శ్రీలంక లో జెస్ట్ మరియు బోల్ట్ కార్లను ప్రారభించిన టాటా మోటార్స్

published on జూన్ 10, 2015 02:22 pm by sourabh కోసం టాటా జెస్ట్

  • 13 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: టాటా మోటార్స్ మరియు డీజిల్ & మోటార్ ఇంజినీరింగ్ పిఎల్ సి (డి ఐ ఎం ఓ) కలిసి శ్రీలంక లో కొత్త కాంపాక్ట్ సెడాన్ అయిన జెస్ట్ ను మరియు హాచ్బాక్ అయిన బోల్ట్ ను ప్రారంభించింది. ఈ రెండు కార్లు టాటా డీలర్ ద్వారా భారతదేశం అంతటా కస్టమర్ కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు కార్లు భారతదేశం యొక్క పూనే లో తయారైనవి. జెస్ట్ మరియు మోల్ట్ వాహనాలు ఉత్తమ లక్షణాలను అందిస్తుంది. అవి వరుసగా 5 అంగుళాల కనెక్ట్ నెక్స్ట్ టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ, అడ్వాన్స్ వాయిస్ కమాండ్ గుర్తింపు, ఎస్ ఎం ఎస్ నోటిఫికేషన్ మరియు టచ్ స్క్రీన్ పై పూర్తి ఆటోమేటిక్ ఉష్ణోగ్రత నియంత్రణ వంటి వాటిని కలిగి ఉన్నాయి.

ఇంటర్నేషనల్ బిజినెస్, ప్యాసింజర్ వాహనాలు, టాటా మోటార్స్  హెడ్ మిస్టర్ జానీ ఊమెన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ " మేము మా వినియోగదారులకు మంచి ఉత్పత్తులను మరియు సేవలను అందించే లక్ష్యంతో శ్రీలంక మార్కెట్లో రెండు కొత్త ఉత్తేజకరమైన ఉత్పత్తులను ప్రవేశపెట్టాము అవి డైనమిక్ కాంపాక్ట్ సెడాన్, జెస్ట్  మరియు క్రీడా వైఖరి కలిగిన హాచ్బాక్, బోల్ట్. ఈ రెండు కార్లు,అనేక విభాగాలలో ప్రముఖ లక్షణాలతో లోడ్ చేయబడి ఉన్నాయి వీటిని ప్రపంచ రూపకల్పన మరియు ఉత్పత్తి ప్రమాణాలతో నిర్మించారు. మరియు ఇది మొదటిసారి కొనుగోలుదారులకు కూడా మెచ్చే విధంగా ఉంది అలాగే ఇప్పటికే ఉన్న ఆటో మొబైల్ యజమానులు ఎవరైతే కొత్త వాహనాల కోసం ఎదురు చూస్తు ఉన్నారో వారికి ఇది ఒక కొత్త మరియు ఆసక్తికరమైన ఉత్పత్తి. మా బృందాలచే భారతదేశం, యు.కె మరియు ఇటలీ అంతటా రూపొందించబడిన జెస్ట్ మరియు బోల్ట్ మా  హారిజోనెక్స్ట్ వ్యూహం కింద తయరైన రెండు ఉత్పత్తులు, ఇవి మా ప్యాసింజర్ వాహనాల వ్యాపారం యొక్క నిర్మాణానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. బోల్ట్ మరియు జెస్ట్ ఇక్కడ స్థానిక మార్కెట్ లో మా ఉనికిని మరింత బలోపేతం చేస్తాయని మేము ఆశిస్తున్నాము" అని అన్నారు. 

టాటా జెస్ట్ యొక్క 1.2టి (పెట్రోల్ వేరియంట్) ధర ఎల్ కె ఆర్ 2,810,000 (ఎక్స్-షోరూమ్, కొలంబో), అయితే టాటా బోల్ట్ యొక్క 1.2ట్ (పెట్రోల్ వేరియంట్) ధర ఎల్ కె ఆర్ 2,299,000 (ఎక్స్-షోరూమ్, కొలంబో). నేటి నుండి దేశవ్యాప్తంగా 37 డి ఐ ఎం ఓ షోరూంల ద్వారా కార్ల అమ్మకాలు అందుబాటులో ఉంటాయి.  

టాటా డివిజన్ డిఐఎంఒ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ రంజిత్ పండిత్యాగి మాట్లాడుతూ "మేము డిఐఎంఒ శ్రీలంక వద్ద మంచి ఇంధన సామర్థ్య ం తో పాటు అనేక గొప్ప లక్షణాలు ఉన్న ఈ కార్లను మా వినియోగదారులకి అందించడం గర్వంగా ఉంది అని ఆయన అన్నారు. దేశంలో ఉత్తమ సర్వీసులతో కూడిన ఒక గొప్ప ఉత్పత్తి తో కూడిన బోల్ట్ మరియు జెస్ట్ కార్లను శ్రీలంకలో స్థాపించడం వలన వీటి కలయిక వినియోగదారులకు ఉపయోగపడుతుందని" ఆయన పేర్కొన్నారు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన టాటా జెస్ట్

Read Full News
×
We need your సిటీ to customize your experience