• English
  • Login / Register

భారతదేశం లో రహస్యంగా పట్టుబడిన సుజుకి విటారా

నవంబర్ 23, 2015 01:53 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • 4 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 

Suzuki Vitara spy shot Front

సుజుకి విటారా, నోయిడా లో ఒక మారుతి సుజుకి ప్రాంగణం వద్ద రహస్యంగా పట్టుబడింది . కాంపాక్ట్ ఎస్యువిలు అయిన ఈ మూడు విటారాలు, యూరోపియన్ నిర్దేశ వాహనాల వలే కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ విటారాలను, రాబోయే 2016 సంవత్సరం భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్నారు.

Suzuki Vitara Spy Shot Side

అయితే, ఈ కారు గురించి తయారీదారుడు వద్ద నుండి ఎటువంటి సమాచారం ఇవ్వబడలేదు. కానీ, మారుతి ఎస్ -క్రాస్ అమ్మకాలు ఆకర్షణీయంగా ఉండటంతో దీనికి పోటీగా ఈ వాహనాన్ని, మారుతీ సంస్థ వచ్చే సంవత్సరం చివరిలో గానీ లేదా ఇంకా ముందే భారతదేశం లో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

Suzuki Vitara Spy Shot Rear

ఈ కారు గురించి మాట్లాడటానికి వస్తే, ఈ వాహనాన్ని మొదటిసారిగా పారిస్ మోటార్ షో వద్ద 2015 వ సంవత్సరం మొదటి భాగంలో ఆవిష్కరించడం జరిగింది. అంతేకాకుండా  iV-4 కాన్సెప్ట్  ఆధారంగా ఈ విటారా ను, 2013 వ సంవత్సరంలో ప్రదర్శించారు మరియు ఈ వాహనం, ఒక కాంటెంపరరీ బాక్సీ స్టైలింగ్ తో వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ వాహనం, భారతదేశం లో నిలిపివేయబడిన ముందరి విటారాను పోలి ఉంటుంది. ఈ వాహనం యొక్క ప్రధాన బాహ్య  అంశాల గురించి మాట్లాడటానికి వస్తే, ఒక క్లాం షెల్ బోనెట్, ప్రొజక్టార్ హెడ్ ల్యాంప్లు, కాంట్రాస్టింగ్ రూఫ్, అండర్స్టేటెడ్ లోయర్ ఎయిర్ డాం, క్రోం గ్రిల్, టైల్ ల్యాంప్లు మరియు పెద్ద గ్రాఫైట్ అల్లాయ్ చక్రాలు వంటి అంశాలు అందించబడతాయి.

Suzuki Vitara Spy Shot Rear

యూరోపియన్ మార్కెట్లలో విటారా, 1.6 లీటర్ 4- సిలండర్ పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది మరియు ఈ ఇంజన్ అత్యధికంగా, 120 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే, ఈ వాహనం కోసం 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ ను కూడా ఆప్షనల్ గా ఎంపిక చేసుకోవచ్చు మరియు ఇది, అధికంగా 320 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజన్ ను, ఎస్- క్రాస్ వాహనం లో కూడా చూడవచ్చు. ఈ పెట్రోల్ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది మరియు 6- స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ను కూడా ఆప్షనల్ గా ఎంపిక చేసుకోవచ్చు. అదే డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

మారుతి సంస్థ నుండి విడుదల అవ్వబోయే కొత్త వాహనాలు అయిన ఇగ్నిస్, మారుతి వైబిఏ ఎస్యువి మరియు విటారా లను భారతదేశంలో వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ వాహనాలు నెక్సా డీలర్ షిప్ల ద్వారా అమ్ముడవుతాయి.

ఇది కూడా చూడండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience