• English
    • Login / Register

    రాబోయే సంవత్సరాలలో 1.4 లీటర్ బూస్టర్ జెట్ ఇంజన్ తో రాబోతున్న సుజుకి స్విఫ్ట్

    మారుతి స్విఫ్ట్ 2014-2021 కోసం అభిజీత్ ద్వారా ఆగష్టు 24, 2015 06:04 pm ప్రచురించబడింది

    • 11 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    స్విఫ్ట్ స్పోర్ట్ లేదా భారతదేశం యొక్క అత్యంత ప్రముఖ హాటెస్ట్ హాచ్బాక్ వెర్షన్ 1.4 లీటర్ ఇంజన్ తో రాబోతుంది మరియు దీనిని టోక్యో మోటార్ షోలో ప్రదర్శించనున్నారు. ఈ మోటార్ బూస్టర్ జెట్ (టర్బోచార్జెడ్) టెక్నాలజీ తో కూడిన పెట్రోల్ ఇంజన్ తో రాబోతుంది.  మొట్టమొదట, ఈ కారు విదేశీ మార్కెట్ లలో విడుదల కానుంది, ఆ తరువాత ఈ హాటెస్ట్ హ్యాచ్బ్యాక్ నెమ్మదిగా భారతదేశం లో విడుదల అవుతుంది. అంతేకాకుండా, వోక్స్వాగన్ పోలో జిటి టిఎస్ ఐ లేదా అబార్త్ పుంటో ఈవో వంటి వాహనాలు కూడా మొదట యూఎస్ లో ప్రవేశపెట్టబడిన తరువాత మాత్రమే భారతదేశంలో ప్రవేశపెట్టబడతాయి.

    ఈ రాబోయే కాన్సెప్ట్ గురించి మాట్లాడటానికి వస్తే, ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ కు బిన్నంగా ఉండబోతుంది.  కానీ దీనిలో అదే డిజైన్ కవళికల ప్రేరణ కనబడుతుంది. కొత్తగా వచ్చిన నివేదికల ప్రకారం ఈ కొత్త కారు, ప్రస్తుత కారు కంటే ఎక్కువ వెడల్పుతో అంటే 1.8 మీటర్ల తో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు రాబోయే 1.4 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ గణనీయమైన పవర్ ను మరియు టార్క్ ను విడుదల చేయడం లో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ అధిక పవర్ ను విడుదల చేయడానికి ఈ వాహనం, డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో పాటు ఆల్ వీల్ డ్రైవ్ తో జత చేయబడి ఉంటుంది.

    సుజుకి, పోటీ ను తెలియచేయడానికి కాలక్రమేణా చాలా దూకుడుగా రాబోతుంది.   అంటే కారు కొనుగోలుదారులకు అనేక సాంకేతికతల లక్షణాల జాబితా ను తీసుకురాబోతుంది. మరొక కారణం ఏమిటంటే, అన్ని వర్గాల నుంచి తలెత్తే బలమైన పోటీ  ఎదుర్కోవడం కోసం ఈ వాహనం మరింత చురుకుగా రాబోతుంది. కాబట్టి భారతదేశం లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి, పెరుగుతున్న భారతీయ ఆటో రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

    was this article helpful ?

    Write your Comment on Maruti స్విఫ్ట్ 2014-2021

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience