దక్షిణాఫ్రికాలో టెస్ట్ రన్స్ సమయంలో బయటపడిన పోర్స్చే 911 ఫేస్లిఫ్ట్
జూలై 23, 2015 10:48 am sourabh ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: పోర్స్చే దాని రాబోయే 911 ఫేస్లిఫ్ట్ యొక్క చిత్రాలు దక్షిణాఫ్రికాలో కఠినమైన టెస్ట్ రన్స్ చేస్తున్న సమయంలో బయటపడ్డాయి. ఈ ఫేస్లిఫ్ట్ మోడల్ ఎక్కువగా నిలువు స్లాట్ ఇంజిన్ వెంట్లు, ఎల్ ఇ డి డే టైం రన్నింగ్ లైట్లు, హెడ్లైట్లు , వివిధ గ్రాఫిక్స్ తో టెయిల్ లైట్స్ మరియు కొద్దిగా పునఃరూపకల్పన చేయబడిన ముందు మరియు వెనుకబంపర్లతో నవీకరణ పొందింది. కారు తయారీసంస్థ దీనిని 2015 సెప్టెంబర్ మధ్యలో ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో అధికారంగా బహిర్గతం చేయబోతుంది.
సాంకేతిక వివరణల ఇంకా వెల్లడి కావల్సి ఉంది. కానీ కెరీర శక్తివంతమైన 2.7 లీటర్ టర్బో సిక్స్ ఇంజిన్ 407ps శక్తిని అందిస్తుంది. స్పోర్టియర్ కరెరా ఎస్ అయితే, 3.4 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది.
ఫేస్లిఫ్ట్ 911 ఎగ్జాస్ట్ వ్యవస్థ యొక్క క్లోసర్ టిప్స్ తో పాటూ ముందరి ఎయిర్ వెంట్లు వద్ద సమాంతర ఫిన్లు కలిగి ఉంటుంది. క్యాబిన్ లోపల, కుడి వైపు 918 స్పైడర్ నుండి తీసుకున్న డ్రైవింగ్ మోడ్ సెలెక్టర్ మరియు కొద్దిగా పెద్ద ప్రదర్శన గల సమాచర వ్యవస్థ తప్ప క్యాబిన్ లో పెద్దగా మార్పులు ఏమీ లేవు.
ఇంతలో దేశంలో, పోర్స్చే కోలకతా లో ఒక కొత్త షోరూమ్ ప్రారంభించింది. ఇది ముంబై, గుర్గావ్, బెంగుళూర్ మరియు అహ్మదాబాద్ తరువాత కంపెనీ యొక్క అయిదవ షోరూమ్ కోలకతాలో ప్రారంభమయ్యింది. ఈ షోరూమ్ 5,952 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపించి, పోర్స్చే యొక్క ఏడు మోడళ్ళను ప్రదర్శిస్తుంది. వాహన తయారీదారుడు ప్రకారం,షోరూమ్ రెండు సంవత్సరాల కాలంలో నిర్మించబడింది మరియు పోర్స్చే యొక్క అంతర్జాతీయ ప్రమాణాలకు రూపొందించబడింది.