• English
  • Login / Register

రూ.93.90 లక్షల ధరతో విడుదలైన 2023 BMW X5 ఫేస్ؚలిఫ్ట్

బిఎండబ్ల్యూ ఎక్స్5 కోసం sonny ద్వారా జూలై 17, 2023 02:10 pm సవరించబడింది

  • 2.9K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2023 X5 సవరించిన ముందు భాగం మరియు డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ డిస్ప్లేؚలతో అప్ؚడేట్ చేసిన క్యాబిన్ؚను పొందుతుంది

  • BMW X5 ఫేస్ؚలిఫ్ట్ పూర్తిగా బ్రాండ్ డిజైన్‌ను కొనసాగిస్తుంది.

  • కొత్త హెడ్ؚల్యాంపులు మరియు టెయిల్ ల్యాంపులు, అప్ؚడేట్ చేసిన గ్రిల్ డిజైన్ؚ దీన్ని వేరుగా నిలిచేలా చేస్తాయి.

  • 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు 14.9-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ؚస్క్రీన్ ఈ నవీకరణలో జోడించబడ్డాయి.

  • పనోరమిక్ గ్లాస్ రూఫ్, పవర్డ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు ప్లష్ అప్ؚహోల్ؚస్ట్రీలను కొనసగిస్తుంది.

  • అప్ؚడేట్ చేసిన టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ؚలు ప్రస్తుతం 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్ؚతో మరియు మరింత మెరుగైన పనితీరుతో వస్తాయి.

BMW X5 2023 Launched

లగ్జరీ విభాగంలో BMW X5 అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ SUVలలో ఒకటి. దీని నవీకరించిన మోడల్ 2023 ప్రారంభంలో విడుదలైంది, ప్రస్తుతం ఇది మన దేశంలోకి ప్రవేశించింది. X5 ఫేస్ؚలిఫ్ట్ రెండు వేరియెంట్ؚలలో అందించబడుతుంది, ఇందులో పెట్రోల్ మరియు డీజీల్ ఇంజన్ ఎంపికలు రెండూ ఉంటాయి, వీటి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

BMW X5 వేరియెంట్ؚలు

పెట్రోల్ (xDrive40i)

డీజిల్ (xడ్రైవ్30d)

xలైన్

రూ. 93.90 లక్షలు

రూ. 95.90 లక్షలు

M స్పోర్ట్

రూ. 1.04 కోట్లు

రూ. 1.06 కోట్లు

టాప్-స్పెక్ M స్పోర్ట్ వేరియెంట్ؚల ఫేస్ؚలిఫ్ట్ ధర మునుపటి మోడల్ కంటే సుమారు రూ.6 లక్షల ఎక్కువ ఉంటుంది.

నవీకరించిన X5లో కొత్తగా ఉన్నవి ఏమిటి?

2023 X5ను సవరించిన ముందు భాగంతో గుర్తించవచ్చు, ప్రస్తుతం ఇందులో కొత్త ఫ్రంట్ బంపర్‌పై నిలువుగా ఎయిర్ ఇన్ؚటేక్ؚలు ఉన్నాయి. ప్రధాన గ్రిల్ సైజు మరింత పెద్దదిగా మరియు ప్రకాశవంతమైన మెరుపును పొందినాయి, LED హెడ్ؚల్యాంపులు ఇప్పుడు నాజూకుగా కొత్త లైట్ సిగ్నేచర్ؚతో వస్తున్నాయి. వెనుక వైపు, గమనించగలిగిన ఏకైక డిజైన్ మార్పు LED టెయిల్ ల్యాంపుల కోసం పునఃరూపొందించిన లేఅవుట్. ఈ లగ్జరీ SUV ధృఢమైన లుక్ కోసం కొట్టొచ్చినట్లు కనిపించే వెనుక స్కిడ్ ప్లేట్ؚలతో దిగువ అంచు మొత్తం క్లాడింగ్ؚను పొందుతుంది. 

స్పోర్టియర్ లుక్ కోసం వెండి రంగుకు బదులుగా ఎక్స్ؚటీరియర్ చుట్టుపక్కల నలుపు రంగు ఎలిమెంట్ؚలను పొందుతుంది.BMW X5 facelift interior

కొనుగోలుదారుల దీని క్యాబిన్‌లో భారీ మార్పులను గమనించవచ్చు. నవీకరించిన X5, వంపు తిరిగిన ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిస్ప్లేలతో ప్రస్తుత BMW డ్యాష్‌బోర్డ్ؚను పొందుతుంది – 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ؚట్రుమెంట్ క్లస్టర్ మరియు 14.9-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ؚస్క్రీన్. ప్రస్తుతం ఇందులో ముందు ప్రయాణీకుల ప్రాంతంలో డ్యాష్ؚబోర్డ్ చుట్టూ ఆంబియెంట్ లైటింగ్ బార్ؚతో కూడా వస్తుంది.

కొత్త X5 పవర్ؚట్రెయిన్ؚలు

BMW X5 ఇప్పటికీ 3-లీటర్‌ల టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ؚతో వస్తుంది, కానే వీటిని 48V మైల్డ్-హైబ్రిడ్ సాంకేతికత మరియు మెరుగైన పనితీరు కోసం అప్ؚడేట్ చేశారు. వీటి వివరాలు కింద అందించబడ్డాయి:

వేరియెంట్

xడ్రైవ్40i

xడ్రైవ్30d

ఇంజన్

3-లీటర్, ఆరు-సిలిండర్‌లు

3-లీటర్, ఆరు-సిలిండర్‌లు

పవర్ 

381PS

285PS

టార్క్

520Nm

650Nm

ట్రాన్స్ؚమిషన్

8-స్పీడ్ AT

8-స్పీడ్ AT

BMW X5 facelift rear

ఆల్-వీల్-డ్రైవ్ؚను ప్రామాణికంగా అందిస్తుంది.

అనేక ఫీచర్‌లు కలిగినది 

BMW X5 టాప్ వేరియెంట్ పనోరమిక్ గ్లాస్ రూఫ్, యాక్టివ్ సీట్ వెంటిలేషన్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ముందు సీట్లు, పవర్డ్ స్ప్లిట్-టెయిల్ؚగేట్ؚల వంటి అనేక ఫీచర్‌లతో వస్తుంది. Xలైన్ వేరియెంట్ؚలో సెన్సాఫిన్ అప్ؚహోల్ؚస్ట్రీ ఉంటుంది, M స్పోర్ట్ؚలో గోధుమ లేదా తెలుపు రంగు లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీ ఎంపిక ఉంటుంది. ప్రామాణికంగా, కొత్త X5 లో 21-అంగుళాల అలాయ్ వీల్స్ ఉంటాయి, వేరియెంట్‌పై ఆధారపడి విభిన్న డిజైన్‌లలో వస్తుంది.

2023 BMW X5

మృదువైన ప్రయాణ నాణ్యత కోసం అడాప్టివ్ సస్పెన్షన్ ప్రామాణికంగా వస్తుంది, కానీ కేవలం M స్పోర్ట్ؚలోనే ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది. భద్రతపరంగా BMW X5 ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటర్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు మరియు యాక్టివ్ పార్క్ అసిస్ట్ؚలతో వస్తుంది.

పోటీదారులు

BMW X5 ఫేస్ లిఫ్ట్ మెర్సిడెస్ బెంజ్ GLE, వోల్వో XC90, రేంజ్ రోవర్ వెలార్ మరియు ఆడి Q7 వంటి వాటితో పోటీ పడుతుంది. 

ఇక్కడ మరింత చదవండి: X5 ఆటోమ్యాటిక్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on BMW ఎక్స్5

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience