• English
    • Login / Register

    స్పెసిఫికేషన్ పోలికలు: హ్యుందాయ్ సాన్త్రో vs డాట్సన్ గో ఫేస్లిఫ్ట్ vs సెలెరియో vs టియాగో vs వేగనార్

    హ్యుందాయ్ శాంత్రో కోసం dinesh ద్వారా మార్చి 27, 2019 11:07 am ప్రచురించబడింది

    • 17 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    Datsun GO vs Hyundai Santro vs Maruti Celerio vs Tata Tiago vs Maruti WagonR

    హ్యుందాయ్ భారతదేశంలో కొత్త సాన్త్రోను ప్రవేశపెట్టింది. ఇది హ్యుందాయ్ K1 అని పిలిచే ఒక కొత్త ప్లాట్‌ఫార్మ్ మీద నడుస్తుంది మరియు ఇది ఇప్పుడు ఎంట్రీ-లెవల్ హ్యుందాయై ఇక కానే కాదు. అందువలన ఇది ఇప్పుడు ఆల్టో, క్విడ్, రెడి-గో వంటి కార్లతో పోటీ పడడం లేదు మరియు ఇది టాటా టియాగో, మారుతి సుజుకి వాగన్ ఆర్, సెలెరియో, డాట్సన్ గో వంటి పోటీదారులతో పోటీ పడుతుంది. దాని ప్రారంభానికి, ఈ విభాగంలోని పోటీ అనేది బాగా రసవత్తరంగా మారిపోయి కొనుగోలుదారులకు ఏ కారు కొనుక్కుందాము అన్న ఆలోచనను కఠినం చేస్తున్నది. ఈ స్పెసిఫికేషన్స్ పోలికల వలన మీరు ఖచ్చితంగా ఇదే కారు కొనుక్కుందాము అని నిర్ణయం అయితే తీసుకోలేరు, కానీ మీ అవసరలకు తగ్గ కారుని సులభంగా ఎంచుకొనేందుకు ఇది మీకు బాగా సహాయపడుతుంది. పదండి కొలతలు పోల్చడం ద్వారా ప్రారంభిద్దాము.

    కొలతలు

    Hyundai Santro 2018

    కొలతలు

    హ్యుందాయ్ సాన్త్రో (2018)

    డాట్సన్ GO

    మారుతి సుజుకి సెలెరియో

    టాటా టియాగో

    మారుతి సుజుకి వాగన్ R / వాగనార్ Vxi + *

    పొడవు

    3610mm

    3788mm

    3695mm

    3746mm

    3599mm/ 3636mm

    వెడల్పు

    1645mm

    1636mm

    1600mm

    1647mm

    1495mm/ 1475mm

    ఎత్తు

    1560mm

    1507mm

    1560mm

    1535mm

    1700mm/ 1670mm

    వీల్బేస్

    2400mm

    2450mm

    2425mm

    2400mm

    2400mm

    బూట్ స్పేస్

    235 L

    265 L

    235 L

    242 L

    180L

    *వాగనార్ Vxi అనేది ముఖ్యంగా స్ట్రింగ్రే

    నవీకరించబడిన డాట్సన్ గో చాలా పొడవుగా ఉంది మరియు ఇది పొడవైన వీల్ బేస్ ని కూడా కలిగి ఉంది. ఇది ఆదర్శంగా చాలా విశాలమైనదిగా ఉంటుంది, కానీ మనం ముందు కూడా చూసాము, పెద్ద వీల్ బేస్ ఉన్నంత మాత్రాన  లోపల మరింత స్థలం ఉంటుందని అనుకోలేము. బూట్ స్థలం పరంగా, ఈ డాట్సన్ గో మొదటి స్థానంలో ఉంటుంది.

    ఈ కొత్త శాంత్రో అనేది పొడవులో చూసుకుంటే అన్నింటికన్నా చిన్నది మరియు వీల్‌బేస్ కూడా అంత పెద్దది ఏమీ కాదు. అయితే, విశాలమైన కార్ల మధ్య ఒకటిగా ఉంది మరియు రహదారి పై ఉనికిని కూడా బాగానే కలిగి ఉంటుంది మరియు ఇది వెనుకభాగంలో ముగ్గురిని మరింత సౌకర్యవంతంగా కూర్చొనేలా చేస్తుంది.

    ఇంజన్

    Hyundai Santro


    కార్

    ఇంజిన్ సామర్థ్యం

    సిలిండర్ల సంఖ్య

    పవర్

    టార్క్

    ట్రాన్స్మిషన్

    ఇంధన సమర్థత (క్లైమెడ్)

    డాట్సన్ GO

    1.2 లీటర్

    3

    68PS

    104Nm

    5-స్పీడ్ MT

    19.83 kmpl

    హ్యుందాయ్ సాన్త్రో (2018)

     

    1.1 లీటర్

    4

    69PS

    99Nm

    5-స్పీడ్ MT / AMT

     

    20.3 kmpl

    మారుతి సుజుకి సెలెరియో

    1.0 లీటర్

    3

    68PS

    90Nm

    5-స్పీడ్ MT / AMT

    23.1 kmpl

    టాటా టియాగో

    1.2 లీటర్

    3

    85PS

    114Nm

    5-స్పీడ్ MT / AMT

    23.84 kmpl

    మారుతి సుజుకి వాగనార్

    1.0 లీటర్

    3

    68PS

    90Nm

    5-స్పీడ్ MT / AMT

    20.51 kmpl

    1.2 లీటర్ ఇంజిన్ తో టియాగో ఇక్కడ అత్యంత శక్తివంతమైన కారు మాత్రమే కాదు, చాలా పొదుపుగా ఉంది. దీని తరువాత స్థానం హ్యుందాయ్ సాన్ట్రా తీసుకుంటూ 1.1 లీటరు ఇంజన్ తో 69Ps శక్తిని ఇస్తుంది మరియు ఇది డాట్సన్ గో యొక్క 1.2 లీటర్ ఇంజన్ అందించే 68Ps శక్తి కంటే 1Ps ఎక్కువ. వాగన్ఆర్ మరియు సెలేరియో కారులు రెండూ కూడా  68Ps శక్తిని అందిస్తూ డట్సన్ గో కి సమానంగా ఉన్నాయి. టార్క్ విషయానికి వస్తే, టియాగో 114Nm, డాట్సన్ గో 104Nm మరియు సాంత్రో 99Nm అందించగా వీటితో పోల్చుకుంటే మారుతి యొక్క కవలలు అయిన వాగన్ ఆర్ మరియు సెలేరియో అన్నిటికంటే తక్కువ 90Nm టార్క్ ని అందిస్తున్నాయి.  

    సాన్త్రో, వాగానార్ మరియు సెలెరియో కూడా   బూట్ ప్రదేశాన్ని తగ్గించుకొని CNG కిట్ ని అందిస్తూ ఇంధన సామర్ధ్యాన్ని పెంచడం జరుగుతుంది. మరొక వైపు, టియాగో ఒక డీజిల్ ఇంజిన్ ఎంపికతో ఉన్న ఏకైక కారు.

    మీడియా మరియు భద్రతా లక్షణాలు

    Honda Santro


    లక్షణం

    డాట్సన్ GO

    హ్యుందాయ్ సాన్త్రో (2018)

    మారుతి సుజుకి సెలెరియో

    టాటా టియాగో

    మారుతి సుజుకి వాగనార్

    టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్

    7 ఇంచ్

    7 ఇంచ్

    లేదు

    లేదు

    లేదు

    వెనుక పార్కింగ్ సెన్సార్లు

    ప్రామాణికంగా ఉంటుంది

    టాప్ వేరియంట్ లో మాత్రమే

    లేదు

    టాప్ వేరియంట్ లో మాత్రమే

    లేదు

    రివర్స్ పార్కింగ్ కెమేరా

    లేదు

    టాప్ వేరియంట్ లో మాత్రమే

    లేదు

    లేదు

    లేదు

    ABS

    ప్రామాణికంగా ఉంటుంది

    ప్రామాణికంగా ఉంటుంది

    ప్రామాణికం కాదు

    ప్రామాణికం కాదు

    ABS అన్ని వేరియంట్లలో ఆప్ష్నల్

    డ్రైవర్ ఎయిర్బాగ్

    ప్రామాణికంగా ఉంటుంది

    ప్రామాణికంగా ఉంటుంది

    ప్రామాణికంగా ఉంటుంది

    ప్రామాణికం కాదు

    అన్ని వేరియంట్లలో ఆప్ష్నల్

    ఫ్రంట్ ప్యాసెంజర్ ఎయిర్బాగ్

    ప్రామాణికంగా ఉంటుంది

    ప్రామాణికం కాదు

    ప్రామాణికం కాదు

    ప్రామాణికం కాదు

    అన్ని వేరియంట్లలో ఆప్ష్నల్

    డాట్సన్ గో ఖచ్చితంగా ఈ వర్గం లో, ముఖ్యంగా భద్రత పరంగా ఉత్తమంగా అమర్చబడిన కారు. దాని ప్రత్యర్థుల వలె కాకుండా, డాట్సన్ గో కారు డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, ABS మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లను ప్రామాణికంగా పొందుతుంది. సాన్త్రో దీనికి దగ్గరగా ఉంటూ అది డ్రైవర్ సైడ్ ఎయిర్బాగ్స్ మరియు ABS ను ప్రమాణంగా పొందుతుంది,అయితే ప్రయాణీకుల ఎయిర్బాగ్ మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు టాప్-స్పెక్స్ వేరియంట్ కి మాత్రమే పరిమితం చేస్తాయి.  

    సౌకర్యాలు మరియు ఇతర కావలసిన లక్షణాలకు వస్తే, శాంత్రో కొంచెం ముందంజలో ఉంటుంది, దీనిలో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో తో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉంది, అలానే రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు వెనుక A.C వెంట్లు కూడా అందించబడుతున్నాయి. డాట్సన్ గో కూడా ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో తో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో కలిగి ఉంది, అయితే రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు వెనుక A.C వెంట్లను ఇది మిస్ అవుతోంది. ఈ పోలికలో ఇతర కార్లును పోలిస్తే అవి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో సహా ఈ లక్షణాలను కోల్పోతున్నాయి,దీని బదులుగా, వారు 2-డీన్ మ్యూజిక్ సిస్టమ్ ను పొందుతారు.    

    ధరలు

    Hyundai Santro

     

    కార్

    హ్యుందాయ్ సాన్త్రో (2018)

    డాట్సన్ GO

    మారుతి సుజుకి సెలెరియో

    టాటా టియాగో

    మారుతి సుజుకి WagonR

    ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)

    రూ. 3.9 లక్షలు - రూ. 5.46 లక్షలు

    రూ .3.29 లక్షలు -  రూ .4.89 లక్షలు

    రూ. 4.21 లక్షలు - రూ. 5.40 లక్షలు

    రూ .3.34 లక్షలు - రూ. 5.63 లక్షలు

    రూ .4.14 లక్షలు - రూ. 5.39 లక్షలు

    ధరల పరంగా, టియోగో మరియు గో తో పోల్చి చూస్తే సాంత్రో కారు ఖచ్చితంగా చాలా ఖరీదైనదిగా ఉంటుంది. డాట్సన్ గో కూడా బేస్ వేరియంట్ లో సాన్త్రో కంటే చాలా మెరుగైనదిగా అమర్చబడింది. టాప్ స్పెక్ వేరియంట్ లో, సాన్త్రో పూర్తిగా లోడ్ చేయబడిన గో కంటే చాలా ఖరీదైనది, అంతేకాక ఇది లక్షణాల పరంగా దాదాపు సమానంగా ఉంటుంది. మేము తొందరలోనే సాంత్రో తో ఇతర మోడళ్ళ ప్రతీ వేరియంట్ ని పోల్చి మీ ముందుకు తీసుకొని వస్తాము, దీనివలన మీకు ఏ కారు మీ డబ్బుకి మంచి విలువను అందిస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది.   

    ఈ నూతన విభాగంలోని కొత్త శాంత్రో మరియు ఫేస్లిఫ్టేడ్ గో యొక్క ప్రవేశము ఖచ్చితంగా వేడిని ప్రారంభించింది. మారుతి సుజుకి సంస్థ జనవరి, 2019 లో తన యొక్క కొత్త వాగన్ఆర్ ను విడుదల చేసిన తరువాత ఈ సెగ్మెంట్ లో పోటీలు మరింత రసవత్తరంగా సాగుతుంది.  

    was this article helpful ?

    Write your Comment on Hyundai శాంత్రో

    explore similar కార్లు

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience