• English
  • Login / Register

ఎమైటీ, స్టాంఫోర్డ్ మరియూ 50 మిలియన్ యూఎస్ డాలర్లతో టొయోటా సెల్ఫ్-డ్రైవింగ్ కారు రేసు లోకి అడుగు పెడుతోంది

సెప్టెంబర్ 07, 2015 12:02 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:టొయోటా వారు ఎట్టకేలకు సెల్-డ్రైవింగ్ కారు రేసులోకి ప్రవేశించాలని, ఇందుకు గాను వచ్చే 5 సంవత్సరాలకు గాను 50 మిలియన్ డాలర్ల పెట్టుబడిని వెచ్చించాలని నిర్ణయించుకున్నారు. ఈ జపనీస్ తయారీదారి స్టాంఫోర్డ్ యూనివర్సిటీ మరియూ మస్సాచ్సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమైటీ) లో జాయింట్ రీసర్చ్ సెంటర్ ని పెట్టబోతున్నారు. వీటి ద్వారా వారి "ఇంటెలిజెంట్" సెల్ఫ్-డ్రైవింగ్ కార్స్ ని అభివృద్ది చేయనున్నారు. ఈ పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేసం కారు పరిసరాలను గమనించి ప్రమాదాలను నిరోధించగలిగేడట్టుగా ఉండాలి అని, తద్వారా రోడ్డు ప్రమాదాలను నిరువరించాలని.

స్టాంఫోర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబొరేటరీ కి డైరెక్టర్ అయిన ఫే-ఫే లీ గారు స్టాంఫోర్డ్ లోని పరిశోధన ని పర్యవేక్షిస్తారు మరియూ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మరియూ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెస్సర్ అయిన డానియల్ రూస్ గారు ఎమైటీ లోని పరిశోధన కి ఆధిపత్యం వహిస్తారు. ఫే-ఫే గారు, "మా టీము తెలివైన వాహనాలకు రోడ్డు లోని పరిసర వస్తువులను, మనుషులను గుర్తించి సురక్షితమైన మరియూ తెలివైన డ్రైవింగ్ నిర్ణయాలను వైవిధ్య పరిస్థితుల్లో తీసుకుంటుంది," అని తెలిపారు.   

టొయోటా కి సీనియర్ మానేజర్ ఆఫీసర్ అయిన కియోటక ఈసే గారు," మేము ముందుగా ట్రాఫిక్ ప్రమాదాలను అరికట్టేందుకు గాను ఇంటెలిజెంట్ వాహనం యొక్క అగ్సెలరేషన్ మీద దృష్టి పెడతాము.ఆ తరువాత, మెరుగైన చలనం మరియూ రోబాటిక్స్ ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తాము," అని అన్నారు.

డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసర్చ్ ప్రొజెక్ట్స్ ఏజెన్సీ (డీఏఆర్పీఏ) కి ప్రోగ్రాం మేనేజర్ అయిన గిల్ ప్రట్ట్ గారిని ఈ టొయోటా యొక్క ప్రాజెక్ట్ కి ఇంచార్జీని చేశారు. ప్రాట్ గారు," ఈ అనుసంధానం అత్యంత క్లిష్టమైన చలన సవాళ్ళను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీర్చే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగస్వామ్యం పొంది టొయోటా, స్టాంఫోర్డ్ మరియూ ఎమైటీ లతో పనిచేయడం నాకు ఆనందంగా ఉంది. వాహనం యొక్క పరిసరాలను గుర్తించి, తెలివైన నిర్నయాలను తీసుకుని, వాహనం లోని ప్రయాణికులను మరియూ పాదచారులను సురక్షితంగా ఉంచేటువంటి పరిఙానం రూపొందించాలని ఆశిస్తున్నాను," అని అన్నారు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience