Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

10 చిత్రాలలో Tata Nexon Facelift ప్యూర్ వేరియంట్ వివరణ

టాటా నెక్సన్ కోసం ansh ద్వారా సెప్టెంబర్ 21, 2023 04:19 pm ప్రచురించబడింది

మిడ్-స్పెక్ ప్యూర్ వేరియెంట్ ధర రూ.9.70 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభం అవుతుంది మరియు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఎంపికలతో వస్తుంది

టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ రూ.8.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల అయ్యింది మరియు స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ మరియు ఫియర్ؚలెస్ అనే నాలుగు విస్తృత వేరియెంట్ؚలలో లభిస్తుంది. బేస్-స్పెక్ స్మార్ట్ వేరియెంట్ؚను ఇప్పటికే చిత్రాలలో వివరించాము, మిడ్-స్పెక్ ప్యూర్ వేరియెంట్ؚను కొనుగోలు చేయాలనుకుంటే, దాని వివరణాత్మక గ్యాలరీని ఇక్కడ చూడవచ్చు.

ఎక్స్ؚటీరియర్

ఫ్రంట్

ముందు వైపు, ప్యూర్ వేరియెంట్ టాప్-స్పెక్ నెక్సాన్ వేరియెంట్ؚ విధంగానే కనిపిస్తుంది. అదే గ్రిల్, LED హెడ్ؚల్యాంప్ డిజైన్ మరియు DRL సెట్అప్ؚలను పొందుతుంది.

అయితే బంపర్ పై ఉండే నాజూకైన స్కిడ్ ప్లేట్, బై-ఫంక్షనల్ హెడ్ؚల్యాంపులు మరియు సీక్వెన్షియల్ LED DRLలు మాత్రం లేవు.

సైడ్

ప్రొఫైల్ؚలో, వీల్ ఆర్చ్ؚలు మరియు డోర్ؚలపై వైడ్ క్లాడింగ్ؚను, ORVM అమర్చిన ఇండికేటర్ؚలు మరియు రూఫ్ రెయిల్ؚలను పొందుతారు, అయితే బాడీ రంగు డోర్ హ్యాండిల్ؚలు ఉండవు.

ఇది కూడా చూడండి: సారి కొత్త నెక్సాన్ వంటి ఫేసియాతో మళ్ళీ కెమెరాకు చిక్కిన 2024 టాటా హ్యారియర్ ఫేస్ؚలిఫ్ట్

అలాగే, ప్యూర్ వేరియెంట్‌లోؚ అలాయ్ వీల్స్ అందుబాటులో లేవు, బదులుగా స్టైల్‌గా ఉన్న వీల్ కవర్‌లు కలిగిన స్టీల్ వీల్స్ ఉంటాయి.

వెనుక భాగం

ముందు భాగం విధంగానే, నెక్సాన్ ప్యూర్ వేరియెంట్ వెనుక ప్రొఫైల్, టాప్-స్పెక్ వేరియెంట్ؚ విధంగానే కనిపిస్తుంది. అవే LED టెయిల్ ల్యాంప్ؚలను మరియు అదే బంపర్ డిజైన్ؚ కలిగి ఉంటుంది. కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ ఎలిమెంట్ؚలు, బంపర్ పై స్కిడ్ ప్లేట్ ఉండవు.

ఇంటీరియర్

డ్యాష్ؚబోర్డ్

లోపలి వైపు, చెప్పాలంటే డ్యాష్ؚబోర్డ్ డిజైన్ అన్ని వేరియెంట్ؚలలో ఒకేలా ఉంటుంది. ప్యూర్ వేరియెంట్ؚలో లేయర్డ్ డ్యాష్ؚబోర్డ్ ఉంటుంది, ఇది 7-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు చిన్నదైన డిజిటలైజ్ చేసిన ఇన్ؚస్ట్రుమెంట్ క్లస్టర్ؚను కలిగి ఉంటుంది.

బ్యాక్ؚలిట్ టాటా లోగోను కలిగిన కొత్త 2-స్పోక్ؚల స్టీరింగ్ వీల్ؚను కూడా పొందుతుంది.

ముందు సీట్ؚలు

ముందు సీట్‌ల డిజైన్ అన్ని వేరియెంట్ؚలలో ఒకేలా ఉంటుంది అయితే, ప్యూర్ వేరియెంట్‌లో లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీని పొందరు. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ మరియు సెంటర్ కన్సోల్ؚలో డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: కియా సోనెట్ؚతో పోలిస్తే 7 ఫీచర్‌లను ఎక్కువగా పొందిన టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్

అలాగే, ప్యూర్ S వేరియెంట్ؚలో సింగిల్-పేన్ సన్ؚరూఫ్ؚ ఎంపికను కూడా పొందవచ్చు.

వెనుక సీట్ؚలు

ఇక్కడ కూడా, సీట్ల డిజైన్ మిగిలిన వేరియెంట్ؚలలో ఉన్నట్లే ఉంటుంది, అయితే ఫ్యాబ్రిక్ అప్ؚహోల్ؚస్ట్రీని కలిగి ఉంటుంది. వెనుక వైపు, కప్ హోల్డర్ؚలతో సెంటర్ ఆర్మ్ؚరెస్ట్ మరియు మధ్య ప్యాసెంజర్ హెడ్ؚరెస్ట్ లేవు, వెనుక AC వెంట్ؚలు మాత్రం ఉన్నాయి.

ధర పోటీదారులు

కొత్త నెక్సాన్ ధర రూ.8.10 లక్షల నుండి రూ.15.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది, ప్యూర్ వేరియంట్ ధర రూ.9.70 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది. కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా మరియు మహీంద్రా XUV300 వంటి వాటితో తన పోటీని కొనసాగిస్తుంది.

ఇక్కడ మరింత చదవండి: నెక్సాన్ AMT

a
ద్వారా ప్రచురించబడినది

ansh

  • 73 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన టాటా నెక్సన్

G
gyaneshwar mishra
Sep 20, 2023, 8:38:44 PM

Nexon is a very nice car,along with mileage and engineering wise too.

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.13.99 - 26.99 లక్షలు*
Rs.6 - 11.27 లక్షలు*
ఫేస్లిఫ్ట్
Rs.86.92 - 97.84 లక్షలు*
Rs.68.50 - 87.70 లక్షలు*
ఫేస్లిఫ్ట్
Rs.1.36 - 2 సి ఆర్*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర