Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

టాటా ఆల్ట్రోజ్ EV మొదటిసారిగా పబ్లిక్ రోడ్లపై కనిపించింది

టాటా ఆల్ట్రోజ్ ఇవి కోసం dhruv ద్వారా డిసెంబర్ 23, 2019 02:11 pm సవరించబడింది

టైగర్ EV మరియు రాబోయే నెక్సాన్ EV తరువాత ఆల్ట్రోజ్ EV భారతదేశానికి టాటా యొక్క మూడవ ఎలక్ట్రిక్ వాహనం అవుతుంది

  • ఆల్ట్రోజ్ EV ఎటువంటి తీవ్రమైన డిజైన్ మార్పులను కలిగి లేదు.
  • ఇది ఎలక్ట్రిఫికేషన్ కు సపోర్ట్ ఇచ్చే అదే ఆల్ఫా-ARC ప్లాట్‌ఫాంపై నిర్మించబడింది.
  • ఒకే ఛార్జీపై సుమారు 300 కిలోమీటర్ల రేంజ్ ని కలిగి ఉంటుందని అంచనా.
  • సాధారణ ఆల్ట్రోజ్ కంటే ఎక్కువ లక్షణాలను కలిగి ఉండే అవకాశం ఉంది.
  • ప్రొడక్షన్-రెడీ మోడల్‌ ను 2020 ఆటో ఎక్స్‌పోలో చూపించవచ్చు.
  • బేస్ వేరియంట్‌ కు దీని ధర రూ .15 లక్షల లోపు ఉంటుందని భావిస్తున్నారు.

టాటా ఆల్ట్రోజ్ EV ను భారతదేశంలోని బహిరంగ రహదారులపై మొదటిసారిగా గుర్తించారు. ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ పూర్తిగా కవరింగ్ తో కప్పబడి రోడ్డు పై నెక్సాన్ EV పక్కన కనిపించింది. ఆల్ట్రోజ్ EV 2018 జెనీవా మోటార్ షోలో ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్) హ్యాచ్‌బ్యాక్‌తో పాటు ప్రపంచ ప్రవేశం చేసింది.

సాధారణ ఆల్ట్రోజ్‌ తో పోల్చితే, ఆల్ట్రోజ్ EV డిజైన్‌ లో ఎటువంటి మార్పులను కలిగి ఉండదని చిత్రం నుండి స్పష్టమైంది. మార్పులు చూస్తే గనుక, మేము ఇప్పుడు గుర్తించగలిగిన ఏకైక తేడా ఏమిటంటే టెయిల్ పైప్ లేకపోవడం.

విద్యుదీకరణకు మద్దతు ఇచ్చే ALFA-ARC ప్లాట్‌ఫారమ్‌ ను ప్రభావితం చేస్తూ, ఆల్ట్రోజ్ EV టాటా యొక్క తాజా ‘జిప్‌ట్రాన్' ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ ను ఉపయోగించాలి. జిప్‌ట్రాన్ బ్రాండెడ్ పవర్‌ట్రైన్ రాబోయే నెక్సాన్ E.V తో తొలిసారి రానున్నది.

నెక్సాన్ EV మరియు ఆల్ట్రోజ్ EV రెండూ బ్యాటరీ ప్యాక్‌ను 30kWh సామర్థ్యానికి దగ్గరగా కలిగి ఉంటాయని భావిస్తున్నారు, ఇది టైగర్ EV యొక్క 21.5kWh బ్యాటరీ ప్యాక్ కంటే పెద్దదిగా ఉంటుంది. టాటా ఇంకా పవర్‌ట్రెయిన్ యొక్క స్పెక్స్‌ను వెల్లడించలేదు, కాని జెనీవా మోటార్ షోలో వాగ్దానం చేసినట్లు ఆల్ట్రోజ్ EV ఒకే ఛార్జీపై 300 కిలోమీటర్లు ఇస్తుందని మేము భావిస్తున్నాము. టిగోర్ EV 213 కిలోమీటర్ల క్లెయిమ్ పరిధితో వస్తుంది.

ఇది కూడా చదవండి: ధృవీకరించబడింది: టాటా ఆల్ట్రోజ్ జనవరి 22, 2020 న ప్రారంభించబడుతుంది

ఇంటీరియర్ లేఅవుట్ ఆల్ట్రోజ్ మాదిరిగానే ఉంటుంది, EV ICE హ్యాచ్‌బ్యాక్ కంటే ఫీచర్-రిచ్‌గా ఉంటుందని, దాని వలన ఎక్కువ ధరని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. సూచన కోసం, జెనీవాలో ప్రదర్శించిన కారులో LED హెడ్‌ల్యాంప్‌లు, ప్రీమియం అప్హోల్స్టరీ మరియు ప్రామాణిక మోడల్ కంటే పెద్ద స్క్రీన్ ఉన్నాయి. అంతేకాకుండా, ఆల్ట్రాజ్ యొక్క రెగ్యులర్- ఫ్యుయల్ పవర్ తో మరియు ఎలక్ట్రిక్ మోడళ్లను వేరు చేయడానికి రంగు పథకాలని టాటా ఎంచుకోవచ్చు.

భారతీయ కార్ల తయారీసంస్థ 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రొడక్షన్-రెడీ మోడల్ ని ప్రదర్శిస్తుంది, 2020 మధ్యలో ఆల్ట్రోజ్ EV ప్రారంభం అవుతుంది. టాటా దీనిని భారతదేశంలో లాంచ్ చేసినప్పుడు, దీని ధర రూ .15 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు ఉంటుందని మేము భావిస్తున్నాము. ఆల్ట్రోజ్ EV కారు టైగర్ EV (రూ. 12.59 లక్షల ఎక్స్-షోరూమ్) మరియు నెక్సాన్ EV (రూ .15 లక్షల నుండి రూ .17 లక్షలు) మధ్యలో ఉంటుందని చెప్పవచ్చు.

చిత్ర మూల

d
ద్వారా ప్రచురించబడినది

dhruv

  • 36 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన టాటా ఆల్ట్రోస్ EV

explore మరిన్ని on టాటా ఆల్ట్రోజ్ ఇవి

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.24 లక్షలు*
Rs.5.65 - 8.90 లక్షలు*
Rs.7.04 - 11.21 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర