ఉన్న మొదటి బ్రాండ్ అవుతుంది. ఈ కారు తయారీదారు, SUV మిడ్-స్పెక్ VXi మరియు ZXi వేరియెంట్‌లను కూడా CNG ఎంపికలో అందిస్తుందని మేం ఆశిస్తున్నాము, ఇవి సాధారణ వేరియంట్‌ల విధంగా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తాయి (అయితే 88PS, 121.5Nm అందించవచ్చు). మారుతి దీన్ని కేవలం ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ గేర్ బాక్స్ؚతో అందిస్తుంది. 

ఇది కూడా చదవండి: 2030 నాటికి గరిష్ట అమ్మకాలు ICE మోడల్స్, కనిష్ట అమ్మకాలు  EV మోడల్స్ నుండి ఉంటాయని మారుతి అంచనా వేస్తుంది.

ఈ ఎనిమిది కార్‌లు ఫిబ్రవరి 2023లో మన ముందుకు వచ్చే అవకాశం ఉంది, ఇతర కారు తయారీదారులు నుండి కూడా కొన్ని మోడల్‌లను ఆశించవచ్చు. వీటిలో ఏ మోడల్ మీకు నచ్చిందో కామెంట్‌లో మాకు తెలియచేయండి. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన సిట్రోయెన్ ec3

Read Full News
 • టాటా ఆల్ట్రోస్
 • టాటా punch
 • ఆడి క్యూ3
 • మారుతి brezza
 • citroen ec3
 • ola ఎలక్ట్రిక్ car
 • tata altroz racer
 • టయోటా ఇనోవా క్రైస్టా
 • లెక్సస్ ఆర్ఎక్స్ 2023

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

trending ఎలక్ట్రిక్ కార్లు

 • పాపులర్
 • ఉపకమింగ్
×
We need your సిటీ to customize your experience