Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

Tata Punch CNG: రూ. 7.10 లక్షల ధరతో విడుదలైన టాటా పంచ్ CNG

టాటా పంచ్ కోసం rohit ద్వారా ఆగష్టు 04, 2023 02:43 pm సవరించబడింది

టాటా పంచ్ యొక్క CNG వేరియంట్ల ధరలు, వాటి సాధారణ పెట్రోల్ వేరియంట్ల కంటే రూ. 1.61 లక్షల వరకు ప్రీమియం కలిగి ఉంటాయి.

  • కారు తయారీ సంస్థ, టాటా టియాగో మరియు టాటా టిగోర్ యొక్క CNG పవర్‌ట్రెయిన్‌లను కూడా అప్‌డేట్ చేసింది.
  • టియాగో, టియాగో ఎన్‌ఆర్‌జి మరియు టిగోర్ యొక్క సిఎన్‌జి వేరియంట్‌ల ధర రూ. 5,000 వరకు పెరిగింది.
  • పంచ్ CNG, ఆల్ట్రోజ్ CNG యొక్క 73.5PS/103Nm పవర్ ను విడుదల చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ను పొందుతుంది.
  • టాటా సంస్థ, టియాగో మరియు టిగోర్ CNG లకు 73.5PS/95Nm పవర్ ను విడుదల చేసే 1.2-లీటర్ పెట్రోల్ పవర్‌ట్రైన్‌ను అందించింది.
  • పంచ్ CNG, వాయిస్-ఎనేబుల్ సన్‌రూఫ్, రెండు ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్‌లు మరియు USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటి కొత్త ఫీచర్‌లను పొందుతుంది.

కారు తయారీ సంస్థ యొక్క ట్విన్-సిలిండర్ టెక్నాలజీని ప్రారంభించిన టాటా ఆల్ట్రోజ్ CNG పరిచయం తర్వాత, టాటా ఇప్పుడు అదే ఫార్ములాను టాటా పంచ్‌కు వర్తింపజేసింది. అంతేకాకుండా ఇదే ఫార్ములాను, టాటా టియాగో మరియు టాటా టిగోర్ సిఎన్‌జి మోడళ్లకు కూడా అదే నవీకరణను అందించింది. టాటా CNG మోడల్‌ల యొక్క కొత్త అలాగే నవీకరించబడిన శ్రేణి మొత్తం ధర జాబితా ఇక్కడ ఉంది:

పంచ్

పంచ్

వేరియంట్ ధర

ప్యూర్ CNG

రూ. 7.10 లక్షలు

అడ్వెంచర్ CNG

రూ. 7.85 లక్షలు

అడ్వెంచర్ రిథమ్ CNG

రూ. 8.20 లక్షలు

ఎకంప్లిష్డ్ CNG

రూ. 8.85 లక్షలు

ఎకంప్లిష్డ్ డాజిల్ S CNG

రూ. 9.68 లక్షలు

  • పంచ్ యొక్క CNG శ్రేణి, సాధారణ పెట్రోల్ వేరియంట్‌ల కంటే లక్ష వరకు ప్రీమియం ధరను కలిగి ఉంటుంది.

టియాగో

వేరియంట్

పాత ధర

కొత్త ధర

వ్యత్యాసం

XE CNG

రూ.6.50 లక్షలు

రూ.6.55 లక్షలు

+రూ. 5,000

XM CNG

రూ.6.85 లక్షలు

రూ.6.90 లక్షలు

+రూ. 5,000

XT CNG

రూ.7.30 లక్షలు

రూ.7.35 లక్షలు

+రూ. 5,000

XZ+ CNG

రూ.8.05 లక్షలు

రూ.8.10 లక్షలు

+రూ. 5,000

XZ+ DT CNG

రూ.8.15 లక్షలు

రూ.8.20 లక్షలు

+రూ. 5,000

XT NRG CNG

రూ.7.60 లక్షలు

రూ.7.65 లక్షలు

+రూ. 5,000

XZ NRG CNG

రూ.8.05 లక్షలు

రూ.8.10 లక్షలు

+రూ. 5,000

  • ట్విన్-సిలిండర్ టెక్నాలజీ నవీకరణతో, టియాగో సిఎన్‌జి ధరలు ఏకరీతిగా రూ. 5,000 పెంచబడ్డాయి.
  • అదే ధర పెంపు టియాగో NRG CNG యొక్క CNG వేరియంట్‌లకు కూడా వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి: 2022 టాటా సిఎన్జి iCNG: మొదటి డ్రైవ్ సమీక్ష

టిగోర్

వేరియంట్

పాత ధర

కొత్త ధర

వ్యత్యాసము

XM CNG

రూ.7.75 లక్షలు

రూ.7.80 లక్షలు

+రూ. 5,000

XZ CNG

రూ.8.15 లక్షలు

రూ.8.20 లక్షలు

+రూ. 5,000

XZ+ CNG

రూ.8.80 లక్షలు

రూ.8.85 లక్షలు

+రూ. 5,000

XZ+ లెథెరెట్ ప్యాక్ CNG

రూ.8.90 లక్షలు

రూ.8.95 లక్షలు

+రూ. 5,000

  • టిగోర్ సిఎన్‌జి ఇప్పుడు ఏకరీతిగా రూ. 5,000 ధర పెరిగింది.

పవర్‌ట్రెయిన్ వివరాలు

పంచ్ CNG, దాని పవర్‌ట్రెయిన్‌ను ఆల్ట్రోజ్ CNG 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్తో పంచుకుంటుంది. ఈ యూనిట్ (73.5PS/103Nm), 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. పెట్రోల్ మోడ్‌లో, ఇది టియాగో-టిగోర్ ద్వయంలో 86PS మరియు 113Nm పవర్ టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది, అయితే పంచ్ మరియు ఆల్ట్రోజ్‌లు 88PS/115Nm ఉత్పత్తి చేస్తాయి. టియాగో మరియు టిగోర్ CNG మోడ్‌లో 73.5PS/95Nmని అందిస్తాయి. మూడు CNG కార్లు 5-స్పీడ్ MT మాత్రమే జత చేయబడ్డాయి.

ఫీచర్ల గురించి ఏమిటి?

పంచ్ CNG, వాయిస్-ఎనేబుల్డ్ సింగిల్-పేన్ సన్‌రూఫ్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ మరియు ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్‌ల వంటి కొన్ని కీలక నవీకరణలను పొందుతుంది. ఇవి కాకుండా, ఇది 7-అంగుళాల టచ్‌స్క్రీన్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, క్రూయిజ్ కంట్రోల్ మరియు రివర్సింగ్ కెమెరాతో కూడిన మైక్రో SUV యొక్క ప్రస్తుత పరికరాల జాబితాను కూడా కలిగి ఉంటుంది.

టియాగో మరియు టిగోర్ CNG మోడల్‌లు వాటి పరికరాల జాబితా ఎలాంటి ప్రతికూలతలను కలిగి లేదు. అవి 7-అంగుళాల టచ్‌స్క్రీన్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు కీలెస్ ఎంట్రీ వంటి అంశాలతో వస్తుంది. భద్రతా కిట్‌ విషయానికి వస్తే, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS మరియు రివర్సింగ్ కెమెరా ఉన్నాయి.

పోటీదారులు

టాటా టియాగో CNG యొక్క ప్రత్యక్ష ప్రత్యర్థులు- మారుతి సెలెరియో మరియు వ్యాగన్ R CNG, అయితే టిగోర్ CNG విషయానికి వస్తే, మారుతి డిజైర్ మరియు హ్యుందాయ్ ఆరా CNG లు పోటీదారులు. మరోవైపు, పంచ్ CNG యొక్క ఏకైక పోటీదారు ఇటీవల ప్రవేశపెట్టిన హ్యుందాయ్ ఎక్స్టర్ CNG.

మరింత చదవండి : టాటా పంచ్ AMT

Share via

explore similar కార్లు

టాటా టియాగో

పెట్రోల్20.09 kmpl
సిఎన్జి26.49 Km/Kg
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్

టాటా పంచ్

పెట్రోల్20.09 kmpl
సిఎన్జి26.99 Km/Kg
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర