భారతదేశంలో రూ. 93 లక్షల వద్ద విడుదలైన రేంజ్ రోవర్ వెలార్ ఫేస్లిఫ్ట్
నవీకరించబడిన వెలార్ సూక్ష్మమైన బాహ్య డిజైన్ మార్పులు మరియు అప్‌డేట్ చేయబడిన క్యాబిన్‌ను పొందింది
- పూర్తిగా లోడ్ చేయబడిన డైనమిక్ HSE అను ఒకే ఒక వేరియంట్లో అందుబాటులో ఉంటుంది.
- బాహ్య మార్పులలో కొత్తగా రూపొందించబడిన గ్రిల్ మరియు నవీకరించబడిన లైటింగ్ అంశాలు ఉన్నాయి.
- ఆన్‌బోర్డ్ ఫీచర్‌లలో 11.4-అంగుళాల టచ్‌స్క్రీన్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి.
- ఇప్పటిలాగే 250PS 2-లీటర్ పెట్రోల్ మరియు 204PS 2-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది .
- బుకింగ్‌లు ఇప్పటికే జరుగుతున్నాయి, సెప్టెంబర్ 2023 నుండి డెలివరీలు ప్రారంభమవుతాయి.
ల్యాండ్ రోవర్ భారతదేశంలో ఫేస్లిఫ్టెడ్ రేంజ్ రోవర్ వెలార్ SUVని రూ. 93 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. నవీకరించబడిన వెలార్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో పూర్తిగా లోడ్ చేయబడిన డైనమిక్ HSE అను ఒకే ఒక వేరియంట్ లో అందించబడుతోంది. బుకింగ్‌లు ఇప్పటికే జరుగుతున్నాయి, డెలివరీలు సెప్టెంబర్ నుండి ప్రారంభం కానున్నాయి. రేంజ్ రోవర్ వెలార్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్తగా ఏమి అందించబడ్డాయో చూద్దాం.
చిన్న డిజైన్ ట్వీక్స్
2023 ఫేస్‌లిఫ్ట్‌తో, వెలార్ కొత్త గ్రిల్ డిజైన్ మరియు ట్వీక్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లతో సహా సూక్ష్మమైన డిజైన్ మార్పులను పొందింది. హెడ్‌లైట్‌లు మరియు టెయిల్‌లైట్‌లు ఇప్పుడు చాలా సొగసైనవి మరియు కొత్త లైటింగ్ ఎలిమెంట్‌లను కలిగి ఉన్నాయి. సైడ్ భాగం విషయానికి వస్తే, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్‌ను జోడించడం మినహా ఇది పెద్దగా మారలేదు. అదనంగా, రెండు కొత్త బాహ్య షేడ్స్ కూడా పరిచయం చేయబడ్డాయి: అవి వరుసగా మెటాలిక్ వారెసిన్ బ్లూ మరియు ప్రీమియమ్ మెటాలిక్ జాదర్ గ్రే.
ఇది కూడా చూడండి: 2023 BMW X5 ఫేస్లిఫ్ట్ రూ. 93.90 లక్షలతో ప్రారంభించబడింది
క్యాబిన్ నవీకరణలు
2023 రేంజ్ రోవర్ వెలార్ యొక్క డ్యాష్‌బోర్డ్ ఇప్పుడు ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో అందించబడిన మూడు స్క్రీన్‌లకు బదులుగా కేవలం రెండు స్క్రీన్‌లను మాత్రమే కలిగి ఉంది, అంతేకాకుండా క్లైమేట్ కంట్రోల్ స్విచ్‌లు కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌లో అమర్చబడి ఉండటం వలన ఒక కొత్త లుక్ అందించబడుతుంది. ఇది ఇప్పుడు కొత్త ఫ్లోటింగ్ 11.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
నావిగేషన్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ ఇంటిగ్రేషన్‌తో కూడిన 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 1,300W మెరిడియన్ సౌండ్ సిస్టమ్, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైయర్, హీటెడ్, కూల్డ్ మరియు మసాజ్ ఫ్రంట్ సీట్‌లు వంటి ఇతర ఫీచర్లు వెలార్‌లో అందించబడ్డాయి . ల్యాండ్ రోవర్, వెలార్ కి యాక్టివ్ రోడ్ నాయిస్ క్యాన్సిలేషన్ సిస్టమ్ ని అందిస్తోంది, ఇది క్యాబిన్‌ను మరింత నిశ్శబ్దంగా ఉండేలా చేస్తుంది.
పవర్ ట్రైన్స్ తనిఖీ
కొత్త వెలార్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది: 2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (250PS మరియు 365Nm) మరియు 2-లీటర్ డీజిల్ ఇంజన్ (204PS మరియు 420Nm) పవర్, టార్క్ లను ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు యూనిట్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడ్డాయి మరియు ఆల్-వీల్ డ్రైవ్ (AWD) డ్రైవ్‌ట్రెయిన్ ని ప్రామాణికంగా పొందుతాయి.
రేంజ్ రోవర్ వెలార్ మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్‌తో అందించబడుతోంది.
ప్రత్యర్థులు
2023 రేంజ్ రోవర్ వెలార్, మెర్సిడెస్ బెంజ్ GLE, BMW X5, వోల్వో XC90 మరియు ఆడి Q7 వాహనాలకు గట్టి పోటీని ఇస్తుంది.
మరింత చదవండి : రేంజ్ రోవర్ వెలార్ ఆటోమేటిక్