పనమెరా డీజిల్ ఎడిషన్ ను రూ 1.04 కోట్ల వద్ద ప్రవేశపెట్టిన పోర్స్చే ఇండియా
published on జనవరి 21, 2016 12:44 pm by raunak కోసం పోర్స్చే పనేమేరా 2017-2021
- 10 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
పోర్స్చే ఇండియా, కొత్త పనమెరా డీజిల్ ఎడిషన్ ను దేశంలో రూ 1,04,16,000 (ఎక్స్-షోరూమ్ మహారాష్ట్ర) ధర ట్యాగ్ వద్ద ప్రవేశపెట్టింది. ఈ వాహనం, లోపల మరియు బాహ్య భాగాలలో అనేక కొత్త ప్రామాణిక అంశాలతో వస్తుంది మరియు ఇది, 250 హెచ్ పి పవర్ ను విడుదల చేసే 3.0 లీటర్ వి6 డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది.
సరి కొత్త పనమెరా డీజిల్ ఎడిషన్ ను ప్రవేశపెట్టినప్పుడు, భారతదేశం యొక్క పోర్స్చే డైరెక్టర్ అయిన పవన్ శెట్టి వ్యాఖ్యానిస్తూ, "ఈ పనమెరా డీజిల్ ఎడిషన్ ఉత్కంఠభరితమైన నాలుగు డోర్ల స్పోర్ట్స్ కారు మరియు ఇది, ఆనందదాయకమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడమే కాకుండా పోర్స్చే లో ఉండే అనేక స్టైలింగ్ చేరికలు వస్తుంది అని అన్నారు. ఈ వాహనానికి, అనేక అదనపు పరికరాలు ప్రామాణికంగా అందించబడతాయి మరియు ఈ వాహన ఔత్సాహికులకు, ఇది నిజమైన ఆకర్షణీయమైన అలాగే తాజా ఉత్పత్తి" అని అన్నారు.
ఈ వాహనం యొక్క బాహ్య భాగం విషయానికి వస్తే, అదనంగా ఈ వాహనం లో ఉండే ఆప్షనల్ పోర్స్చే ఎంట్రీ & డ్రైవ్, సైడ్ విండోలు మరియు డోర్ హ్యాండిళ్ళు అదే రంగులో ఉండే హై గ్లాస్ నలుపు స్ట్రిప్ లతో వస్తుంది. ఈ పనమెరా డీజిల్ ఎడిషన్ కు, టర్బో ఈఈ డిజైన్ కలిగిన 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ ప్రామాణికంగా అందించబడతాయి. వీటితో పాటు ఈ వాహనానికి, వీల్ హుబ్ కవర్లతో పాటు కలర్డ్ పోర్స్చే క్రెస్ట్ అందించబడుతుంది. అంతేకాకుండా, బై జినాన్ హెడ్ ల్యాంప్ల తో పోర్స్చే డైనమిక్ లైట్ సిస్టం (పి డి ఎల్ ఎస్) ప్రామాణికంగా అందించబడుతుంది.
అంతర్గత విభాగం విషయానికి వస్తే, ఈ పనమెరా ఎడిషన్ నలుపు లక్సర్ బీజ్ తో కూడిన బై కలర్ పార్ట్ లెధర్ అపోలిస్ట్రీ సీట్లకు అందించబడుతుంది. ఈ సీట్ల తో పాటు హెడ్ రెస్ట్లకు కూడా ఇదే అపోలిస్ట్రీ అందించబడుతుంది. వీటితో పాటు క్యాబిన్ లో ఉండే స్పోర్టీ డిజైన్ ను కలిగిన స్టీరింగ్ వీల్ మరియు డోర్ సిల్ గార్డ్ లు అన్నియూ కూడా ఇదే అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంటాయి మరియు వీటిపై ఎడిషన్ అక్షరాలు అందంగా పొందుపరచబడి ఉంటాయి. ఈ వాహనంలో, పోర్స్చే కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ (పి సి ఎం) వ్యవస్థ ప్రామాణికంగా అందించబడుతుంది మరియు ఇది, ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ మోనిటర్ కలయికతో కూడిన ఆడియో, నావిగేషన్ అలాగే కమ్యునికేషన్ లక్షణాలతో వస్తుంది. ఈ ఆడియో వ్యవస్థ, 14 స్పీకర్లతో కూడిన 585 వాట్ బోస్ సరౌండ్ సౌండ్ సిస్టం ద్వారా ఆధారితమై ఉంటుంది.
పనమెరా డీజిల్ ఎడిషన్ కు, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ తో పోర్స్చే యాక్టివ్ సస్పెన్షన్ తో పోర్స్చే యాక్టివ్ సస్పెన్షన్ మేనేజ్మెంట్ (పి ఏ ఎస్ ఎం), పార్క్ అసిస్ట్ (ముందు మరియు వెనుక), రివర్సింగ్ కెమెరా, ఎలక్టిక్ స్లైడ్ మరియు టిల్ట్ సన్రూఫ్, 4- జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఇతర అదనపు అంశాలు ప్రామాణికంగా అందించబడ్డాయి.
ఇది కూడా చదవండి:
718 ట్యాగ్ ను పొందనున్న తరువాతి తరం బోక్సస్టెర్ మరియు కేమాన్ మోడల్స్
- Renew Porsche Panamera 2017-2021 Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful