Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

భారతదేశంలో విడుదలైనప్పటి నుండి 4 లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Tata Punch

టాటా పంచ్ కోసం shreyash ద్వారా ఆగష్టు 05, 2024 08:47 pm ప్రచురించబడింది

టాటా పంచ్ స్థిరంగా అత్యంత డిమాండ్ ఉన్న ఆఫర్లలో ఒకటిగా ఉంది, ఇది ఎలక్ట్రిక్ వాహనాల ఎంపికను కూడా కలిగి ఉన్న పవర్‌ట్రైన్‌ల శ్రేణి కారణంగా అయ్యి ఉండవచ్చు.

టాటా పంచ్ మైక్రో 2021 లో విడుదల అయ్యింది, దాని మైక్రో SUV సెగ్మెంట్‌ ప్రారంభం అయ్యాక ఏంతో త్వరగా ప్రజాదరణ పొందింది. ఇటీవలి నెలల్లో, ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు ఈ మైక్రో SUV కారు 4 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును దాటింది. భారతదేశంలో ఎప్పుడు, ఎన్ని యూనిట్లు అమ్ముడయ్యాయో ఇక్కడ చూడండి:

ఏడాది

అమ్మకాలు

అక్టోబర్ 2021

విడుదల

ఆగస్టు 2022

1 లక్ష

మే 2023

2 లక్షలు

డిసెంబర్ 2023

3 లక్షలు

జూలై 2024

4 లక్షలు

టాటా పంచ్ మొదటి 10 నెలల్లో లక్ష యూనిట్ల అమ్మకాలను సాధించగా, రెండు లక్షల అమ్మకాలను చేరుకోవడానికి మరో 9 నెలలు పట్టింది. అయితే, మే 2023 తర్వాత, డిసెంబర్ 2023 వరకు కేవలం 7 నెలల్లోనే తదుపరి లక్ష యూనిట్లు విక్రయించబడ్డాయి. ఆ తర్వాత దాని మొత్తం విక్రయాలు 3 లక్షల యూనిట్లకు చేరాయి. చివరి లక్ష యూనిట్ల విక్రయాలను సాధించడానికి కేవలం 7 నెలలు పట్టింది.

టాటా పంచ్ గురించి మరింత సమాచారం

టాటా పంచ్ యొక్క ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) వెర్షన్ పెట్రోల్ మరియు CNG పవర్‌ట్రైన్ ఎంపికలతో వస్తుంది, దీని స్పెసిఫికేషన్‌లు క్రింది విధంగా ఉన్నాయి:

ఇంజన్

1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్

1.2-లీటర్ పెట్రోల్-CNG

పవర్

86 PS

73.5 PS

టార్క్

113 Nm

103 Nm

ట్రాన్స్మిషన్

5-స్పీడ్ MT, 5-స్పీడ్ AMT

5-స్పీడ్ MT

టాటా పంచ్ యొక్క ఫీచర్ల విషయానికొస్తే ఇందులో, 7-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 7-అంగుళాల సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ AC, సింగిల్ పేన్ సన్‌రూఫ్ మరియు కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా, టాటా పంచ్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBD తో ABS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు రేర్ పార్కింగ్ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు అందించబడ్డాయి.

2024 ప్రారంభంలో విడుదల అయిన ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్లో కూడా పంచ్ అందించబడుతుంది. దీని బ్యాటరీ ప్యాక్ మరియు మోటార్ స్పెసిఫికేషన్‌లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

వేరియంట్

మీడియం రేంజ్

లాంగ్ రేంజ్

బ్యాటరీ ప్యాక్

25 కిలోవాట్

35 కిలోవాట్

పవర్

82 PS

122 PS

టార్క్

114 Nm

190 Nm

క్లెయిమ్డ్ రేంజ్ (MIDC)

315 కి.మీ

421 కి.మీ

పెద్ద 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న ICE పవర్డ్ వెర్షన్ కంటే టాటా పంచ్ EV కొన్ని ప్రీమియం ఫీచర్లతో లభిస్తుంది. ప్రయాణీకుల భద్రత పరంగా ఇందులో, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), మరియు 360 డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు అందించబడ్డాయి.

ఇది కూడా చూడండి: టాటా పంచ్ EV లాంగ్ రేంజ్: మూడు డ్రైవ్ మోడ్స్‌లో రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్ టెస్ట్

ధర శ్రేణి ప్రత్యర్థులు

టాటా పంచ్ ICE

టాటా పంచ్ EV

రూ. 6.13 లక్షల నుంచి రూ. 10.20 లక్షలు

రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షలు

అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ

పంచ్ ICE వెర్షన్ హ్యుందాయ్ ఎక్స్‌టర్‌తో పోటీపడుతుంది, అంతే కాక దీనిని మారుతి ఫ్రాంక్స్ మరియు టయోటా టైసర్ సబ్-4m క్రాస్‌ఓవర్‌లకు ప్రత్యామ్నాయంగా కూడా ఎంచుకోవచ్చు. టాటా పంచ్ EV సిట్రోయెన్ EC3 తో పోటీ పడుతుండగా, టాటా టియాగో EV మరియు MG కామెట్ EV కంటే ఎక్కువ ప్రీమియం ఎలక్ట్రిక్ కారుగా కూడా దీనిని ఎంచుకోవచ్చు.

మరిన్ని ఆటోమోటివ్ అప్‌డేట్‌ల కోసం కార్దెకో యొక్క వాట్సప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.

మరింత చదవండి: పంచ్ AMT

s
ద్వారా ప్రచురించబడినది

shreyash

  • 181 సమీక్షలు
  • 0 Comments

Write your Comment on Tata పంచ్

Read Full News

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర