రేంజ్ రోవర్ ఎస్వి ఆటోబయోగ్రఫీ డైనమిక్ రూ. 2.79 కోట్లు వద్ద ప్రారంభం
published on మార్చి 18, 2019 10:52 am by rachit shad కోసం ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్
- 12 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ల్యాండ్ రోవర్ భారతదేశంలో రేంజ్ రోవర్ యొక్క మరొక వేరియంట్ను జోడించింది. దీనిని ఎస్వి ఆటోబయోగ్రఫీ డైనమిక్ అని పిలుస్తారు మరియు ఇది, 2.79 కోట్ల (ఎక్స్ షోరూమ్ భారతదేశం) ధరకే కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఈ ధరలో, భారతదేశంలో విక్రయించబడుతున్న సంస్థ యొక్క ప్రధాన పదిహేను ఎస్యువి మోడల్లలో, మూడవ అత్యంత ఖరీదైన వేరియంట్గా ఉంది. జాగ్వార్ యొక్క అంతర్గత ట్యూనింగ్ డివిజన్ - స్పెషల్ వెహికిల్ ఆపరేషన్స్ (ఎస్విఓ) చేత రూపొందించబడినది మరియు ఇంజనీరింగ్ చేయబడినది.
దురదృష్టవశాత్తు, రేంజ్ రోవర్ యొక్క లాంగ్ వీల్బేస్ అవతార్లో, ఎస్వి ఆటోబయోగ్రఫీ యొక్క డైనమిక్ ట్రిమ్ అందుబాటులో లేదు. దాని ప్రామాణిక పరిమాణంలో కూడా ప్రీమియం ఎస్యువి సెగ్మెంట్లో అత్యధికంగా వెతుకుతున్న వాహనాల్లో ఇది ఒకటిగా ఉంది. దీని హుడ్ కింద భాగం విషయానికి వస్తే, బ్రష్ గ్యాస్ గజ్లెర్ లో 5.0 లీటర్, సూపర్ చార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజిన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా, 551పిఎస్ శక్తి మరియు 680 ఎన్ఎమ్ గల టార్క్ లను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ ఒక 8- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది మరియు ఫోర్ వీల్ డ్రైవ్ ద్వారా శక్తి పంపిణీ చేయబడి నడుపబడుతుంది. ఈ ఎస్యువి యొక్క స్థూల బరువు, 3 టన్నులు అయినప్పటికీ, అది 5.4 సెకన్లలో 0- 100 కిలోమీటర్ల ను చేరుకోగలుగుతుంది. అంతేకాకుండా ఇది, 250 కెఎంపిహెచ్ యొక్క గరిష్ట వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
ఫన్ ఫాక్ట్: పరిమిత పరుగుల జాగ్వార్ ఎక్స్ఈ ఎస్వి ప్రాజెక్ట్ 8 మరియు ఇటీవలే వెల్లడించబడిన జాగ్వార్ ఎక్స్ జె 575 లో అందించబడిన అదే ఇంజన్ తో కొనసాగుతుంది.
ఈ కారులో ఏ ఏ అంశాలు అందించబడ్డాయో ఊహించడం కష్టం, ఈ ఎస్యువి అందించబడిన గిల్స్ సౌకర్య స్థాయిని మరింత పెంచుతాయి. అంతేకాకుండా ఎస్విఓ బృందం, రేంజర్ రోవర్ ఎస్విఆటోబయోగ్రఫీ వేరియంట్ ను డైమండ్ క్విల్టెడ్ సీట్లతో అందించింది, ఇది 'ఆటోబయోగ్రఫీ' స్టిచ్చింగ్ నాలుగు అంతర్గత రంగులు ఎంపికలతో కొనుగోలుదారులకు లభిస్తుంది. గ్రాఫైట్ అట్లాస్ చేరికలు, విలక్షణమైన ఎరుపు బ్రమ్బో బ్రాండ్ కెలిపర్లు మరియు ప్రత్యేకంగా రూపొందించిన అల్లాయ్ చక్రాలు వంటివి ప్రత్యేక మెరుగులు కూడా ఉన్నాయి.
ఆసక్తిగల వినియోగదారులు, దేశవ్యాప్తంగా ఉన్న 25 అధికారిక డీలర్లతో సంబంధాన్ని పొందవచ్చు. ఈ కారు, ఏఎమ్ జి తో పనిచేసే రెండు మెర్సిడెస్- బెంజ్ నమూనాలు - జి 63 మరియు జిఎల్ఎస్ 63 మరియు పోర్స్చే కయేన్ టర్బో ఎస్ వంటి కార్లకు గట్టి పోటీని ఇస్తుంది.
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోమేటిక్ గురించిన వివరాలు మరిన్ని చదవండి
- Renew Land Rover Range Rover Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Best Health Insurance Plans - Compare & Save Big! - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful