• English
  • Login / Register

రెనాల్ట్ క్విడ్ 1 లీటర్ AMT ని భారతదేశంలో 2016 ఆటో ఎక్స్పోలో మొదటిసారి రంగప్రవేశం చేసింది

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం nabeel ద్వారా ఫిబ్రవరి 04, 2016 12:56 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మైదానంలో పెద్ద మీడియా సిబ్బంది తో # first2expo- ఆటో ఎక్స్పో 2016 యొక్క విశేషాలని కార్దేకో అందరికీ విసృతంగా అందిస్తుంది.

రెనాల్ట్ సంస్థ క్విడ్ యొక్క 1 లీటర్ వేరియంట్ ని AMT EASY R ట్రాన్స్మిషన్ తో ఆటో ఎక్స్పోలో నిన్న ప్రవేశపెట్టింది. ఇది అధిక విభాగాలలో క్విడ్ యొక్క విజయం విస్తరించేందుకు మరింతగా సహాయపడుతుంది. ఈ 800cc వేరియంట్ ఇప్పటికే 85,000 బుకింగ్లు దాటిపోయింది మరియు ఇప్పటికీ ఈ వేగంతో కొనసాగుతుంది. దాని ఇంజన్ కంటే క్విడ్ డబ్బు కోసం దాని విలువ ప్రశంస పొందింది మరియు బాడీ షేప్ ఎస్యువి ని పోలి ఉంటుంది. ఈ 800cc క్విడ్ గత ఏడాది డిసెంబరులో జరిగిన అమ్మకాలతో టాప్ 10 అమ్ముడైన కార్లలో మొదటిసారి ప్రవేశించింది. ఇది హ్యుందాయ్ ఇయాన్ ని మించిపోయింది, కానీ ఇప్పటికీ విభాగంలో రాజు అయిన ఆల్టో తర్వాత పరిగులు పెడుతుంది. ఈ 1 లీటర్ కారు 2016 మధ్య కాలంలో రూ.4 లక్షల ధరకి విడుదల కానుంది.

ఇది 1-లీటర్ యూనిట్ ఇంజిన్ 90Nm టార్క్ తో 77bhp శక్తిని అందిస్తుంది. ఈ కారు 998cc VVT ఇయాన్ మరియు 998cc ఆల్టో కె10 తో పోటీ పడుతుంది. మంచి ధరని కలిగి ఉండి 1 లీటర్ క్విడ్ ఇయాన్ మరియు ఆల్టో K10 ని అధిగమిస్తుంది.

Renault Kwid Climpber (Left) and Renault Kwid Racer (Right)

డిసెంబర్ 2015 లో, రెనాల్ట్ సంస్థ 160% భారీస్థాయిలో వృద్ధి నమోదు చేసుకుంది. ఇది డిసంబర్ 2014 లో 3,956 వాహనాలను అమ్మకాలు చేయగా 2015 లో 10,292 యూనిట్లు అమ్మకాలు చేసింది. 10,292 యూనిట్లలో 6,888 యూనిట్లు క్విడ్ కి చెందినవి. 2015 క్యాలెండర్ సంవత్సరంలో, రెనాల్ట్ 53,847 యూనిట్లు అమ్మకాలు చూసి 2014 సంవత్సరంలో 20.1% ఎక్కువ అమ్మకాలు చేసింది. సెప్టెంబర్ 24, 2015 లో క్విడ్ ప్రారంభించబడిన తరువాత కొద్ది రోజుల్లోనే 25,000 బుకింగ్లు పొందింది మరియు అక్టోబర్ చివరి నాటికి బుకింగ్స్ 50,000 కు పెరిగింది. ఫలితంగా, కారు కోసం నిరీక్షణ కాలం 2 నెలలకు చేరుకుంది.

కార్ ఉత్పత్తిదారుడు ఆటోమొబైల్ కార్యక్రమంలో ఎంట్రీ స్థాయి హ్యాచ్బ్యాక్ మరింత స్పోర్టీ వర్షన్ తో పాటు ఆఫ్ రోడీ క్విడ్ ని ప్రదర్శించారు. ఈ వాహనంలో ప్రత్యేఖంగా నవీకరణగా చెప్పుకోదగినవి కలర్ స్కీం లు.

రెనాల్ట్ క్విడ్ ప్రదర్శిత వీడియో చూడండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Renault క్విడ్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience