ఆర్ధిక సంవత్సరం (2023-24) ప్రథమార్ధంలో ఆల్ట్రోజ్, పంచ్ CNG వాహనాలు లాంచ్‌కు సిద్దంగా ఉన్నట్లు వెల్లడించిన టాటా

published on ఫిబ్రవరి 03, 2023 02:36 pm by rohit for టాటా ఆల్ట్రోస్

 • 55 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ రెండు కాంపాక్ట్ కార్ మోడల్‌లు బూట్ స్పేస్‌ను ఎక్కువగా అందించే స్ప్లిట్-సిలిండర్-ట్యాంక్  సెట్అప్ؚతో విడుదల కాబోతున్నాయి. 

Tata Altroz and Punch CNG

 • టాటా, ఆటో ఎక్స్ؚపో 2023లో ఆల్ట్రోజ్ మరియు పంచ్ CNGలను ప్రదర్శించింది.

 • రెండూ వాహనాలు సౌకర్యవంతమైన బూట్ స్పేస్‌ను అందిస్తున్నాయి, కానీ వాటి ఖచ్చితమైన సామర్ధ్యలు ఇంకా వెల్లడించలేదు.

 • రెండిటి ప్రామాణిక వెర్షన్ؚలు 345 లీటర్‌లు, 366 లీటర్‌లు లగేజ్ స్పేస్‌ను కలిగి ఉన్నాయి.

 • రెండు మోడళ్ళు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో CNG మోడ్ؚలో 77PS/97Nm పవర్, టార్క్‌ను అందిస్తున్నాయి. 

 • మిడ్, టాప్-స్పెక్ రెండు వేరియెంట్ؚలలో టాటా CNG ఎంపికను అందిస్తుందని భావిస్తున్నాము.

 • వీటి ధర పెట్రోల్ వేరియెంట్ؚలతో పోలిస్తే సుమారు ఒక లక్ష కంటే ఎక్కువగా ఉండవచ్చు.  

భారతదేశంలో ఉన్న కార్లలో CNG కిట్ؚలను అందించే విధానాన్ని విప్లవాత్మకం చేయాలని టాటా ప్రయత్నిస్తుంది. ఆటో ఎక్స్ؚపో 2023లో ప్రదర్శించిన ఆల్ట్రోజ్, పంచ్ؚలతో ప్రారంభించి రాబోయే CNG మోడల్‌లలో స్ప్లిట్-సిలిండర్-ట్యాంక్ సెట్అప్ؚను అందిస్తుంది. ఈ రెండు మోడల్‌లు వచ్చే ఆర్ధిక సంవత్సరం (2023-24) ప్రధమ భాగంలో విడుదల అవుతాయని కారు తయారీదారు నిర్ధారించారు. 

Tata Altroz CNG split-cylinder-tank setup
Tata Punch CNG split-cylinder-tank setup

CNG కొనుగోలుదారులకు ఉపయోగపడే విధంగా అధిక బూట్ స్పేస్ؚను అందించడానికి స్ప్లిట్-ట్యాంక్ సెట్అప్ؚను పరిచయం చేశారు. అయితే, అల్ట్రోజ్, పంచ్ CNGల ఖచ్చితమైన లగేజ్ సామర్ధ్యాన్ని టాటా ఇంకా వెల్లడించలేదు. ఆల్ట్రోజ్, పంచ్ ప్రామాణిక వర్షన్‌లు వరుసగా 345 లీటర్‌ల, 366 లీటర్‌ల బూట్ స్పేస్ؚతో వస్తాయి. 

Tata Punch 1.2-litre petrol engine

ఆల్ట్రోజ్ మరియు పంచ్ రెండిటిలో CNG ఎంపికతో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది 77PS/95Nm పవర్, టార్క్‌ను అందిస్తుంది. దీని ప్రామాణిక పెట్రోల్ వర్షన్ؚలో, అదే ఇంజన్ 86PS/113Nm పవర్, టార్క్‌ను అందిస్తుంది. CNG వేరియెంట్ؚలు కేవలం ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚను పొందాయి, అయితే రెగ్యులర్ పెట్రోల్ వేరియెంట్ؚలు ఐదు-స్పీడ్‌ల AMT ఎంపికతో కూడా వస్తాయి.  

ఇది కూడా చదవండి: ADASؚతో త్వరలో లాంచ్ కానున్న టాటా హ్యారీయర్, సఫారి

Tata Altroz CNG sunroof

టాటా ఆల్ట్రోజ్, పంచ్ రెండు మోడల్‌ల మిడ్ మరియు టాప్-స్పెక్ వేరియెంట్ؚలలో CNG కిట్ؚను అందిస్తుందని భావిస్తున్నాం. CNG వేరియెంట్ؚలలో వాయిస్-ఎనేబుల్డ్ సన్ؚరూఫ్, ఏడు-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్ మరియు ఆరు ఎయిర్ బ్యాగ్ؚల వంటి కొన్ని సాధారణ ఫీచర్‌లు ఈ రెండు టాటా కార్‌లలో ఉన్నాయి. 

వీటి ధర పెట్రోల్ వేరియెంట్ؚలతో పోలిస్తే సుమారు ఒక లక్ష కంటే ఎక్కువగా ఉండవచ్చు. ప్రస్తుతం, ఆల్ట్రోజ్ ధర రూ.6.35 లక్షల నుండి 10.25 లక్షల, పంచ్ కేవలం-పెట్రోల్ వేరియెంట్ؚల ధర రూ.6 లక్షలు నుండి 9.54 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) పరిధిలో ఉంది. మారుతి బాలెనో CNG, టయోటా గ్లాంజా CNGలతో ఆల్ట్రోజ్ CNG పోటీ పడుతుంది, అయితే పంచ్ CNGకి తక్షణ పోటీదారు ఎవరు లేరు. 

ఇక్కడ మరింత చదవండి: టాటా ఆల్ట్రోజ్ ఆటోమ్యాటిక్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన టాటా ఆల్ట్రోస్

Read Full News
 • టాటా ఆల్ట్రోస్
 • టాటా punch
ఎక్కువ మొత్తంలో పొదుపు!!
save upto % ! find best deals on used టాటా cars
వీక్షించండి ఉపయోగించిన <modelname> లో {0}

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

trendingహాచ్బ్యాక్

 • లేటెస్ట్
 • ఉపకమింగ్
 • పాపులర్
 • మారుతి స్విఫ్ట్ 2023
  మారుతి స్విఫ్ట్ 2023
  Rs.6 లక్షలుఅంచనా ధర
  అంచనా ప్రారంభం: మార, 2024
 • vayve mobility eva
  vayve mobility eva
  Rs.7 లక్షలుఅంచనా ధర
  అంచనా ప్రారంభం: మార, 2024
 • టాటా altroz racer
  టాటా altroz racer
  Rs.10 లక్షలుఅంచనా ధర
  అంచనా ప్రారంభం: మే,2023
 • ఎంజి 3
  ఎంజి 3
  Rs.6 లక్షలుఅంచనా ధర
  అంచనా ప్రారంభం: డిసంబర్, 2023
 • ఎంజి comet ev
  ఎంజి comet ev
  Rs.9 లక్షలుఅంచనా ధర
  అంచనా ప్రారంభం: ఏప్ిల్, 2023
×
We need your సిటీ to customize your experience