టాటా ఆల్ట్రోజ్ అంచనా ధరలు: ఇది మారుతి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ i20 తో పోటీ పడుతుందా?
టాటా ఆల్ట్రోస్ 2020-2023 కోసం dhruv attri ద్వారా జనవరి 15, 2020 12:23 pm ప్రచురించబడింది
- 27 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టాటా ఆల్ట్రోజ్ ‘గోల్డ్ స్టాండర్డ్’ ను టేబుల్ కి తీసుకువస్తానని పేర్కొంది, అయితే దాని కోసం ధరని కూడా అడుగుతుందా?
టాటా మోటార్స్ జనవరి 22 న ఆల్ట్రోజ్ ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది, అయితే రూ. 21,000 రూపాయల టోకెన్ అమౌంట్ తో ఇప్పటికే మల్టిపుల్ ప్లాట్‌ఫారమ్ లలో బుకింగ్ లు ప్రారంభమయ్యాయి. దీని ధర రూ .5.5 లక్షల నుంచి రూ .8.5 లక్షల మధ్య ఉంటుందని అంచనా.
మీరు గనుక దీనిని తీసుకోవాలనుకుంటే, మీరు ఈ BS6- కంప్లైంట్ ఇంజిన్ ఆప్షన్స్ లో ఒకదాన్ని ఎంచుకోవాలి: ఒకటి 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఇది 86Ps పవర్ మరియు 113Nm టార్క్ ని ఇస్తుంది లేదా ఇంకొకటి 1.5-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ 90Ps పవర్ మరియు 200Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ తో ప్రామాణికంగా జతచేయబడతాయి, కాని డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ మరియు టర్బోచార్జ్డ్ పెట్రోల్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్నాయి.
టాటా ఆల్ట్రోజ్ XE, XM, XT, XZ మరియు XZ (O) అనే ఐదు వేరియంట్లలో అమ్మబడుతుంది. ఇది ప్రామాణిక వేరియంట్ ఆప్షన్స్ పై ఉపయోగపడే లక్షణాలను చేర్చే నాలుగు కస్టమ్ ప్యాక్‌లను కూడా పొందుతుంది. వీటిలో రిథమ్ (XE మరియు XM పై), స్టైల్ (XM పై), లక్సే (XT పై) మరియు అర్బన్ (XZ పై) ఉన్నాయి. ఇప్పుడు, వేరియంట్ల ప్రకారం మీరు ఆల్ట్రోజ్ కోసం ఎంత డబ్బులు వెచ్చించాలో వాటి ధరలను బట్టి తెలుసుకుందాము.
వేరియంట్ |
పెట్రోల్ |
డీజిల్ |
XE |
రూ. 5.50 లక్షలు |
రూ. 6.50 లక్షలు |
XM |
రూ. 5.90 లక్షలు |
రూ. 6.90 లక్షలు |
XT |
రూ. 6.60 లక్షలు |
రూ. 7.60 లక్షలు |
XZ |
రూ. 7.20 లక్షలు |
రూ. 8.20 లక్షలు |
XZ(O) |
రూ. 7.50 లక్షలు |
రూ. 8.50 లక్షలు |
నిర్ధారణ: పై ధరలు మా అంచనా మాత్రమే, ఫైనల్ ధరలు మారే అవకాశం ఉంది
ఇప్పుడు, టాటా ఆల్ట్రోజ్ ధరలను దాని ప్రత్యక్ష ప్రత్యర్థులతో పోల్చి చూద్దాము:
టాటా ఆల్ట్రోజ్ |
హ్యుందాయ్ ఎలైట్ i20 |
మారుతి బాలెనో |
టయోటా గ్లాంజా |
హోండా జాజ్ |
|
ధరలు(ఎక్స్-షోరూం, ఢిల్లీ) |
రూ. 5.5 లక్షల నుండి రూ. 8.5 లక్షలు (అంచనా) |
రూ. 5.52 లక్షల నుండి రూ. 9.34 లక్షలు |
రూ.5.58 లక్షల నుండి రూ. 8.9 లక్షలు |
రూ. 6.97 లక్షల నుండి రూ. 8.9 లక్షలు |
రూ.7.45 లక్షల నుండి రూ. 9.4 లక్షలు |
ఆల్ట్రోజ్ ధర దీని ప్రత్యర్ద్ధులను కాకుండా దీనినే తీసుకోవాలి అని అనిపించేలా చేస్తిందా? దిగువ కామెంట్ విభాగంలో మీ అభిప్రాయం మాకు తెలియజేయండి.
మరింత చదవండి: ఎలైట్ i20 ఆన్ రోడ్ ప్రైజ్
0 out of 0 found this helpful