బేస్-స్పెక్ టయోటా ఇన్నోవా క్రిస్టా ధర ఇన్నోవా హైక్రాస్ؚకు సమానమైన వేరియంట్‌తో పోలిస్తే చాలా ఎక్కువ
టయోటా ఇ నోవా క్రైస్టా కోసం ansh ద్వారా మార్చి 16, 2023 12:17 pm ప్రచురించబడింది
- 36 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ MPV డీజిల్ వెర్షన్ లోయర్ వేరియెంట్ؚల ధరలను వెల్లడించారు
-
2023 ఇన్నోవా క్రిస్టా ధరలు రూ.19.13 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభం అవుతాయి.
-
150PS పవర్ మరియు 343Nm టార్క్‌తో, RDE-అనుగుణ 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ؚతో వస్తుంది.
-
G, GX, VX మరియు ZX అనే నాలుగు వేరియెంట్‌లలో అందిస్తున్నారు. VX మరియు ZX వేరియెంట్‌ల ధరలను ఇంకా వెల్లడించలేదు.
-
ఏడు-ఎయిర్ బ్యాగ్ؚలు, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిట్-వే సవరించగలిగిన డ్రైవర్ సీట్ ఉంటాయి.
-
ఇన్నోవా క్రిస్టా బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి.
నవీకరించబడిన ఇన్నోవా క్రిస్టాను టయోటా కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది, ఈ MPV బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఇప్పటికీ అధికారికంగా విడుదల కాకపోయినా, ఈ MPV భారతదేశ వ్యాప్తంగా డీలర్ షిప్ؚల వద్ద చేరుకుంది, ఇప్పుడు దీని లోయర్-స్పెక్ వేరియెంట్‌ల ధరలను వెల్లడించారు.
ధరలు
కేవలం డీజిల్ వెర్షన్ ఇన్నోవా క్రిస్టా G మరియు GX వేరియెంట్‌ల ధరలను ఇక్కడ చూడండి:
వేరియెంట్‌లు |
ఇన్నోవా క్రిస్టా (డీజిల్ MT) |
ఇన్నోవా హైక్రాస్ (పెట్రోల్ CVT) |
తేడా |
ధర (ఎక్స్-షోరూమ్) |
ధర (ఎక్స్-షోరూమ్) |
||
G 7S |
రూ. 19.13 లక్షలు |
రూ. 18.55 లక్షలు |
+రూ. 58,000 |
G 8S |
రూ. 19.18 లక్షలు |
రూ. 18.60 లక్షలు |
+రూ. 58,000 |
GX 7S |
రూ. 19.99 లక్షలు |
రూ. 19.40 లక్షలు |
+రూ. 59,000 |
GX 8S |
రూ. 19.99 లక్షలు |
రూ. 19.45 లక్షలు |
+రూ. 54,000 |
ఇన్నోవా క్రిస్టా బేస్-స్పెక్ G వేరియెంట్ ధర బేస్-స్పెక్ ఇన్నోవా హైక్రాస్‌తో పోలిస్తే రూ.58,000 ఎక్కువగా ఉంది. ఇన్నోవా క్రిస్టా GX వేరియెంట్‌లు సంబంధిత హైక్రాస్ పెట్రోల్ వేరియెంట్‌లతో పోలిస్తే రూ.59,000 వరకు అధిక ధరను కలిగి ఉన్నాయి.
ఇది కూడా చదవండి: కొత్త హైబ్రిడ్ వేరియెంట్ రాకతో ధర పెరిగిన టయోటా ఇన్నోవా హైక్రాస్
2-లీటర్ నాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚతో ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚను కలిగి ఉండే హైక్రాస్ చవకైన వేరియెంట్‌లతో పోలిస్తే క్రిస్టా కేవలం మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో మాత్రమే వస్తుంది అని గమనించాలి.
పవర్ؚట్రెయిన్
స్పెసిఫికేషన్ؚలు |
|
ఇంజన్ |
2.4-లీటర్ డీజిల్ ఇంజన్ |
ట్రాన్స్ؚమిషన్ |
ఐదు-స్పీడ్ల మాన్యువల్ |
పవర్ |
150PS |
టార్క్ |
343Nm |
నవీకరించబడిన క్రిస్టా కేవలం డీజిల్-మాన్యువల్ పవర్ ట్రెయిన్‌తో మాత్రమే వస్తుంది. ఇది 2.4-లీటర్ డీజిల్ యూనిట్‌ను నిలుపుకుంది, BS6 ఫేజ్ 2 మరియు RDE ఉద్గార నిబంధనలను అందుకునేందుకు నవీకరించబడింది, అంతేకాకుండా E20కి కూడా అనుగుణంగా ఉంటుంది. ఇందులో ఆటోమ్యాటిక్ ఎంపిక ఉండదు, కానీ రేర్-వీల్-డ్రైవ్ సెట్అప్‌తో వస్తుంది.
ఫీచర్‌లు
నవీకరించబడిన ఇన్నోవా క్రిస్టాను, ముందు భాగంలో తెలికపాటి నవీకరణను పొందిన గ్రిల్ؚతో గుర్తించవచ్చు. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, ఆరు-స్పీకర్‌ల సౌండ్ సిస్టమ్, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిట్-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సెట్ వంటి మునపటి ఫీచర్‌లనే కలిగి ఉంది. ప్రయాణీకుల భద్రత విషయానికి వస్తే, నవీకరించబడిన క్రిస్టా ఏడు ఎయిర్ బ్యాగ్ؚలను, EBDతో ABS, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), రేర్ؚవ్యూ కెమెరా, ప్రయాణీకులు అందరికి మూడు-పాయింట్‌ల సీట్ బెల్ట్ؚలు వంటి ఫీచర్‌లు ఉన్నాయి. ఈ లోయర్-స్పెక్ G మరియు GX వేరియెంట్‌లు హాలోజెన్ హెడ్ ల్యాంప్ؚలు, కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ AC, మూడు ఎయిర్ బ్యాగ్ؚలు, హిల్ స్టార్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్ؚతో వస్తాయి.
పోటీదారులు
అత్యధిక ప్రారంభ ధరలు ఉన్నప్పటికీ, మిగిలిన వేరియెంట్‌ల ధరలు వెల్లడైన తర్వాత ఈ MPV ఇన్నోవా హైక్రాస్ కంటే క్రింది స్థానంలో ఉండవచ్చు. ఇన్నోవా క్రిస్టాను కియా క్యారెన్స్, మహీంద్రా మరాజ్జోలకు ఖరీదైన ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు.
0 out of 0 found this helpful