Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

భారీగా కప్పబడి కనిపించిన టాటా కర్వ్

టాటా కర్వ్ కోసం ansh ద్వారా జూలై 13, 2023 11:03 pm సవరించబడింది

ఈ SUV భారతదేశ మార్కెట్ؚలోకి వచ్చే సంవత్సరం ప్రవేశించవచ్చు, ముందుగా ఎలక్ట్రిక్ వేరియంట్‌లో రావచ్చు.

టాటా కర్వ్, భారత కారు తయారీదారు నుండి రానున్న కూపే-SUV, దీని మొదటిసారి భారతదేశంలో టెస్ట్ చేస్తుండగా కెమెరాకు చిక్కింది. దాదాపుగా ప్రొడక్షన్ؚకు సిద్ధంగా ఉన్న కర్వ్ؚను కారు తయారీదారు ఆటో ఎక్స్ؚపో 2023లో ఇప్పటికే ప్రదర్శించారు మరియు ప్రస్తుతం టెస్టింగ్ ప్రారంభమైంది. ఇతర టెస్ట్ వాహనాల మధ్య, భారీగా ముసుగులో ఉన్న టెస్ట్ వాహనం పార్కింగ్ లాట్ؚలో కనిపించింది.

చిత్రాలలో ఏమి కనిపిస్తుంది

రహస్య చిత్రాలలో, కర్వ్ ముందు మరియు సైడ్ ప్రొఫైల్ؚను స్పష్టంగా చూడవచ్చు. ముందు వైపు నుండి హెడ్ؚల్యాంప్ స్థానం, DRL స్ట్రిప్ ఆకృతి మరియు మధ్యలో టాటా లోగో స్థానాన్ని మాత్రమే గమనించగలము. ఆటో ఎక్స్ؚపోలో ప్రదర్శించిన యూనిట్ؚలో ఉన్నట్లుగానే ఇందులో కూడా గ్రిల్ అదే స్థానంలో కనిపించింది.

ఇది కూడా చూడండి: ఎయిర్ؚపోర్ట్ కన్వేయర్ బెల్ట్ వద్ద తన బూట్ؚస్పేస్ؚను ప్రదర్శించిన టాటా ఆల్ట్రోజ్ i-CNG

మోటార్ షోలో ప్రదర్శించిన దానితో పోలిస్తే విభిన్నమైన అలాయ్ సెట్ؚను సైడ్ ప్రొఫైల్‌లో చూడవచ్చు. ఈ కోణం నుండి కారు పొడవు, ఫ్లష్ డోర్ హ్యాండిల్ؚలు మరియు నాజూకైన విండోలను చూడవచ్చు. అలాగే, అదనపు ముసుగు బాక్స్ؚను జోడించడం ద్వారా కర్వ్ డిజైన్ؚలో ముఖ్యాంశం అయిన, ప్రొడక్షన్-స్పెక్ మోడల్ వాలుగా ఉన్న రేర్-ఎండ్ స్టైలింగ్ؚను దాచడానికి కారు తయారీదారు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.

పవర్ؚట్రెయిన్

125PS పవర్ మరియు 225Nm టార్క్‌ను అందించే టాటా 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ టాటా కర్వ్ؚను నడిపిస్తుంది. ప్రస్తుతానికి, ట్రాన్స్ؚమిషన్ ఎంపికలు ధృవీకరించ లేదు, కానీ వీటిలో ఒకటి డ్యూయల్-క్లచ్ ట్రాన్స్ మిషన్ (DCT) కావచ్చు. ఇతర ఇంజన్‌ల వివరాలు ప్రస్తుతానికి తెలియదు.

టాటా జెన్ 2 ప్లాట్ؚఫారంపై నిర్మించిన ఎలక్ట్రిక్ వర్షన్ కూడా వస్తుంది. దీని క్లెయిమ్ చేసిన పరిధి 500కిమీ వరకు ఉండవచ్చు. టాటా ప్రోడక్ట్ ప్లానర్ ప్రకారం, ఇంటర్నల్ కంబుషన్ ఇంజన్ (ICE)తో వచ్చే మోడల్ కంటే ముందుగా EV వస్తుంది.

ఫీచర్‌లు భద్రత

ఆటో ఎక్స్ؚపో 2023లో ప్రదర్శించిన దానిపై ఆధారంగా, టాటా కర్వ్ కనెక్టెడ్ కార్ టెక్ؚతో భారీ టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, టచ్ ప్యానెల్ؚతో ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు పనోరమిక్ సన్ؚరూఫ్ؚలను పొందవచ్చు. మధ్యలో డిజిటల్ డిస్ప్లేతో టాటా కొత్త స్టీరింగ్ వీల్ కూడా ఉండవచ్చు.

ఇది కూడా చూడండి: EVలకు ప్రాధాన్యత, కానీ పెట్రోల్ మరియు డీజిల్ కార్ లను నిలిపివేసే ఆలోచన లేదు అంటున్న టాటా

భద్రత కోసం, ఈ SUV ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలను, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రేర్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్‌లను అందిస్తుంది. టాటా హ్యారియర్ؚలో అందించినట్లు కొన్ని ADAS ఫీచర్‌లతో కూడా రావచ్చు.

ధర పోటీదారులు

టాటా కర్వ్ వచ్చే సంవత్సరం ప్రారంభంలో విడుదల కావచ్చు, EV ధరలు సుమారు రూ. 20 లక్షల నుండి ప్రారంభం కావచ్చు, మరియు IC వర్షన్ ప్రారంభ ధర రూ.10.5 లక్షలు ఉండవచ్చని అంచనా (అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు). విడుదలైన తరువాత, ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, వోక్స్వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాక్ మరియు MG ఆస్టర్ వంటి కాంపాక్ట్ SUVలకు పోటీ పడుతుంది. మరొకవైపు కర్వ్ EV, MG ZS EV మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ؚలతో కూడా పోటీ పడవచ్చు.

చిత్రం మూలం

a
ద్వారా ప్రచురించబడినది

ansh

  • 977 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన టాటా కర్వ్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.1.36 - 2 సి ఆర్*
Rs.7.51 - 13.04 లక్షలు*
Rs.43.81 - 54.65 లక్షలు*
Rs.9.98 - 17.90 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర