4 సరి-కొత్త EVలతో పాటు కొత్త-జనరేషన్ స్కోడా సూపర్బ్ & కోడియాక్‌ల టీజర్‌ను విడుదల చేసిన స్కోడా
స్కోడా enyaq కోసం ansh ద్వారా ఏప్రిల్ 28, 2023 01:51 pm ప్రచురించబడింది
- 56 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ అన్నీ మోడల్‌లు స్కోడా గ్లోబల్ రోడ్ మ్యాప్ؚ 2026లో భాగం
-
కొత్త- జనరేషన్ సూపర్బ్ మరియు కోడియాక్ؚలను స్కోడా మొదటిసారిగా టీజ్ చేసింది.
-
ఈ రెండు మోడల్‌ల అధికారిక విడుదల 2023 రెండవ భాగంలో ఉంటుంది అని తెలియచేసింది.
-
పూర్తిగా-నిర్మించిన ఇంపోర్ట్ؚలుగా ఈ రెండు మోడల్‌లు 2024 నాటికి భారతదేశంలో ప్రవేశించవచ్చు.
-
వివిధ విభాగాలలో నాలుగు కొత్త EVలను కూడా పరిచయం చేస్తున్నట్లు ఈ కారు తయారీదారు వెల్లడించారు.
-
కరోక్ EV భర్తీతో ప్రారంభించి, అన్ని EVలు 2026 నాటికి విడుదల కానున్నాయి.
భారతదేశ లైనప్ నుంచి స్కోడా సూపర్బ్ ఇటీవల తొలగించబడింది, దీని రాబోయే జనరేషన్ అప్ؚడేట్, 2026 వరకు ఈ చెక్ కారు తయారీదారు రోడ్ మ్యాప్ؚలో భాగంగా అధికారికంగా టీజ్ చేయబడింది. 2026 చివరిలో విడుదల కానున్న నాలుగు కొత్త ప్యూర్ EV మోడల్‌ల నిర్ధారణతో సహా, కొత్త జనరేషన్ కోడియాక్ మొదటి వీక్షణ కూడా పొందాము.
కొత్త సూపర్బ్ & కోడియాక్
టీజర్‌లో, ఈ రెండు నవీకరించబడిన స్కోడా ఫ్లాగ్ؚషిప్ మోడల్‌ల గురించి చాలా తక్కువ తెలియచేశారు. రెండు మోడల్‌లలో, తేలికపాటి ఎక్స్ؚటీరియర్ మార్పులలో భాగంగా నాజూకైన LED హెడ్ లైట్‌ల సెట్‌లు మరియు నాజూకైన LED టెయిల్ ల్యాంప్ؚలు కనిపించాయి. రెండు మోడల్‌ల పవర్ؚట్రెయిన్ ఎంపికల వివరాలను కూడా కారు తయారీదారు పంచుకున్నారు, స్కోడా వీటిని పెట్రోల్, డీజిల్, మైల్డ్ – మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ؚలలో అందించనుంది.
కొత్త-జెన్ మోడల్‌లలో చాలా వరకు మార్పులు లోపలి భాగంలో ఉంటాయి అని స్కోడా వెల్లడించింది. కాబట్టి, మరిన్ని ఫీచర్‌లు మరియు సాంకేతికతతో ఉండే మరింత ప్రీమియం క్యాబిన్ؚను ఆశించవచ్చు.
ఇది కూడా చదవండి: కొత్త ప్రత్యేక ఎడిషన్ؚలను పొందిన స్కోడా స్లావియా మరియు కుషాక్
బహుశా నవీకరించబడిన స్కోడా ఆక్టావియాతో పాటు, ఈ రెండు మోడల్‌లు భారత దేశంలో 2024 నాటికి చేరుకుంటాయని అంచనా.
నాలుగు కొత్త EVలు
తమ ఎలక్ట్రిక్ కార్ లైన్అప్‌ను నవీకరించడానికి ప్రయత్నిస్తున్న అనేక కారు తయారీదారుల విధంగానే, స్కోడా కూడా వివిధ ఆకారాలు మరియు పరిమాణాలలో ఆరు ఎలక్ట్రిక్ కార్‌లతో తమ భవిష్య ప్రణాళికను వెల్లడించింది. ఇందులో నాలుగు సరి-కొత్త EVలు, రెండు ఎన్యాక్ మరియు ఎన్యాక్ కూపే నవీకరణలు. స్కోడా నుంచి వచ్చే సరికొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడల్‌లు ఈ క్రింది విధంగా రావచ్చు:
-
2025లో “చిన్నది” – MQB A0 ప్లాట్ఫార్మ్‌పై ఆధారపడి మరియు 4.2 మీటర్‌ల పొడవు ఉండే ఈ కారు, స్కోడా ఎంట్రీ-లెవెల్ EV
-
2024లో “కాంపాక్ట్” – ఇది కరోక్ స్థానంలో వచ్చే ఎలక్ట్రిక్ వాహనం మరియు ఇది ఎల్రోక్ పేరుతో రావచ్చు.
-
2026లో “కాంబి” – ఇది స్కోడా ఐకానిక్ వాహనల లైన్ؚను కొనసాగితుంది, సుమారుగా ఆక్టావియా కాంబి పరిమాణంలో ఉంటుంది
-
2026లో “స్పేస్” – ఇది S SUV కాన్సెప్ట్ 7-సీటర్ విషన్ ప్రొడక్షన్ వెర్షన్
నవీకరించబడిన ఎన్యాక్ లైనప్ؚను స్కోడా ప్రపంచ వ్యాప్తంగా 2025లో ఆవిష్కరిస్తుంది.
ముందుగా తదుపరి-జనరేషన్ సూపర్బ్ మరియు కోడియాక్ؚలను చూడవచ్చు, కారు తయారీదారు నుండి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు రాబోయే సంవత్సరాలలో చూడవచ్చు. ప్రస్తుత ఎన్యాక్ iV, హ్యుందాయ్ అయోనిక్ 5 మరియు కియా EV6 వంటి వాటికి పోటీగా ప్రీమియం CBU EV ఆఫరింగ్ؚగా త్వరలో భారత మార్కెట్‌లోకి ప్రవేశిస్తుందని అంచనా.
ఇక్కడ మరింత చదవండి: సూపర్బ్ ఆటోమ్యాటిక్