కొత్త హైబ్రిడ్ వేరియెంట్ రాకతో పెరిగిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర
టయోటా ఇన్నోవా హైక్రాస్ కోసం tarun ద్వారా మార్చి 03, 2023 05:23 pm ప్రచురించబడింది
- 51 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
పరిచయ ధరలకు ముగింపు పలుకుతు, ఈ MPV ధరలు గణనీయంగా రూ 75,000 వరకు పెరిగాయి.
-
పెట్రోల్ వేరియెంట్‌ల ధర రూ.25,000; హైబ్రిడ్ వేరియెంట్‌ల ధర రూ.75,000 పెరిగాయి.
-
కొత్త స్ట్రాంగ్-హైబ్రిడ్ VX (O) వేరియెంట్ ధర రూ.24.81 లక్షలుగా ఉంది; ఇది VX వేరియెంట్ ధరతో పోలిస్తే సుమారు రూ.2 లక్షలు ఎక్కువ.
-
VX (O) వేరియెంట్ؚలో LED హెడ్ؚల్యాంపులు, 10.1-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు, 360-డిగ్రీల కెమెరా ఉన్నాయి.
-
స్ట్రాంగ్-హైబ్రిడ్ ఎంపికతో 2-లీటర్ పెట్రోల్ ఇంజన్ నుంచి ఈ MPV శక్తిని పొందుతుంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ పరిచయ ధరలు ముగిశాయి. ఈ MPV ధరలు రూ. 75,000 వరకు పెరిగాయి. దీనితో పాటు, కొత్త మిడ్-స్పెక్ హైబ్రిడ్ వేరియెంట్ؚను కూడా పరిచయం చేశారు.
కొత్త ఇన్నోవా హైక్రాస్ ధరలు
వేరియెంట్ؚలు |
పాత ధర |
కొత్త ధర |
తేడా |
G 7S |
రూ. 18.30 లక్షలు |
రూ. 18.55 లక్షలు |
రూ. 25,000 |
G 8S |
రూ. 18.35 లక్షలు |
రూ. 18.60 లక్షలు |
రూ. 25,000 |
GX 7S |
రూ. 19.15 లక్షలు |
రూ. 19.40 లక్షలు |
రూ. 25,000 |
GX 8S |
రూ. 19.20 లక్షలు |
రూ. 19.45 లక్షలు |
రూ. 25,000 |
VX హైబ్రిడ్ 7S |
రూ. 24.01 లక్షలు |
రూ. 24.76 లక్షలు |
రూ. 75,000 |
VX హైబ్రిడ్ 8S |
రూ. 24.06 లక్షలు |
రూ. 24.81 లక్షలు |
రూ. 75,000 |
VX (O) హైబ్రిడ్ 7S (కొత్తది) |
- |
రూ. 26.73 లక్షలు |
- |
VX (O) హైబ్రిడ్ 8S (కొత్తది) |
- |
రూ. 26.78 లక్షలు |
- |
ZX హైబ్రిడ్ |
రూ. 28.33 లక్షలు |
రూ. 29.08 లక్షలు |
రూ. 75,000 |
ZX (O) హైబ్రిడ్ |
రూ. 28.97 లక్షలు |
రూ. 29.72 లక్షలు |
రూ. 75,000 |
ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ వేరియెంట్ؚల ధరలు రూ.25,000 పెరగ్గా, హైబ్రిడ్ వేరియెంట్ؚల ధర రూ.75,000 పెరిగింది. బేస్ వేరియెంట్ ఇప్పటికీ ఫ్లీట్ యజమానులకు మాత్రమే అందిస్తారు, కాబట్టి సాంకేతికంగా, మీరు ఎంచుకోగలిగింది ఏకైక పెట్రోల్ వేరియెంట్ GX మాత్రమే. ఇప్పుడు హైక్రాస్ ధర రూ.18.55 లక్షల నుండి 29.72 లక్షల వరకు ఉంటుంది.
కొత్త హైబ్రిడ్ వేరియెంట్
టయోటా తన లైన్అప్ؚలో కొత్త VX (O) వేరియెంట్ؚను పరిచయం చేసింది, దీని ధర రూ. 26.73 లక్షల నుంచి 26.78 లక్షల మధ్య ఉంటుంది. ఈ కొత్త వేరియెంట్ VX, ZX వేరియెంట్‌ల మధ్య ఉండే రూ.4 లక్షల ధర వ్యత్యాసాన్ని తగ్గిస్తుంది! ఈ వేరియెంట్ ధర VX కంటే రూ.2 లక్షలు ఎక్కువ, కానీ ZX వేరియెంట్ కంటే రూ.2.5 లక్షలు తక్కువగా ఉంది.
ఇది కూడా చదవండి: CD మాటలలో: మారుతి MPV కోసం రూ.30 లక్షలు ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉండండి
VX (O) వేరియెంట్ؚలో LED హెడ్ؚల్యాంప్ؚలు, ఆటోమ్యాటిక్ AC, రెండు మరియు మూడవ వరుసలో మడవగలిగే సీట్‌లు, 10.1-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, ప్యాడిల్ షిఫ్టర్ؚలు, క్రూజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు, హిల్ స్టార్ట్ అసిస్ట్, 360-డిగ్రీల కెమెరా, ముందు/వెనుక పార్కింగ్ సెన్సర్‌లు ఉంటాయి.
అధిక-స్పెసిఫికేషన్ వేరియెంట్ؚలలో అందించే డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ADAS (అడ్వాన్సెడ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్ؚలు), వెంటిలేటెడ్ ముందరి సీట్‌లు, పొడిగించిన లెగ్ రెస్ట్ؚతో పవర్డ్ రెండవ-వరుస ఒట్టోమాన్ సీట్‌లు ఇందులో ఉండవు.
ఇన్నోవా హైక్రాస్ పవర్ؚట్రెయిన్‌లు
హైక్రాస్ؚ 174PS పవర్ కలిగిన 2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో అందిస్తున్నారు. దీన్ని స్ట్రాంగ్-హైబ్రిడ్ సెట్అప్ؚతో కూడా ఎంచుకోవచ్చు, ఇది 21.1kmpl ఇంధన సమర్ధతను అందిస్తుంది (క్లెయిమ్ చేయబడింది). పెట్రోల్ ఎంపికలో CVT ఉంటుంది, స్ట్రాంగ్-హైబ్రిడ్ e-CVT (ఒకే-స్పీడ్ ట్రాన్స్ؚమిషన్)తో వస్తుంది.
ఇది కూడా చదవండి: టయోటా ఇన్నోవా హైక్రాస్ Vs మిడ్ సైజ్ SUVల: ధరల చర్చ
ఖరీదైన విభాగంలో ప్రత్యక్ష పోటీదారులు లేని కియా కేరెన్స్ వంటి వాహనాలకు టయోటా MPV ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. అయితే, MPVలో డీజిల్ ఇంజన్ కొనుగోలు చేయాలనుకుంటే, పాత ఇన్నోవా క్రిస్టాతో పొందవచ్చు, అది త్వరలోనే మార్కెట్ؚలోకి తిరిగి రానుంది మరియు బుకింగ్ؚలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
(అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు)
ఇక్కడ మరింత చదవండి: ఇన్నోవా హైక్రాస్ ఆటోమ్యాటిక్
0 out of 0 found this helpful