• English
  • Login / Register

టొయోటా భారతదేశం వారు జెన్యూన్ స్పేర్ పార్ట్స్ యొక్క ఆన్లైన్ అమ్మకాలను ప్రవేశ పెడుతున్నారు

ఆగష్టు 14, 2015 11:49 am raunak ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టొయోటా కిర్లోస్కర్ మోటరు ఆన్లైన్ లో జెన్యూన్ స్పేర్ పార్ట్స్ అమాకాన్ని ప్రవేశ పెట్టిన దేశంలోనే మొదటి ఆటో మేకర్

జైపూర్: టొయోటా వారు స్పేర్ పార్ట్స్ మరియూ కారు ఉపకరణాలు ఆన్లైన్ ద్వారా అమ్మకాలు జరపేందుకు సిద్ధం అయ్యారు. ఇది ఈ వైపుగా దేశం లోని ఆటో తయారిదారుల ద్వార తీసుకోబడిన తొలి ప్రయత్నం. కస్టమర్ల ఇంటి ముందుకే టొయోటా వారి సేవలను తీసుకురావడం అనేదే ఈ సంకల్పం వెనుక అసలు ఆశయం. కంపెనీ ప్రకారం, విడుదల మొదటి భాగంలో ఈ సదుపాయాలు బెంగుళూరు లో అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత మిగతా సిటీలకు కూడా ఈ సేవలను విస్థరించడం జరుగుతుంది.

ముందుగా, దాదాపు 400 టొయోటా జెన్యూన్ స్పేర్ భాగాలను, బ్రేక్ పార్ట్స్, క్లచ్ ప్యాడ్స్, వైపర్ బ్లేడ్లు, ఆయిల్ ఫిల్టర్లు, ఎయిర్ ఫిల్టర్లు వంటివి మరియూ ఇతర 30 రకాల టొయోటా జెన్యూన్ ఉపకరణాలు కూడా ఆన్లైన్ లో పార్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అమ్మబడతాయి. దీనిలోని ముఖ్య ఉపయోగాలు ఏమిటంటే, విస్తృత శోధన చేసి సరైన భాగాలను ఎంచుకోగలగటమే కాకుండా, దగ్గరలోని టొయోటా డీలర్/డిస్ట్రిబ్యూటర్ ని స్పేర్ పార్టులను అందించేందుకు ఎంచుకునే అవకాశం ఉంటుంది. పైగా, స్పేర్ పార్ట్స్ కొనుగోలు చేసిన తరువాత, వాటిని అమర్చేందుకు అవసరమైన్ సమాచారం మరియూ సహాయాన్ని కలిగిన సూచనల మాన్యువల్ ని కూడా పొందు పరచడం అయ్యింది. 

పరకటన గురించి మాట్లాడుతూ, హోల్ టైం డైరెక్టర్ మరియూ వైస్ చైర్మెన్ అయిన మిస్టర్. శేఖర్ విశ్వనాథన్ గారు ఏమన్నారంటే, " ఇండస్ట్రీలోనే మొట్టమొదటి సారిగా ఒక ఆన్లైన్ వేదికను మేము ప్రవేశ పెడుతున్నాము. దీని ద్వారా మేము మా కస్టమర్లకు మరిత చేరువై వారిని ఆనంద పరచడమే కాకుండా వారి పట్ల మా నిబద్ధతని మేము మరింత ధృఢం చేయగలము. భారతీయ డిజిటల్ కామర్సు ఎంతో వేగంగా ఎదుగుతోంది. స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ మరియూ ల్యాప్టాప్స్ వినియోగం పెరిగుతోంది. కాబట్టి టొయోటా వారు కస్టమర్ అభిప్రాయం తెలుసుకుంటు వారికి కావలసినట్టుగా మా సేవలకు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటాము. ఈ సదుపాయాలను కూడా మేము వేరే నగరాలకు విస్థరిస్తాము," అని అన్నారు. 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience