Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఆర్ధిక సంవత్సరం (2023-24) ప్రథమార్ధంలో ఆల్ట్రోజ్, పంచ్ CNG వాహనాలు లాంచ్‌కు సిద్దంగా ఉన్నట్లు వెల్లడించిన టాటా

ఫిబ్రవరి 03, 2023 02:36 pm rohit ద్వారా ప్రచురించబడింది
56 Views

ఈ రెండు కాంపాక్ట్ కార్ మోడల్‌లు బూట్ స్పేస్‌ను ఎక్కువగా అందించే స్ప్లిట్-సిలిండర్-ట్యాంక్ సెట్అప్ؚతో విడుదల కాబోతున్నాయి.

  • టాటా, ఆటో ఎక్స్ؚపో 2023లో ఆల్ట్రోజ్ మరియు పంచ్ CNGలను ప్రదర్శించింది.

  • రెండూ వాహనాలు సౌకర్యవంతమైన బూట్ స్పేస్‌ను అందిస్తున్నాయి, కానీ వాటి ఖచ్చితమైన సామర్ధ్యలు ఇంకా వెల్లడించలేదు.

  • రెండిటి ప్రామాణిక వెర్షన్ؚలు 345 లీటర్‌లు, 366 లీటర్‌లు లగేజ్ స్పేస్‌ను కలిగి ఉన్నాయి.

  • రెండు మోడళ్ళు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో CNG మోడ్ؚలో 77PS/97Nm పవర్, టార్క్‌ను అందిస్తున్నాయి.

  • మిడ్, టాప్-స్పెక్ రెండు వేరియెంట్ؚలలో టాటా CNG ఎంపికను అందిస్తుందని భావిస్తున్నాము.

  • వీటి ధర పెట్రోల్ వేరియెంట్ؚలతో పోలిస్తే సుమారు ఒక లక్ష కంటే ఎక్కువగా ఉండవచ్చు.

భారతదేశంలో ఉన్న కార్లలో CNG కిట్ؚలను అందించే విధానాన్ని విప్లవాత్మకం చేయాలని టాటా ప్రయత్నిస్తుంది. ఆటో ఎక్స్ؚపో 2023లో ప్రదర్శించిన ఆల్ట్రోజ్, పంచ్ؚలతో ప్రారంభించి రాబోయే CNG మోడల్‌లలో స్ప్లిట్-సిలిండర్-ట్యాంక్ సెట్అప్ؚను అందిస్తుంది. ఈ రెండు మోడల్‌లు వచ్చే ఆర్ధిక సంవత్సరం (2023-24) ప్రధమ భాగంలో విడుదల అవుతాయని కారు తయారీదారు నిర్ధారించారు.

CNG కొనుగోలుదారులకు ఉపయోగపడే విధంగా అధిక బూట్ స్పేస్ؚను అందించడానికి స్ప్లిట్-ట్యాంక్ సెట్అప్ؚను పరిచయం చేశారు. అయితే, అల్ట్రోజ్, పంచ్ CNGల ఖచ్చితమైన లగేజ్ సామర్ధ్యాన్ని టాటా ఇంకా వెల్లడించలేదు. ఆల్ట్రోజ్, పంచ్ ప్రామాణిక వర్షన్‌లు వరుసగా 345 లీటర్‌ల, 366 లీటర్‌ల బూట్ స్పేస్ؚతో వస్తాయి.

ఆల్ట్రోజ్ మరియు పంచ్ రెండిటిలో CNG ఎంపికతో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది 77PS/95Nm పవర్, టార్క్‌ను అందిస్తుంది. దీని ప్రామాణిక పెట్రోల్ వర్షన్ؚలో, అదే ఇంజన్ 86PS/113Nm పవర్, టార్క్‌ను అందిస్తుంది. CNG వేరియెంట్ؚలు కేవలం ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚను పొందాయి, అయితే రెగ్యులర్ పెట్రోల్ వేరియెంట్ؚలు ఐదు-స్పీడ్‌ల AMT ఎంపికతో కూడా వస్తాయి.

ఇది కూడా చదవండి: ADASؚతో త్వరలో లాంచ్ కానున్న టాటా హ్యారీయర్, సఫారి

టాటా ఆల్ట్రోజ్, పంచ్ రెండు మోడల్‌ల మిడ్ మరియు టాప్-స్పెక్ వేరియెంట్ؚలలో CNG కిట్ؚను అందిస్తుందని భావిస్తున్నాం. CNG వేరియెంట్ؚలలో వాయిస్-ఎనేబుల్డ్ సన్ؚరూఫ్, ఏడు-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్ మరియు ఆరు ఎయిర్ బ్యాగ్ؚల వంటి కొన్ని సాధారణ ఫీచర్‌లు ఈ రెండు టాటా కార్‌లలో ఉన్నాయి.

వీటి ధర పెట్రోల్ వేరియెంట్ؚలతో పోలిస్తే సుమారు ఒక లక్ష కంటే ఎక్కువగా ఉండవచ్చు. ప్రస్తుతం, ఆల్ట్రోజ్ ధర రూ.6.35 లక్షల నుండి 10.25 లక్షల, పంచ్ కేవలం-పెట్రోల్ వేరియెంట్ؚల ధర రూ.6 లక్షలు నుండి 9.54 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) పరిధిలో ఉంది. మారుతి బాలెనో CNG, టయోటా గ్లాంజా CNGలతో ఆల్ట్రోజ్ CNG పోటీ పడుతుంది, అయితే పంచ్ CNGకి తక్షణ పోటీదారు ఎవరు లేరు.

ఇక్కడ మరింత చదవండి: టాటా ఆల్ట్రోజ్ ఆటోమ్యాటిక్

Share via

Write your Comment on Tata ఆల్ట్రోస్ 2020-2023

explore similar కార్లు

టాటా ఆల్ట్రోస్

4.61.4k సమీక్షలుకారు ని రేట్ చేయండి
Rs.6.65 - 11.30 లక్షలు* ఆన్ రోడ్ ధర పొందండి
పెట్రోల్19.3 3 kmpl
డీజిల్23.64 kmpl
సిఎన్జి26.2 Km/Kg

టాటా పంచ్

4.51.4k సమీక్షలుకారు ని రేట్ చేయండి
పెట్రోల్20.09 kmpl
సిఎన్జి26.99 Km/Kg
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.6.23 - 10.19 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.4.70 - 6.45 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.7 - 9.84 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.3.25 - 4.49 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర