టాటా కైట్ 5 వాహనం గురించి మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు
పోర్ట్ఫోలియో లో రెండు కాంపాక్ట్ సెడాన్లు కలిగిన ఉత్పత్తిదారులు కేవలం టాటా మాత్రమే. ఇవి త్వరలో రాబోతున్నాయి!
టాటా మోటార్స్ ఇటీవల 2016 ఆటో ఎక్స్పోలో జైకా ఆధారిత కాంపాక్ట్ సెడాన్ ని బహిర్గతం చేసింది. ఈ వాహనం ఈ సంవత్సరం తరువాత ప్రారంభిస్తారని అంచనా వేస్తున్నారు. దీని శ్రేనిలోని జెస్ట్ తో పాటూ సమానంగా దీని ధరని నిర్ణయిస్తారని అనుకుంటున్నారు. మొట్టమొదటి కాంపాక్ట్ సెడాన్ అయినటువంటి ఇండిగో ECS ని ఇది సాంకేతికపరంగా భర్తీ చేస్తుంది.
డిజైను;
మార్కెట్లో ప్రస్తుతం ఉన్న మిగిలిన కాంపాక్ట్ సేడాన్లతో పోలిస్తే గనుక ఇది చాలా ఉత్తమమయినది. దాదాపు ఇది బూట్ ని కలిగి ఉండదు అనే చెప్పవచ్చు. కూపే లాంటి రోఫ్ లైన్ ని గనుక చూసినట్లయితే ఉప 4m సెడాన్ ఆడ్ బూట్ డిజైనుని కలిగి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఫీచర్లు అయినటువంటి దాని పొడవంతా ఆవరించి ఉన్న ఎల్ ఈ డి బ్రేక్ ల్యాంప్ కలిగి ఉంటుంది. టాటా దీని ఉత్పాత్తి ని ఇలాగే అందించాలని అనుకుంటుంది. హెడ్ల్యాంప్ ఫీచర్ ప్రొజెక్టర్లు, జైకా ని పోలి మిలమిలలాడే నలుపు వర్ణాన్ని కలిగిన గ్రిల్ వంటి లక్షణాలని కలిగి ఉన్న వాహనాలని అందించబోతుంది.
ఇంజిన్లు;
కైట్ 5 కొత్త డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్లని కలిగి ఉండబోతోంది. వీటిని టాటా ఇప్పటికే జైకాతో పరిచయం చేసింది. డీజిల్ 1.05 లీటర్ రేవోటార్క్ 3-సిలిండర్ డీజిల్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. టాటా కొత్త కుటుంబం లోని డీజిల్ ఇంజిన్లని దాని ప్రముఖ ఉత్పత్తి అయిన కొత్త జైకాతో పరిచయం చేసారు. డీజిల్ ఇంజన్ 4000 RPM వద్ద 70 పిఎస్ గరిష్ట శక్తిని మరియు 1800-3000 ఆర్పిఎమ్ వద్ద 140 NMల టార్క్ ని అందిస్తుంది
ఫీచర్స్ మరియు భద్రత;
భద్రత పరంగా, కైట్ 5 వాహనం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని మరియు ABS మరియు EBS ప్లస్ సిఎస్సి (కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్) ఫీచర్లని అందిస్తుంది. దీని ఫీచర్ల విషయానికి గనుక వస్తే టాటా జైకా వాహనం కలిగి ఉన్న లక్షణాలయిన జంట హ్యాచ్బ్యాక్ మరియు క్యాబిన్లని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఒక టచ్స్క్రీన్vinoda వ్యవస్థ కలిగి ఉన్న 8 స్పీకర్ హర్మాన్ వ్యవస్థ కూడా ఉంటుంది. ( జైకాలో టచ్స్క్రీన్ వ్యవస్థ లేదు). అంతే కాకుండా ఈ వాహనం జైకా యొక్క Juke యాప్ కనెక్టివిటీ ని కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు.