• English
  • Login / Register

ఇప్పుడు అంబులెన్స్ؚలా కూడా అనుకూలీకరించడానికి వీలున్న టయోటా ఇన్నోవా క్రిస్టా

టయోటా ఇనోవా క్రైస్టా కోసం shreyash ద్వారా జూలై 28, 2023 11:41 am సవరించబడింది

  • 1.5K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

అవసరమైన అత్యవసర వైద్య ప్రయోజనాల సాధనాలను అందించేలా ఈ MPV క్యాబిన్ వెనుక సగభాగం ఇప్పుడు పూర్తిగా సవరించబడింది

Toyota Innova Crysta Ambulance

  •  ఇన్నోవా క్రిస్టా అంబులెన్స్ రెండు వేరియెంట్ؚలలో లభిస్తుంది: బేసిక్ మరియు అడ్వాన్సెడ్. 

  •  బయటి వైపు అంబులెన్స్-ప్రత్యేక స్టిక్కర్‌లు మరియు గ్రాఫిక్‌లు కాకుండా ఇంకా మరింత పొందుతుంది.

  •  లోపల, రెండు మరియు మూడవ వరుస సీట్లను తొలగించి, స్ట్రెచర్ ఉంచడానికి వీలు కల్పించారు.

  •  టాప్-స్పెక్‌లో మల్టీపారామీటర్ హెల్త్ మానిటర్, ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్ మరియు కేండ్రిక్ ఎక్స్ؚట్రికేషన్ పరికరం వంటి వైద్య సామగ్రితో వస్తుంది.  

  •  ఇన్నోవా క్రిస్టా కేవలం డీజిల్-మాన్యువల్ పవర్ؚట్రెయిన్ؚతో లభిస్తుంది.

 టయోటా ఇన్నోవా క్రిస్టా MPV భారతదేశంలో పేరున్న, ప్రజాదరణ పొందిన ప్రజల రవాణా వాహనం, ప్రత్యేకించి డ్రైవింగ్ డైనమిక్స్ మరియు ప్రయాణీకుల సౌకర్యాల కలయికకు ప్రాధాన్యతను ఇచ్చే వారు దీన్ని ఎంచుకుంటారు. ప్రస్తుతం, ఈ ప్రీమియం MPVలోని ఇవే అంశాలు వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగపడటానికి, వివరణాత్మక కన్వర్షన్ؚతో ఇన్నోవా క్రిస్టాను అంబులెన్స్ؚలా మారుస్తున్నారు.

 ఈ అంబులెన్స్ కన్వర్షన్ ప్రక్రియ పిన్నకిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భాగస్వామ్యంలో జరుగుతోంది, ఇది రెండు వర్షన్ؚలలో లభిస్తుంది – బేసిక్ మరియు అడ్వాన్సెడ్. 

ఇది భిన్నంగా ఎలా ఉంటుంది?

Toyota Innova Crysta Ambulance

మొత్తం మీద డిజైన్ విషయంలో ఇన్నోవా క్రిస్టా అంబులెన్స్, సాధారణ వర్షన్ కంటే భిన్నంగా కంపించదు, అయితే అంబులెన్స్ؚకు ప్రత్యేకమైన ఎరుపు మరియు పసుపు స్టిక్కర్‌లు వాహనం చుట్టూ ఉంటాయి మరియు ఎమర్జెన్సీ ఫ్లాషింగ్ లైట్‌లు రూఫ్ పైన అమర్చబడ్డాయి.

వాహనం లోపల, రోగి మరియు పారమెడిక్‌ను డ్రైవర్ నుండి వేరు చేసేలా క్యాబింగ్ ముందు భాగం మిగిలిన భాగం నుండి పార్టిషన్ చేయబడింది. ఇన్నోవా క్రిస్టా రెండవ మరియు మూడవ వరుస సీట్‌లను తొలగించి స్ట్రెచర్, ఫ్రంట్-ఫేసింగ్ పారామెడిక్ సీట్ మరియు పోర్టబుల్ మరియు స్టేషనరీ ఆక్సిజన్ సిలిండర్‌లు, వైద్య సామగ్రిని స్టోర్ చేయడానికి క్యాబినెట్ వంటి ఇతర అత్యవసర సాధనాలను అమర్చారు.

