టయోటా ఇతియోస్ మోటర్ రేసింగ్ యొక్క తృతియ సంచికను ప్రకటించారు
సెప్టెంబర్ 25, 2015 11:44 am konark ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ముంబై: రెండు విజయవంతమైన ఇతియోస్ మోటర్ రేసింగ్ ల తరువాత, టొయోటా కిర్లోస్కర్ వారు ఇఎంఆర్ కప్ యొక్క తృతీయ సీజన్ తో సెప్టేంబరు 26 మరియూ 27 తేదీల నాడు బుద్ద్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లలో రాబోతున్నారు.
నొయిడాలో ఒక ప్రెస్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, టొయోటా కిర్లోస్కర్ మోటర్ లొ మర్కెటింగ్ & సేల్స్ విభాగానికి డైరెక్టర్ మరియూ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన ఎన్.రాజా గారు," మేము ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ తృతీయ సీజన్ ని జరుపుతున్నందుకు మాకు గర్వంగా ఉంది. ఈ ఇఎంఆర్ ట్రోఫీ యువ రేసర్లకి కేవలం ఒక వేదిక మాత్రమే కాదు, పెద్ద పెద్ద అవకాశాలకు వారికి ఇదొక తయారీ వంటిది కూడా. ఈ ఇతియోస్ మోటర్ రేసింగ్ వేదిక యువ రేసర్ల రేసింగ్ మెలకువలు మెరుగు పరిచేందుకు ఉపయోగపడుతుంది. ఈ సీజన్ ప్రత్యేకంగా కొత్తగా ఎంపిక చేసిన రేసర్ల తో బాగా నడుస్తుంది అని ఆశిస్తున్నాము," అని అన్నారు.
ఈ కార్యక్రమంలో 12 కొత్త డ్రైవర్లు పాల్గొంటారు. వారి వరుస ఇలా ఉంది - హిషం ఇ.కె.పి, హషిం ఇ.కె.పి, సుచింద్రా గౌడా, దీపక్ పి, కార్తిక్ కొచండి, అర్జున్ ఎస్, సయ్యద్ నజీర్, మెజాన్ అనీస్, విభవ్ పార్కర్, వినోద్ గోపాలస్వామి, అబిన్ థామస్, ఉత్సవ్ షా, తాపేష్వర్ సజీత్, వివేక్ రాంచందర్ మరియూ జగ్‌జ్యోత్ సింగ్.
ఇతియోస్ మోటర్ రేసింగ్ సీరీస్ సింగల్-మేక్ రేసింగ్ చాంపియన్‌షిప్ ప్లాట్‌ఫార్మ్ పై పనిచేస్తుంది. టిఆర్డి (టొయోటా రేసింగ్ డెవెలప్మెంట్, జపాన్) వారు స్పెషల్ రేసింగ్ ఎక్విప్మెంట్ ని టొయోటా ఇతియోస్ ని సవరించడానికి అందించారు మరియూ ఇవి అత్యంత సామర్ధ్యం మరియూ రక్షణ కల్పిస్తాయి.