టాటా టిగోర్ ఫేస్‌లిఫ్ట్ రూ .5.75 లక్షల వద్ద ప్రారంభమైంది
టాటా టిగోర్ కోసం rohit ద్వారా జనవరి 25, 2020 12:29 pm ప్రచురించబడింది
- 40 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ మిడ్-లైఫ్ అప్‌డేట్‌తో, సబ్ -4m సెడాన్ తన 1.05-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కోల్పోతుంది
- ఇది ఆల్ట్రోజ్ లాంటి ఫ్రంట్ గ్రిల్‌ను పొందుతుంది.
- టిగోర్ ఫేస్‌లిఫ్ట్ BS 6-కంప్లైంట్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది.
- ట్రాన్స్మిషన్ ఎంపికలు మునుపటిలాగే అదే (5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT)గా ఉండబోతున్నాయి.
- ఇది గ్లోబల్ NCAP క్రాష్ పరీక్షల్లో 4-స్టార్ రేటింగ్ ని దక్కించుకుంది.
- ఇది ఇప్పుడు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ ని పొందుతుంది.
- దీని ధర రూ .5.75 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభం అవుతుంది.
టాటా మోటార్స్ టిగోర్ ఫేస్‌లిఫ్ట్‌ను తన BS 6 అవతార్ లో విడుదల చేసింది, దీని ద్వారా ఈ సబ్ -4m సెడాన్ ను ఏప్రిల్ 1, 2020 తరువాత అమ్మకాలలోనికి తీసుకొని రానున్నారు. ఇది ఆరు వేరియంట్లలో వస్తుంది: XE, XM, XZ, XMA, XZ+ మరియు XZA+. ఈ అప్‌డేట్ ద్వారా ఏమిటి మార్చబడిందో ఇక్కడ ఉంది:
వేరియంట్ |
పెట్రోల్ |
XE |
రూ. 5.75 లక్షలు |
XM |
రూ. 6.10 లక్షలు |
XZ |
రూ. 6.50 లక్షలు |
XZ+ |
రూ. 6.99 లక్షలు |
XMA |
రూ. 6.60 లక్షలు |
XZA+ |
రూ. 7.49 లక్షలు |
టైగర్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు BS 6-కంప్లైంట్ 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే అందించబడుతుంది, ఇది 86Ps పవర్ మరియు 113Nm టార్క్ ని అందిస్తుంది. BS4 వెర్షన్‌తో పోలిస్తే పవర్ అవుట్పుట్ 1Ps పెరిగినప్పటికీ, టార్క్ 1Nm తగ్గింది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT అదే ట్రాన్స్మిషన్ ఎంపికలతో లభిస్తుంది.
డిజైన్ పరంగా, ఫేస్‌లిఫ్టెడ్ టిగోర్ కు ఆల్ట్రోజ్ లాంటి ఫ్రంట్ గ్రిల్ తో పాటు సరికొత్త హెడ్‌ల్యాంప్స్ మరియు ఫ్రంట్ బంపర్ లభిస్తుంది. ఇది సరికొత్తగా డిజైన్ చేసిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లో LED DRL లను పొందుతుంది. ఇంకా ఏమిటంటే, ఈ సబ్ -4m సెడాన్ టీజర్ లో వెల్లడైన బుర్గుండి షేడ్ తో సహా ఐదు కొత్త రంగు ఎంపికలలో ఇప్పుడు అందించబడింది. టాటా సెడాన్ యొక్క కొలతలు కూడా సవరించింది. మొత్తంగా చూసుకుంటే గనుక దాని పొడవు 1mm తగ్గింది, దాని అవుట్గోయింగ్ వెర్షన్ తో పోలిస్తే ఇది 5mm తక్కువగా ఉంటుంది. అలాగే మూడు టైర్ ఆప్షన్లు పొందిన ప్రీ-ఫేస్ లిఫ్ట్ వెర్షన్ వలె కాకుండా, రిఫ్రెష్ చేసిన టిగోర్ 14- మరియు 15-ఇంచ్ వీల్స్ తో మాత్రమే అందించబడుతుంది.
లక్షణాల విషయానికి వస్తే, టిగోర్ ఫేస్ లిఫ్ట్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో 7-ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హర్మాన్ నుండి 8-స్పీకర్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు వెనుక పార్కింగ్ కెమెరా తో అందించబడుతోంది. అదనంగా, టాటా ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ తో ఫేస్‌లిఫ్టెడ్ టిగోర్ ను అందిస్తోంది. ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, EBD తో ABS, మరియు రియర్ పార్కింగ్ సెన్సార్‌లతో సహా అవే ప్రామాణిక భద్రతా లక్షణాలతో అందించబడుతుంది.
టాటా టిగోర్ ఫేస్ లిఫ్ట్ ధర రూ .5.75 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభం అవుతుంది. ఇది మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్, ఫోర్డ్ ఆస్పైర్, వోక్స్వ్యాగన్ అమియో మరియు కొత్తగా ప్రారంభించిన హ్యుందాయ్ ఆరాకు ప్రత్యర్ధిగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఫేస్‌లిఫ్టెడ్ సెడాన్ గ్లోబల్ NCAP క్రాష్ పరీక్షలలో 4-స్టార్ రేటింగ్ ని దక్కించుకుంది.
మరింత చదవండి: టిగోర్ ఆన్ రోడ్ ప్రైజ్
0 out of 0 found this helpful