అంబులెన్స్ ఫీచర్‌లు

Toyota Innova Crysta Ambulance Interior

ఇన్నోవా క్రిస్టా అంబులెన్స్ వర్షన్ؚలోని సవరించిన క్యాబిన్ కుడి వైపు గోడ పూర్తిగా అత్యవసర పరిస్థితులకు అవసరమైన పరికరాలను కలిగి ఉంది. టాప్ ఎండ్ అడ్వాన్సెడ్ వేరియెంట్ؚలో రోగి ఆరోగ్య పారామితులను పర్యవేక్షించడానికి సహాయపడే మల్టీపారామీటర్ మానిటర్, ఆక్జిజన్ డెలివరీ సిస్టమ్, కేండ్రిక్ ఎక్స్ؚట్రికేషన్ పరికరం (తల, మెడ, మరియు పొట్టకు మద్దతు కోసం ఉపయోగించేది), పోర్టబుల్ సక్షన్ ఆస్పిరేటర్ మరియు స్పైన్ బోర్డ్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. 

అన్నీ ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడానికి వీలుగా క్యాబిన్ లోపల అదనపు పవర్ సాకెట్ؚలను కూడా అందించారు. 

ఇది కూడా చూడండి: ఇండియా-స్పెక్ టయోటా రూమియన్ లుక్ ఇలా ఉండవచ్చు

అదే ఇంజన్ 

ఇన్నోవా క్రిస్టా అంబులెన్స్, సాధారణ ఇన్నోవా క్రిస్టాలో ఉన్నట్లుగానే 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ؚను (150PS మరియు 343Nm) కలిగి ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడుతుంది. 

ఇన్నోవా అంబులెన్స్ ఎందుకు?

Toyota Innova Crysta Ambulance

ప్రత్యేక ప్రయోజనం కోసం తయారు చేసిన సంప్రదాయ అంబులెన్స్ సరైనదిగా అనిపించినప్పటికీ, ఇది అన్నీ పరిస్థితులకు అనుగుణంగా ఉండదు. అంతేకాకుండా ఇవి చాలా ఖరీదైనవి మరియు అత్యవసర వైద్య పరిస్థితుల కోసం బాగా ఉపయోగపడతాయి. తీవ్రమైన వైద్య చికిత్స అవసరం లేని రోగులను తీసుకువెళ్లడం వంటి సాధారణ ఉపయోగాల కోసం ఇతర వాహనాలను పరిగణించవచ్చు.

ఇన్నోవాను సింగిల్-పేషెంట్ ట్రాన్స్ؚపోర్ట్ؚకు ఇదే కారణంగా ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు, దీని పరిమాణం సాపేక్షంగా చిన్నది మరియు నగర పరిస్థితులలో తేలికగా నడపవచ్చు. అదనంగా, దీని మృదువైన రైడ్ నాణ్యత చాలా ధూరాలు ఉండే ఆసుపత్రి బదిలీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. 

సాధారణ ఇన్నోవా క్రిస్టా 

3-వరుసల టయోటా ఇన్నోవా క్రిస్టా, సాధారణంగా కుటుంబ MPVగా ఎక్కువగా ఉపయోగించబడుతుంది, దీని ధర రూ.19.99 లక్షల నుండి రూ.25.68 లక్షల (ఎక్స్-షోరూమ్ భారతదేశం) వరకు ఉంటుంది. అంబులెన్స్ కన్వర్షన్ అదనపు ఖర్చును వెల్లడించలేదు. ఇన్నోవాను మహీంద్రా మరాజ్జో మరియు కియా క్యారెన్స్ؚలకు ప్రీమియం ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు, వీటిలో రెండవ వాహనాన్ని కూడా ఎమర్జెన్సీ వెహికిల్ కన్వర్షన్ؚతో అందిస్తారు.

ఇక్కడ మరింత చదవండి: ఇన్నోవా క్రిస్టా డీజిల్

was this article helpful ?

Write your Comment on Toyota ఇనోవా Crysta

1 వ్యాఖ్య
1
D
dr milton kaviraj
Apr 14, 2024, 10:29:25 AM

When will be lunching innova ambulance?

Read More...
    సమాధానం
    Write a Reply

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience