రెనాల్ట్ క్విడ్ 1.0ల రహస్యంగా పరీక్ష జరుపుకుంటుంది .దీనిని ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్నారు.
జనవరి 27, 2016 01:15 pm cardekho ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ క్విడ్ హాచ్బాక్ యొక్క ఎదురుచూస్తున్న 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ ని ప్రదర్శించబోతోంది. భారతీయ వినియోగదారుల విజ్ఞప్తి మేరకు తగ్గించినటువంటి పోటీ ధర దీని యొక్క విజయానికి కారణం. ఈ కొత్త క్విడ్ రాబోయే ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనుంది. అందరి ఊహలని నిజం చేయడానికి క్విడ్ మొదటిసారి 1 లీటర్ వెర్షన్ ఇంజిన్ ని జోడించి బ్రెజిల్ లో పరీక్ష జరుపుకుంది.
నివేదికల ప్రకారం నవీకరించిన క్విడ్ 2016 లో భారతదేశం లో ప్రారంభించబడుతుంది అని భావిస్తున్నారు. ఈ శక్తివంతమయిన వెర్షన్ 77bhp యొక్క ఉత్పాదకత కలిగి ఉంటుందని భావిస్తున్నారు. బహుశా దేశంలో ఇకమీదట కార్ల సెగ్మెంట్ లో బడ్జెట్ విప్లవం రాబోతోంది. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ భవిష్యత్తు లో 800cc మరియు 1 లీటర్ రెండు నమూనాలకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్స్ తో పాటూ డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ ని పరిచయం చేయాలని యోచిస్తోంది.
బ్రెజిలియన్ మీడియా నివేదికల ప్రకారం, ఈ రహస్య నమూనా భారతదేశం స్పెక్ నమూనా ని పోలి ఉంటుంది. క్రోం ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్ వెనుక వీక్షణ అద్దాలు మరియు బాడీ రంగు బంపర్స్ కూడా వస్తాయని అంచనా వేస్తున్నారు. రెండు నమూనాల అంతర్గత భాగాలు కొంతవరకు పోలి ఉంటాయి. కానీ రంగు థీమ్స్ మరియు సీటు కవర్లు వంటి స్థానిక అభిరుచులు భారత దేశ నమూనాని తెలియజేస్తాయి.
బ్రెజిల్ లో, రెనౌల్ట్ క్విడ్ సుమారు 30,000 రియాల్స్ (సుమారు రూ. 5 లక్షలు)ధరకే లభిస్తాయని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ లో రెనౌల్ట్ క్విడ్ యొక్క 800cc పెట్రోల్ వెర్షన్ భారతదేశం లో ప్రారంభించబడింది. దాని ప్రారంభం అయిన కేవలం రెండు నెలల్లో, ఇది డిసెంబర్ నెలలో పది అత్యుత్తమ విక్రయ మోడళ్ల జాబితాలో చోటు చేసుకుంది. భారతదేశం వంటి ఒక ధర చేతన మార్కెట్ లో, రెనౌల్ట్ సుమారు 10.600 యూనిట్లను విక్రయించింది. మరియు కొన్ని నగరాల్లో దీని డిమాండ్ వలన వినియోగాదారుల ను అత్యధికంగా 10 నెలల కాలం వేచి ఉండేలా చేసింది.
ఇది కూడా చదవండి;
రెనాల్ట్ క్విడ్ 1.0 లీటర్ వేరియాంట్ ఏ బి ఎస్ అనే ఫీచర్ తో రావచ్చు