కేమాన్ GT4 యొక్క రేస్ ఫోకస్డ్ వెర్షన్ ని ప్రవేశపెట్టిన పోర్స్చే
నవంబర్ 20, 2015 05:45 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
పోర్స్చే దాని కారు కేమాన్ GT4 యొక్క రేసు ఫోకస్డ్ వెర్షన్ తో వచ్చింది. ఈ వెర్షన్ కేమాన్ GT4 క్లబ్‌స్పోర్ట్ అని పిలవబడుతుంది మరియు ఇంజిన్ పరంగా దాని ముందు దానితో పోలిస్తే అనేక పోలికలను కలిగియున్నది. అయితే, క్లబ్‌స్పోర్ట్ అదే 3.8 లీటర్ ఇంజిన్ ని కలిగియుండి 380bhp శక్తిని అందిస్తుంది. ఈ ట్రాక్ ఫోకస్డ్ వెర్షన్ ప్రామాణిక వెర్షన్ లా కాకుండా ట్రాన్స్మిషన్ కొరకు పోర్స్చే యొక్క డ్యుయల్-క్లచ్ PDK యూనిట్ ని పొంది ఉంది. సస్పెన్షన్ వ్యవస్థ 911 GT3 కూపే రేస్ కారు నుండి అమలు చేయబడినవి మరియు ఆ వ్యవస్థ ఈ రేస్ ఫోకస్డ్ కారు యొక్క నిర్వహణలో జాగ్రత్త తీసుకుంటుంది.
దీనిలో బ్రేకింగ్ వ్యవస్థ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) సహాయంతో అద్భుతమైన స్టీల్ డిస్కుల ద్వారా అందించబడుతుంది. స్టీల్ డిస్కులతో సిక్స్-పిస్టన్ కాలిపర్స్ ముందరి చక్రాలకు అందించబడి వెనుక వాటితో పోలిస్తే ఎక్కువ శక్తిని అందిస్తుంది. దీనిలో వెనుక చక్రాలు నాలుగు-పిస్టన్ కాలిపర్స్ ని కలిగి ఉంటాయి. ABS అవసరం మేరకు 12 ట్వీక్స్ సర్దుబాటుని అందిస్తుంది. అలానే దీనిలో ప్యాసింజర్ సీటు ఒక రోల్ కేజ్ తో భర్తీ చేయబడింది. డ్రైవర్ సీటు సాధారణ సీటుకి బదులుగా ఒక బకెట్ సీటు ఇవ్వడం ద్వారా భద్రత మరింతగా పెరుగుతుంది.
పోర్స్చే అమెరికా ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ కారు ఛాంపియన్షిప్స్ పోర్స్చే క్లబ్ నడిపిన పిరెల్లి వరల్డ్ ఛాలెంజ్, కాంటినెంటల్ టైర్ స్పోర్ట్స్ కారు ఛాలెంజ్ మరియు క్లబ్ రేసులకు ఉపయోగపడే విధంగా కారుని తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తుంది.
0 out of 0 found this helpful