ఫియట్ లీనియా అబార్త్ విడుదల అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి
ఫియట్ లీనియా కోసం manish ద్వారా సెప్టెంబర్ 19, 2015 03:56 pm ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఈమధ్యనే ఫియట్ లీనియా భర్తీ యొక్క చిత్రాలు ఆన్లైన్లో తలుక్కుమన్నాయి కానీ ఇప్పుడు లీనియా యొక్క అబార్త్ వెర్షన్ కూడా ఆ వరుసలోనే చేరింది. దీనిని విడుదల చేయడం వెనుక ఉన్న ఒక కారణం కస్టమర్ల నుండి వచ్చిన అనూహ్య స్పందన. ఈ ఇటాలియన్ తయారీదారి ఈ కొత్త వరుసని భారతదేశానికి అందించనున్నారు. పుంటో అబార్త్ యొక్క విడుదల అవెంచురా అబార్త్ తరువాత జరుగుతుంది.
ఆటో కార్ ఇండియా యొక్క నివేదిక ప్రకారం, ఈ ఇటాలియన్ తయారీదారి అబార్త్ లీనియా వెర్షన్ ని అభివృద్ది చేసేందుకు ప్రేరణ పొందారు. ఎందుకంటే రాబోయే పుంటో అబార్త్ లో అబార్త్ లీనియా యొక్క పునాదులు దాగి ఉంటాయి. పుంటో అబార్త్ లో ఉన్న ఒక 145 PS 1.4-లీటర్ T-జెట్ టర్బో చార్జడ్ పెట్రోల్ ఇంజిను ని అబార్త్ వెర్షన్ యొక్క లీనియా లో కూడా చోటు సంపాదిస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ని జత చేయడం అయ్యింది.
అచ్చం పుంటో అబార్త్ లాగానే ఈ సెడాన్ కి కూడా రేర్ డిస్క్ బ్రేకులు మరియూ 20mm ఎత్తు తగ్గింపు చేయడం వలన కారు యొక్క ఏరోడైనమిక్స్ మరియూ హ్యాండ్లింగ్ కారెక్టరిస్టిక్స్ ని మెరుగు పరిచేందుకు గాను అందించబడుతుంది.
ఈ లీనియా అబార్త్ లో రేర్ స్పాయిలర్, గ్రిల్లు మరియూ బాహ్యపు అద్దాలపై విభిన్న రంగులు, అబార్త్ అల్లోయ్ వీల్స్ మరియూ బాడీ డీకాల్స్ కలిగి ఉంటుంది. గణనీయమైన కస్టమర్లను లీనియా పొందలేకపోయింది కాకపోతే ఫియట్ ఔత్సాహికుల ద్వారా కొంత ఊరట లభించింది మరియూ ఇప్పుడు ఇంతకు మునుపటి కంటే శక్తిమంతమైన ఇంజినుతో వచ్చి వారి కస్టమర్లను పెంచుకునే దిశగా పనిచేస్తున్నారు.
0 out of 0 found this helpful