డెలివరీ ప్రారంభం కావడంతో డీలర్ؚషిప్ؚల వద్దకు చేరుకున్న స్కోడా-వోక్స్వాగన్ లావా బ్లూ సెడాన్ؚలు

స్కోడా స్లావియా కోసం shreyash ద్వారా మే 17, 2023 05:56 pm ప్రచురించబడింది

  • 41 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

స్కోడా “లావా బ్లూ” రంగును స్లావియా ప్రత్యక ఎడిషన్ؚగా పరిచయం చేసింది, వోక్స్వాగన్ ఈ రంగును విర్టస్ؚలో ప్రామాణిక రంగు ఎంపికగా అందిస్తుంది

Skoda Slavia and Virtus Lava Blue Editions

  • స్కోడా, స్లావియా “లావా బ్లూ” ఎడిషన్ؚను 1.5-లీటర్ టర్బో పెట్రోల్ వేరియెంట్ؚలుగా అందిస్తుంది.

  • ఈ సరికొత్త నీలి రంగు షేడ్ؚను విర్టస్ 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ టర్బో పెట్రోల్ మోడల్ రెండిటిలో అందిస్తుంది.

  • ఖరీదైన ఈ రంగులు ఆక్టవియా మరియు కోడియాక్ వంటి హై-ఎండ్ స్కోడా కార్‌లలో అందుబాటులో ఉంటాయి.

  • వోక్స్వాగన్ؚ విధంగా కాకుండా, స్కోడా స్లావియా “లావా బ్లూ” ఎడిషన్ؚకు రూ.28,000 అధిక ధరను వసూలు చేస్తుంది.

స్కోడా స్లావియా మరియు వోక్స్వాగన్ విర్టస్ ప్రస్తుతం సరికొత్త “లావా బ్లూ” ఎక్స్ؚటీరియర్ రంగులో లభిస్తున్నాయి, ఈ యూనిట్‌లు ఇప్పటికే డీలర్ؚషిప్ؚల వద్దకు చేరుకున్నాయి. “లావా బ్లూ” పెయింట్ ఎడిషన్ؚను ముందుగా స్కోడా, కుషాక్ మరియు స్లావియా మోడల్‌లలో విడుదల చేసింది. ఖరీదైనది ఈ నీలం రంగు, ఈ బ్రాండ్ ప్రీమియం ఉత్పత్తులైన సూపర్బ్, ఆక్టవియా మరియు కోడియాక్ వంటి వాటిలో వస్తుంది. కొద్ది రోజుల తరువాత, వోక్స్వాగన్ కూడా ఈ రంగు ఎంపికను తమ నవీకరించబడిన శ్రేణితో పాటు విర్టస్ మరియు టైగూన్ؚలతో అందించింది.

కొత్తగా ఏమి ఆశించవచ్చు?

Skoda Slavia

నీలం రంగు ఎక్స్ؚటీరియర్ కాకుండా, స్లావియా లావా బ్లూ ఎడిషన్, హెక్సాగోనల్ గ్రిల్ పైన క్రోమ్ రిబ్ؚలను కలిగి ఉంది. కారు పక్క మరియు వెనుక భాగాలలో కనిపించే ఇతర నవీకరణలు ఏవీ లేవు.

ఇది కూడా చదవండి: ఇప్పటికీ పరిమిత సంఖ్యలో లభిస్తున్న 2023 స్కోడా కోడియాక్ 

Volkswagen Virtus

విర్టస్ గురించి చెప్పాలంటే, “లావా బ్లూ” కొత్త ఎడిషన్ మాత్రమే కాదు దీన్ని ప్రామాణిక  పెయింట్ ఎంపికలా అందిస్తున్నారు. స్లావియా విధంగా కాకుండా, వోక్స్వాగన్ సెడాన్‌లో లుక్ పరంగా ఎటువంటి మార్పులు లేదా క్రోమ్ జోడింపులు కలిగి లేదు.

ఈ సెడాన్‌లు విడుదల అయినప్పుడు ఉన్న ప్రకాశవంతమైన రైజింగ్ బ్లూ (విర్టస్) మరియు క్రిస్టల్ బ్లూ (స్లావియా)లకు లావా బ్లూ రంగు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. అయితే, పై కప్పు నలుపు రంగుతో, ఈ రంగులను డ్యూయల్ టోన్ ఎంపికలతో కూడా అందిస్తారు.

ఇది కూడా చదవండి: 4 సరికొత్త EVలతో పాటుగా కొత్త-జెన్ స్కోడా సూపర్బ్ & కోడియాక్ టీజర్ విడుదల  

పవర్ؚట్రెయిన్ ఎంపికలు

Volkswagen Virtus Engine

స్లావియా ఈ ప్రత్యేక రంగు ఎడిషన్‌ను 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఎంపికకు పరిమితం చేసింది, ఇది 6-స్పీడ్‌ల మాన్యువల్ మరియు 7-స్పీడ్‌ల DSG గేర్‌బాక్స్ ఎంపికలు రెండిటితో వస్తుంది. వోక్స్వాగన్ విర్టస్ؚలో “లావా బ్లూ” రంగును దాని పూర్తి లైన్అప్ؚలో పొందవచ్చు, ఇది 1-లీటర్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లు మరియు వాటి ట్రాన్స్ؚమిషన్‌ల ఎంపికలు రెండిటిలో కూడా వస్తుంది.

ధరలు 

స్లావియా “లావా బ్లూ” ఎడిషన్ పై స్కోడా రూ.28,000 అదనపు ధరను వసూలు చేస్తుంది. దీని ధర రూ.17.28 లక్షల నుండి రూ.18.68 లక్షల వరకు ఉంది. ఇంతకు ముందు పేర్కొన్నట్లు, విర్టస్ “లావా బ్లూ” ఎక్స్ؚటీరియర్ రంగు కేవలం ప్రామాణిక పెయింట్ ఎంపిక మాత్రమే, ఇది అన్నీ వేరియెంట్ؚలలో మరియు రెండు ఇంజన్ ఎంపికలలో లభిస్తుంది. వోక్స్వాగన్ సెడాన్ ధరలు రూ.11.48 లక్షల నుండి రూ.18.57 లక్షల వరకు ఉంటాయి. స్లావియా మరియు విర్టస్ؚలు రెండూ హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ؚలతో పోటీ పడతాయి.

అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు

ఇక్కడ మరింత చదవండి : స్లావియా ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన స్కోడా స్లావియా

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience