ఎస్ క్రాస్: ఇది మారుతి చౌక కార్ల తయారీదారి అనే పేరుని పోగొడుతుందా?
మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం అభిజీత్ ద్వారా ఆగష్టు 04, 2015 12:34 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్ : మారుతీ సంస్థ ఆధునిక భారత ఆటో రంగ పరిణామంలో భారతీయ ప్రయాణీకుల కార్ల విభాగంలో ఉత్తమ స్థానంలో ఉంది. ఆరంభంలో మారుతి 800 విజయం సాధించడంతో అప్పుడు ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో ఆల్టో, వ్యాగన్ఆర్ మరియు ఆ జాబితా ఇంకా పెరిగింది. ఈ కార్లన్నీ కూడా వినియోగదారులు సంస్థ పై బలమైన నమ్మకం పెంచుకొనేలా చేశాయి. అలానే, ఈ కార్లు సంస్థ యొక్క అమ్మకాలు పెంచాయి. కానీ మారుతీ ఎల్లప్పుడూ చిన్న కార్లు ఉత్పత్తి చేసే సంస్థగానే పేరు పొందిది. అందుకని వారు ప్రీమియం ఉత్పత్తి తీసుకుని ఆ ఇమేజ్ ని తొలగించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఏ కార్లు అయితే, బెంచ్మార్క్ ఉత్పత్తులు అని భావించామో అవి ఇక్కడ విఫలమయ్యాయి. ఉదాహరణకు బాలెనో, అత్యంత మన్ననలను పొందినప్పటికీ, అది వాణిజ్యపరంగా విఫలమయ్యింది. విటారా , వర్సా మరియు కిజాషి కూడా అదే విధంగా విఫలమయ్యాయి. దీని వలన భారతదేశం యొక్క ప్రజలు మారుతిని ప్రీమియం కారు తయారీదారిగా గుర్తించడానికి సిద్ధంగా లేరు. ప్రతీసారి, ఈ సంస్థ ప్రీమియం కారు తయారీదారిగా పేరు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ విఫలమవుతుంది. అయితే, ఎస్ ఎక్స్4 ప్రవేశంతో ఆ ఇమేజ్ కొంతవరకూ మారేలా కనిపించింది. ఎందుకంటే, అది పొడవైన రూపంతో చాలా మంది వినియోగదారులను ఆకర్షించింది. కానీ దీనిలో డీజిల్ లేకపోవడంతో మరియు హోండా సిటీ వంటి కారుతో పోటీ కారణంగా ఇది కూడా విఫలమయ్యింది.
ఇది పక్కన పెడితే, సియాజ్ చాలా మంది కొనుగోలుదారులను ఆకర్షించింది. బహుశా, మారుతి చివరకు చిన్న చౌక కార్ల తయారీ అనే పేరు నుండి బయటపడిపోతుంది. ముఖ్యంగా ఇది నెక్సా డీలర్షిప్ ద్వారా దాని ఎస్- క్రాస్ ప్రవేశపెట్టడంతో ఆ ఇమేజ్ పోవచ్చు. ఈ మారుతి ప్రీమియం డీలర్షిప్ అనగానే అంచనాలను కచ్చితంగా ఎక్కువగానే ఉంటాయి. ఈ వ్యక్తులు కంపెనీ మానేజర్ పరిష్కరించే విధానం మరియు మరింత అమ్మకాలు తర్వాత సేవ పై దృష్టి సారిస్తారు. ఇటువంటి అంశాలు మారుతీ అమ్మకాలను మరింతగా పెంచే అవకాశం ఉంది.
ఎస్- క్రాస్ గురించి మాట్లాడుకుంటే, దీని లోపల చాలా విశాలంగా, ప్రీమియం లెథర్ అపోలిస్ట్రీ మరియు నాణ్యత వంటి వాటితో రాబోతున్నది. అలానే దీనిలో మీడియా నేవిగేషన్ సమాచార వ్యవస్థ మరియు క్రూజ్ నియంత్రణ కూడా కలదు. దీని లోపల భాగం అంతా వెండి చేరికలతో నలుపు రంగులో ఉంటుంది. యాంత్రికంగా, ఇది 1.6 లీటర్ డిడి ఐ ఎస్320 ఇంజిన్ తో రాబోతున్నది. దీని ముందరి భాగాన్ని చూస్తే, ఇది ఎస్యువి కి దగ్గరగా అనిపిస్తుంది కానీ పెద్ద కారు కాదు. ఇది కొంచెం నిరాశ చెందే విషయం.
దీనితో పోటీ కి హ్యుందాయ్ క్రెటా మరియు ఎకోస్పోర్ట్ వంటి కార్లు నిజంగా అద్భుతంగా మరియు మరింత ఎస్యువి లా కనిపించే కార్లు ఉన్నాయి. అలానే, ఎడబ్లుడి ఎంపికతో డస్టర్ ఆఫ్ రోడింగ్ సామర్ధ్యానికి దగ్గరగా ఉంది.
దీని క్రింద భాగంలో ఎస్-క్రాస్ అనే పేరు ఉంది. లోపల ప్రీమియం మరియు 1.6 లీటర్ డిడి ఐఎస్320 మోటార్ తో చూడడానికి అంత ఆకర్షణీయంగా లేదు. కాబట్టి, అది మారుతి ఒక చిన్న కార్ల తయారీ సంస్థ అనే పేరుని మార్చి వేయగలదా? ఖచ్చితంగా మార్చవచ్చేమో ఎందుకంటే, ఇది నెక్సా డీలర్షిప్ ద్వారా రాబోతుంది. ఇప్పటికే దీని ధర తో ఇది చాలా మంది వినియోగదారులను ఆకర్షిస్తుంది. సంస్థ కూడా ఈ కొత్త ఉత్పత్తులకి ఒక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికను లేదా ఎడబ్లుడి ఎంపిక వంటి నవీకరణలను సకాలంలో పొందవచ్చు.