Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

నవంబర్ 6న విడుదల కానున్న Skoda Kylaq వివరాలు వెల్లడి

అక్టోబర్ 16, 2024 03:52 pm dipan ద్వారా ప్రచురించబడింది
94 Views

స్కోడా కైలాక్ కుషాక్ మరియు స్లావియా నుండి 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల ఎంపికతో అందించబడుతుంది.

  • కైలాక్ భారతదేశంలో స్కోడా యొక్క ఎంట్రీ లెవల్ SUV కారు.

  • ఇది వెంటిలేషన్ ఫంక్షన్ మరియు ఆల్-LED లైటింగ్ సెటప్‌తో 6-వే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు పొందుతుంది.

  • భద్రత కోసం, 6 ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్) మరియు మల్టీ-కొలిజన్ బ్రేక్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

  • ఇది 3,995 మి.మీ పొడవు మరియు 189 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో 2,566 మి.మీ వీల్‌బేస్ కలిగి ఉంది.

  • దీని ధర రూ. 8.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

స్కోడా కైలాక్ యొక్క గ్లోబల్ ప్రీమియర్ 6 నవంబర్ 2024న జరగబోతోంది, ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో విడుదల కానుంది. ఇప్పుడు కంపెనీ ఈ సబ్-4m SUV కారు యొక్క ఫీచర్లు, పరిమాణం మరియు ఇంజిన్-గేర్‌బాక్స్‌కి సంబంధించిన కొంత సమాచారాన్ని పంచుకుంది, దాని గురించి మరింత వివరంగా పరిశీలిద్దాం:

స్కోడా కైలాక్: ఏమి వెల్లడైంది?

స్కోడా కైలక్ అనేది సబ్-4m SUV కారు. ఇది MQB-A0-N ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది, దీని మీద స్కోడా స్లావియా మరియు కుషాక్ కూడా నిర్మించబడ్డాయి. దీని పరిమాణం క్రింది విధంగా ఉంది:

పొడవు

3,995 మి.మీ

వెడల్పు

వెల్లడించాలి

ఎత్తు

వెల్లడించాలి

వీల్ బేస్

2,566 మి.మీ

గ్రౌండ్ క్లియరెన్స్

189 మి.మీ

స్కోడా కైలాక్ SUV యొక్క వెడల్పు మరియు ఎత్తు గురించి సమాచారం త్వరలో వెల్లడి చేయబడుతుంది. అయితే, మారుతి బ్రెజ్జా మరియు టాటా నెక్సాన్ వంటి ప్రముఖ కార్లతో పోల్చినట్లయితే, దాని పొడవు ఒకే విధంగా ఉంటుంది. అయితే, కైలాక్‌ వీల్‌బేస్ బెజ్జా కంటే 66 మిమీ పొడవు మరియు నెక్సాన్ కంటే 68 మిమీ పొడవుగా ఉంది. మరోవైపు, రెండు ప్రత్యర్థుల గ్రౌండ్ క్లియరెన్స్ కైలాక్ కంటే మెరుగ్గా ఉంది.

కైలాక్‌‌లో 6-వే పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు (వెంటిలేషన్ ఫంక్షన్‌తో), 6 ఎయిర్‌బ్యాగ్‌లు (ప్రామాణికం) మరియు మల్టీ-కొలిజన్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు లభిస్తాయని స్కోడా ధృవీకరించింది. కైలాక్‌ SUV స్లావియా మరియు కుషాక్ నుండి అదే 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (115 PS/ 178 Nm)తో వస్తుందని స్కోడా వెల్లడించింది. ఈ ఇంజన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ (టార్క్ కన్వర్టర్) గేర్‌బాక్స్ ఎంపిక అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి: 2024లో విడుదల కానున్న ఈ కార్లపై ఓ లుక్కేయండి

స్కోడా కైలాక్: ఒక అవలోకనం

కొంతకాలం క్రితం, స్కోడా కైలాక్ యొక్క టీజర్ విడుదల చేయబడింది, దీని ద్వారా మేము దాని కొన్ని ఎక్స్‌టీరియర్ ఫీచర్ల గురించి సమాచారాన్ని పొందాము. ఇది ఇతర స్కోడా కార్ల మాదిరిగానే సిగ్నేచర్ బటర్‌ఫ్లై గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్ మరియు ర్యాప్‌రౌండ్ LED టెయిల్ లైట్‌ని పొందుతుంది.

కైలాక్ కారు క్యాబిన్ గురించి స్కోడా ఇంకా ఒక సంగ్రహావలోకనం ఇవ్వలేదు. అయితే, దీని డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ కుషాక్‌ను పోలి ఉండవచ్చు. ఇది 10-అంగుళాల టచ్‌స్క్రీన్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లతో అందించబడుతుంది.

స్కోడా కైలాక్: ధర మరియు ప్రత్యర్థులు

స్కోడా కైలాక్ ధరలు రూ. 8.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇది టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కైగర్లతో పోటీపడుతుంది. అంతే కాకుండా ఇది మారుతి ఫ్రాంక్స్ మరియు టయోటా టైజర్ వంటి సబ్-4m క్రాస్‌ఓవర్‌లతో కూడా పోటీపడుతుంది.

ఆటోమొబైల్ ప్రపంచం నుండి తక్షణ అప్‌డేట్‌లను పొందడానికి కార్దెకో వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.

Share via

Write your Comment on Skoda కైలాక్

S
sanjay sharma
Oct 15, 2024, 9:21:03 PM

Something I didn't like in Skoda and VW is the placement of Turn indicator and wiper controls. They are as per German left hand drive system and not as per indian system.

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
ఎలక్ట్రిక్ఫేస్లిఫ్ట్
Rs.65.90 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.10 - 11.23 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర