• English
    • Login / Register

    రూ. 8.10 లక్షల ధర నుండి ప్రారంభమైన Tata Nexon Facelift

    సెప్టెంబర్ 18, 2023 02:57 pm ansh ద్వారా సవరించబడింది

    40 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    నవీకరించబడిన నెక్సాన్ నాలుగు వేర్వేరు వేరియంట్‌లలో అందించబడింది: అవి వరుసగా స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ మరియు ఫియర్‌లెస్

    Tata Nexon Facelift Launched

    టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఎట్టకేలకు రూ. 8.10 లక్షల (పరిచయ, ఎక్స్-షోరూమ్) ధరలతో ప్రారంభించబడింది. నెక్సాన్ డిజైన్, ఫీచర్లు మరియు భద్రత పరంగా ప్రధాన నవీకరణలను పొందుతుంది, అయినప్పటికీ, ఇది ఇప్పటికీ అదే ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంది. దీని ధర ఎలా ఉంది మరియు అది ఏమేమి అందిస్తుందో ఇక్కడ ఉంది:

    ధర

    టాటా నెక్సాన్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్

     

    MT

    AMT

    DCA

    స్మార్ట్ (5MT)

    రూ.8.10 లక్షలు

    N.A.

    N.A.

    స్మార్ట్ + (5MT)

    రూ.9.10 లక్షలు

    N.A

    N.A

    స్మార్ట్ + S (5MT)

    రూ.9.70 లక్షలు

    N.A

    N.A

    ప్యూర్

    రూ.9.70 లక్షలు

    N.A

    N.A

    ప్యూర్ ఎస్

    రూ.10.20 లక్షలు

    N.A

    N.A

    క్రియేటివ్

    రూ.11 లక్షలు

    రూ.11.70 లక్షలు

    రూ.12.20 లక్షలు

    క్రియేటివ్ +

    రూ.11.70 లక్షలు

    రూ.12.40 లక్షలు

    రూ.12.90 లక్షలు

    క్రియేటివ్ + S

    రూ.12.20 లక్షలు

    రూ.12.90 లక్షలు

    రూ.13.40 లక్షలు

    ఫియర్లెస్/ ఫియర్లెస్ పర్పుల్

    రూ.12.50 లక్షలు

    N.A

    రూ.13.70 లక్షలు

    ఫియర్లెస్/ ఫియర్లెస్ పర్పుల్ S

    రూ.13 లక్షలు

    N.A

    రూ.14.20 లక్షలు

    ఫియర్లెస్ +/ ఫియర్లెస్ పర్పుల్ +

    రూ.13 లక్షలు

    N.A

    రూ.14.20 లక్షలు

    ఫియర్లెస్ +/ ఫియర్లెస్ పర్పుల్ + S

    రూ.13.50 లక్షలు

    N.A

    రూ.14.70 లక్షలు

     

    టాటా నెక్సాన్ 1.5-లీటర్ డీజిల్

    వేరియంట్/ట్రాన్స్మిషన్

    MT

    AMT

    ప్యూర్

    రూ.11 లక్షలు

    N.A.

    ప్యూర్ ఎస్

    రూ.11.5 లక్షలు

    N.A.

    క్రియేటివ్

    రూ.12.40 లక్షలు

    రూ.13 లక్షలు

    క్రియేటివ్ +

    రూ.13.10 లక్షలు

    రూ.13.80 లక్షలు

    క్రియేటివ్ + S

    రూ.13.60 లక్షలు

    రూ.14.30 లక్షలు

    ఫియర్లెస్/ ఫియర్లెస్ పర్పుల్

    రూ.13.90 లక్షలు

    రూ.14.60 లక్షలు

    ఫియర్లెస్/ ఫియర్లెస్ పర్పుల్ S

    రూ.14.40 లక్షలు

    రూ.15 లక్షలు

    ఫియర్లెస్ +/ ఫియర్లెస్ పర్పుల్ +

    రూ.14.40 లక్షలు

    రూ.15 లక్షలు

    ఫియర్లెస్ +/ ఫియర్లెస్ పర్పుల్ + S

    రూ.14.90 లక్షలు

    రూ.15.5 లక్షలు

    దిగువ శ్రేణి నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 8.10 లక్షల నుండి ప్రారంభమవుతుంది, ఇది దాని ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ప్రారంభ ధర కంటే కొంచెం ఎక్కువ. అయితే, ఈ ధరలు ప్రారంభమైనవి మరియు కొంత సమయం తర్వాత ఖచ్చితంగా పెరుగుతాయి. అలాగే, అన్ని ఆటోమేటిక్ మరియు డీజిల్ పవర్డ్ వేరియంట్‌ల ధరలను టాటా ఇంకా వెల్లడించలేదు.

    కొత్త డిజైన్

    2023 నెక్సాన్ ముందు మరియు వెనుక నుండి ప్రధానంగా నవీకరించబడింది. దీని ముందు భాగం పదునైన బోనెట్, సీక్వెన్షియల్ LED DRLలు మరియు సొగసైన బంపర్‌ లను కలిగి ఉంటుంది. ఇది హారియర్ EV కాన్సెప్ట్‌లో కనిపించే విధంగా నిలువుగా ఉంచబడిన LED హెడ్‌లైట్‌లను కూడా పొందుతుంది

    Tata Nexon Facelift FrontTata Nexon Facelift Rear & Side

    సైడ్ ప్రొఫైల్‌లో ఒక ప్రధాన మార్పు మాత్రమే ఉంది - అది ఏమిటంటే, కొత్త 16-అంగుళాల ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్. కానీ, వెనుక ప్రొఫైల్ కనెక్ట్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్‌తో కొత్త డిజైన్‌ను పొందుతుంది, మొత్తంగా పూర్తి డిజైన్ ఫ్లాట్ గా మరియు నవీకరించబడిన బంపర్ వంటి అంశాలు అందించబడ్డాయి.

    Tata Nexon Facelift Cabin

    లోపల భాగంలో, మార్పులు కూడా భారీగా ఉన్నాయి. AC వెంట్స్ వంటి సొగసైన అంశాలతో డాష్‌బోర్డ్ మరింత నిటారుగా ఉంటుంది. ఇది బ్యాక్‌లిట్ టాటా లోగోతో కొత్త 2-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను పొందుతుంది, అంతేకాకుండా దీనిలో పెద్ద సెంటర్ డిస్‌ప్లే మరియు సెంటర్ కన్సోల్‌లో తక్కువ ఫిజికల్ కంట్రోల్స్ ఉన్నాయి. టాటా ఎంపిక చేసిన రంగు ఎంపికలతో సరిపోయే కొత్త క్యాబిన్ థీమ్ రంగులను కూడా జోడించింది.

    మరిన్ని ఫీచర్లు!

    Tata Nexon Facelift Touchscreen

    టాటా నెక్సాన్ దాని ధర మరియు విభాగాన్ని పరిగణనలోకి తీసుకుంటే సంపూర్ణంగా అందించబడిందని చెప్పవచ్చు, కానీ టాటా ఇప్పుడు దాని ఫీచర్ జాబితాను మరింత నవీకరించి అందించింది. కొత్త ఫీచర్లలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పాడిల్ షిఫ్టర్లు మరియు టచ్-ఎనేబుల్డ్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ ఉన్నాయి. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు క్రూజ్ కంట్రోల్ వంటి అంశాలు మునుపటి నెక్సాన్ నుండి అలాగే ఉంచబడ్డాయి.

    ఇది కూడా చదవండి: ఫేస్లిఫ్టెడ్ టాటా నెక్సాన్లోని ప్రతి వేరియంట్  అంశాలను పొందుతుందో ఇక్కడ తెలుసుకోండి

    ప్రయాణీకుల భద్రత కోసం, కొత్త టాటా నెక్సాన్- 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు బ్లైండ్ వ్యూ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరా వంటి అంశాలను పొందుతుంది.

    అదే ఇంజిన్‌లు, మరిన్ని ట్రాన్స్‌మిషన్‌లు

    ఇంజిన్

    1.2-లీటర్ టర్బో-పెట్రోల్

    1.5-లీటర్ డీజిల్

    పవర్

    120PS

    115PS

    టార్క్

    170Nm

    260Nm

    ట్రాన్స్మిషన్

    5MT. 6MT, 6AMT & 7DCT

    6MT & 6AMT

    టాటా ప్రీ-ఫేస్‌లిఫ్ట్ నెక్సాన్‌లో ఉన్న అదే ఇంజన్ ఎంపికలను ఉపయోగించింది. అయితే, కారు తయారీ సంస్థ టర్బో-పెట్రోల్ యూనిట్ కోసం మరిన్ని ట్రాన్స్‌మిషన్ ఎంపికలను జోడించింది. అయితే 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ AMT రెండు ఇంజన్ ఎంపికలకు ప్రామాణికం మరియు మునుపటి నెక్సాన్‌లో కూడా ఇవే ఉన్నాయి, అయితే టర్బో-పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DCT ఎంపికను పొందలేదు. అలాగే, డ్రైవింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి? మా మొదటి డ్రైవ్ సమీక్షను ఇక్కడ చూడండి.

    ప్రత్యర్థులు

    Tata Nexon Facelift

    టాటా నెక్సాన్ ఇప్పుడు దాని కొత్త అవతార్‌లో తిరిగి మార్కెట్లోకి వచ్చింది మరియు కియా సొనెట్మారుతి బ్రెజ్జాహ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కైగర్ లకు పోటీగా కొనసాగుతోంది.

    మరింత చదవండి నెక్సాన్ AMT 

    was this article helpful ?

    Write your Comment on Tata నెక్సన్

    2 వ్యాఖ్యలు
    1
    K
    kesri
    Sep 14, 2023, 3:38:32 PM

    what is price on road

    Read More...
      సమాధానం
      Write a Reply
      1
      B
      bharath kumar s r
      Sep 14, 2023, 1:55:10 PM

      what is the price on road

      Read More...
        సమాధానం
        Write a Reply

        సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

        *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

        ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

        • లేటెస్ట్
        • రాబోయేవి
        • పాపులర్
        ×
        We need your సిటీ to customize your experience